You may want to see the entire list of posts on this blog sorted by Date. Click here for the entire Table of Contents

If you like this blog you may want to subscribe to the RSS feed | Subscribe

12 May 2009

తెదేపా దారి ఎన్డియే వైపు ????

ఇన్నాళ్ళు చంద్రబాబు తిరిగి అధికారంలోకి రాకుండా ఉంటే బావుండు అనుకున్న నేను ఇప్పుడు అలా అనుకోవడంలేదు. పూర్తిగా కాకపోయినా పాక్షికంగా నా ఆలోచన మారింది ఈ విషయంలో.

అంటే చంద్రబాబు అధికారంలోకి రావాలని కాదు. రాష్ట్రంలో చంద్రబాబు రాకూడదనే ఆలోచన, ఆశా ఇంకా ఉంది. కానీ క్రాస్ వోటింగు జరిగి, జనం యం.పి సీట్లకి తెదేపా లేక తెరాసా లకు వేసి శాసన సభకి మాత్రం వైయస్ పక్షాన వేసి ఉంది ఉంటే బావుండనిపిస్తుంది. (జనం మహా కూటమికే ఎక్కువగా వోటు వేసారని చెపుతున్న నాలో ఇంకా ఆశ చావలేదు).

ఎందుకంటే అటు చేసి ఇటు చేసి కేంద్రంలో ఎలాగూ మూడో ఫ్రంటు ఏర్పడదు అనే గట్టి నమ్మకం. అటువంటి పక్షంలో తెదేపా ఎన్డియేకి మద్దత్తు ఇస్తుందనే చిన్న ఆశ, నమ్మకమూ. దేశ సమగ్ర అభివృద్ధికి భాజపా యొక్క అజేండానే మేలు అని )నమ్మేవాడిని కదా ఎంతైనా!! (చిరంజీవి పార్టీకి వచ్చే ఒకటీ రెండు యంపి సీట్లకు అతను ఎటు పోయినా పర్లేదు అనే భావన)

కానీ ఇదంతా జరగాలంటే మొత్తంమీద బాజాపా కాంగ్రెస్ కంటే కనీసం పదో పరకో ఎక్కువ సీట్లు సాధించాలి. శనివారం వరకు వెయిట్ చేసి ఆశ ఫలిస్తుందని అనుకుందాం!!

6 comments:

Kathi Mahesh Kumar said...

చంద్రబాబును PM చేస్తారా?

Anji Babu said...

చంద్రబాబుని PM చేయాలా? CM కే ఆయన మనకి మోయలేని భారం!!

భలే వారండి. చంద్రబాబు ప్రపంచ వ్యాప్తంగా చాల పేరు గడించారు అని చెప్పుకుంటారు కదా ఆ పార్టీ నాయకులు. అమెరికా పంపి అక్కడ ఏమైనా పోసిషన్ ఇప్పిస్తాం. కాదు కూడదు అని బేరసారాలు నడిపారనుకోండి, maximum ఒక కాబినెట్ మంత్రి పదవి ఇస్తాం.

'Ministry for Complete U-turns'.. సర్దుకుపొండి.

Praveen Mandangi said...

BJP, MIM లాంటి మతతత్వ పార్టీలకి నేనెప్పుడూ వ్యతిరేకంగానే ఉంటాను. MIM కాంగ్రెస్ అనుకూల పార్టీ కాబట్టి కాంగ్రెస్ MIM మద్దతుతో గట్టు ఎక్కగలదు. BJP, MIM లాంటి మతతత్వ పార్టీల పాలనలోనైనా బతకగలం కానీ తెలుగు దేశం లాంటి పక్కా పారాసైటిక్ పార్టీల పాలనలో బతకలేం.

Anji Babu said...

బాజాపా మతతత్వ పార్టీ అనే మీ అభిప్రాయంతో నేను విభేదిస్తాను. హిందుత్వ అనేది ఒక మతపరమయిన అజెండా కాదు.

బాజాపా అనే గొడుకు కింద, బాజాపా పాడే హిందుత్వ సిద్ధాంతం యొక్క పాఠాలను విని వాటిని వక్రంగా మార్చి తమ తమ ప్రయోజనాలకు మార్చుకుని అదే భాజాపా అజెండా అని, అదే హిందూత్వ అజెండా అని చెప్ప ప్రయత్నించే శక్తులను నేను వ్యతిరేకిస్తాను. అలాని ఆ చాందసవాద శక్తులు, భాజాపా ఒకటే అని అపార్థం చేసుకోరాదు. రెంటిని ఒకే త్రాటిపై పెట్టరాదు.

Praveen Mandangi said...

BJP ఎప్పటికీ మతతత్వ పార్టీయే. ఒకవేళ రాష్ట్రంలో BJP నిజంగా బలపడి అధికారంలోకి వస్తే గోధ్రా తరహా మత ఘర్షణల జరిగి వందల సంఖ్యలో జనం చనిపోతారు. చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో వేల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవాలి. రైతాంగ సమస్యతో పోలిస్తే మతం చాలా చిన్న సమస్య. నాస్తికుడు బి.జె.పి.ని నమ్మగలడు కానీ మినిమం సెన్స్ ఉన్నవాడు చంద్రబాబు నాయుడిని నమ్మలేడు.

Anji Babu said...

మీరు నాస్తికుడు భాజాపాని నమ్మవచ్చు అని ఏ ఉద్దేశ్యంతో అన్నారోకానీ నా విషయంలో అది నిజం.

భాజాపా లో ఉన్న కొందరు చేసే దౌర్భాగ్యపు పనుల వలన పార్టీ అంతటికీ అలాంటి పేరు వస్తుంది. దేశానికి భాజాపా యొక్క అవసరం చాల ఉంది. They are the party of real nationalists. Selfless. Familyless and what not.
భాజాపా అంతా క్లీన్ అని నేను చెప్పడం లేదు. కానీ ఒక సైద్ధాంతిక పార్టీ అని చెప్పదలచాను. దేశంలో ఇంత మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. మీరు భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వారి పని తీరుని వేరే పార్టీలకు చెందినా ముఖ్యమంత్రుల పని తీరుని గమనించండి. మీకు తేడా తప్పక తెలుస్తుంది.

ఖురాన్ ని తప్పుగా చదివి కొందరు టెర్రరిస్టులుగా తయారు అవుతున్నట్లు భాజాపా సిద్ధాంతాన్ని తప్పుడు బుద్ధితో చూసిన వారు దేశానికీ భారంగా తయారు అవుతున్నారు. అది నేను అంగీకరిస్తాను.

ఇంకొక విషయం ఏమిటంటే మన రాష్ట్రంలో భాజాపా రావాలని నేను అనలేదు. కానీ వస్తే గోద్రా (గుజరాత్ లాంటి) లాంటి గొడవలు ఎందుకు వస్తాయి అండి. ఇప్పుడు భాజపా ఎన్ని రాష్ట్రాలలో అధికారంలో ఉంది. ఎక్కడా ఏమీ జరగలేదు కదా. అంతెందుకు. గుజరాత్లో ఆ తరువాత ఏమైనా జరిగినాయా ? లేదు కదా.

Post a Comment

Please leave your comments here.

Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.

 

Receive posts in your Inbox

Enter your email address:

Delivered by FeedBurner

Mobstac Badge