నిన్న పంజాబ్లో మన్మోహన్ సింగ్, ఉత్తర్ ప్రదేశ్లో సోనియా గాంధీ అక్కడి ప్రభుత్వాలను తూర్పారబట్టారు. సింగు గారు పంజాబ్ లోని అకాలీ ప్రభుత్వం జనానికి చేసేది ఏమీ లేదంటారు. UP లో సోనియా ఆ రాష్ట్ర వెనుకబాటుకు మాయవతినే కారణం అని చెప్పింది.
ఈ రెండు ప్రభుత్వాలు వచ్చి పట్టుమని రెండేళ్ళు కూడా నిండలేదు. అప్పుడే వీళ్ళు ఆ రాష్ట్రాల వెనుక బాటుకు ప్రస్తుత ప్రభుత్వాలే కారణం అని అంటున్నారు. మరి కేంద్రం ఏమి చేస్తున్నట్లు. ఈ ప్రభుత్వాలు పని చేయక పోతే లోకసభ ఎన్నికలలో వీళ్ళకు వోటు వేస్తే గడిచిన రెండేళ్ళలో కలగని అభ్యున్నతి క్రొత్తగా ఏమి జరుతుందట?
అది మాత్రం చెప్పరు. ఎందుకంటే వీళ్ళకీ తెలియదు కాబట్టి. ఎన్నికలు వచ్చాయి. వోట్లు అడగాలి. దానికోసం స్థానికంగా ఉన్న ప్రభుత్వాలను దుయ్యబట్టాలి. జనం వెర్రి వాళ్ళగా వీరి మాటలు నమ్మాలి.
ఇదే సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీ కొన్నాళ్ల క్రితం వరకు ఉత్తర్ ప్రదేశ్ వెనుకబాటుకు ములాయం కారణం అని, అక్కడ గూండా రాజ్యం నదుపుతున్నారనేవారు. ఊరూరా తిరిగి ప్రచారం చేసే వారు. ఇప్పుడు అవే కబుర్లు. అవే ప్రసంగాలు. కానీ పేర్లు మార్పు.
ఇదంతా పక్కన పెడితే గత అరవై ఏండ్లలో రాయ్ బరేలి, అమేతి నియోజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వీరి కుటుంబం వలన ఆ ప్రాంత ప్రజలకు ఒరిగినది ఏమైనా ఉందా ? లేదు. నిస్సిగ్గుగా ప్రతీ ఎన్నికల సమయంలో ఆ ప్రాంతాల వెనుకబాటుకు ప్రస్తుత ప్రభుత్వాల చిన్న చూపు వైఖరులే కారణం అని చెప్పుకు తిరుగుతుంటారు తప్ప ఆ నియోజికవర్గాలను బాగు పరిచేది లేదు.
ఇక ఇప్పుడు మాత్రం వీరికి వోటు వేసి ప్రయోజనం ఏముందిలే అని ప్రజలు వీరికి ఒక సారి వోటు వేయకుండా వదిలేస్తే బాగుండు. తిక్క కుదురుతుంది.
0 comments:
Post a Comment
Please leave your comments here.
Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.