కొంత కాలంగా అద్వానీ, మన్మోహన్ సింగ్ ల మధ్య ఎవరు సమర్ధ ప్రధాని అవ్వగలరు అనే అంశంపై వాడి వేడి వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. ఒకరినొకరు మీడియా సమక్షంలో నువ్వు బలహీనుడివి అంటే నువ్వు అని అనుకుంటూ ఉన్నారు. ఇరు వైపులా కొన్ని అంశాలు లేవనెత్తారు. పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూనే ఉన్నారు.
అయితే భాజపా నుండి ఎవరూ బీహార్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనా విధించిన సమయంలో మన్మోహన్ ప్రభుత్వం చూపించిన రాజకీయ దివాళా కోరుతనం గురించి మాట్లాడడం లేదు. ఆ అంశమే లేవనెత్త లేదు.
నా దృష్టిలో ఆ నిర్ణయంలో మన్మోహన్ సింగ్ బలహీనత బయటపడింది. తన కూటమిలో ఉన్న అనుకూలురయిన లాలు, పాశ్వాన్ ల కోసం , తమ పార్టీ అధినేత నిర్ణయం మేరకు రాష్ట్రపతి పాలన విధించారు తప్ప కొంచెం కూడా తన రాజకీయ వాస్తవికాలను పరిగణలోకి తీసుకోలేదు. ఫలితం సుప్రీం కోర్టు ఆ నిర్ణయాన్ని కొట్టి పారేయడం, దేసంపైన మరొక ఎన్నికల భారం పడడం, ఆ రాష్ట్ర ప్రజలు లాలూ కూటమికి బుద్ధి చెప్పడం. అంతే కాక మన్మోహనుడికి ఏ విధంగా రాజకీయ బంధీగా ఉన్నాడో తెలియవచ్చింది.
దేశానికి సేవ చేసే తపన ఉంటె చాలదు దేశాన్ని ముందుకు తీసుకుపోయేందుకు కావలసిన రాజకీయ సమర్ధత కూడా ఉండాలి. ముందు చూపు ఉండాలి. తన పార్టీపై పట్టు ఉండాలి. సొంత పార్టీ నాయకుల ఆగడాలను అరికట్టలేని వారు దేశాన్ని ముందుకు ఏమి నడిపిస్తారు?
1 comments:
నిజం
Post a Comment
Please leave your comments here.
Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.