You may want to see the entire list of posts on this blog sorted by Date. Click here for the entire Table of Contents

If you like this blog you may want to subscribe to the RSS feed | Subscribe

12 May 2009

జనం బొత్సకి గుణపాఠం చెపితే బావుండు.

నా బ్లాగుని ఎప్పుడైనా సందర్శించిన వారికి తెలిసే ఉంటుంది. వైయస్, చంద్రబబులలో నేను వై యస్ వైపే మొగ్గు చూపుతానని.

(మన చెంప పగలకొట్టడానికి ఏ చెప్పు అయితే ఏంటి ? కాకపోతే బాటా చెప్పు అయితే కాస్తంత ఊరట, నా మనసుకి.)

ఆ మొగ్గుతోనే ఈ ఎన్నికలలో మన రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తే బావుండని అనుకుంటాను. కనీ కాంగ్రేస్స్లో ఎవరు గెలిచినా గెలవక పోయినా ఒకరికి మాత్రం జనం గట్టిగా బుద్ధి చెప్పాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

ఎవరంటారా. ఇంకెవరు. మన బొత్స సత్యనారాయణకే. ఎందుకంటారా. అతని కుటుంబంలో నలుగురికి సీట్లు ఇవ్వడం ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేయడం అని నాకు గట్టి భావన. కుటుంబ పాలనలు మన దేశంలో కొత్త కాదు. కానీ ఒక్కో కుటుంబంలో ఒకరో ఇద్దరో వారసులుగా ఉండడం చూసామే కానీ ఇలా దారుణంగా నలుగురు ఒకే సారి బరిలోకి దిగటం అస్సలు మింగుడుపడడం లేదు.

ఆ నలుగురిలో ఒకడయిన బొత్స తమ్ముడు ఎరుకనే జిల్లా పరిషత్తు సభ్యుడు. అంటే ఒక పదవిలో ఉన్నాడు. అది చాలదు అన్నట్లు అతనికే మళ్ళీ శాసన సభ టికట్టు ఇవ్వడం ఒకింత దారుణం. అంతటితో ఆగినా బావుండు. మరొకరు వద్దన్నరనే నెపంతో మరొక సీటుని అతని వేలు విడిచిన చుట్టానికే ఇవ్వడమనేది నాకు ఇంత వరకూ అర్థం కాని విషయం.

అస్సలు కాంగ్రేస్స్లో మిగిలిన వాళ్ళు చేతగాని వాళ్లా, లేక బొత్సా ఒక్కడే మొనగాడా ? ఈ విషయంలో జనం అటు కాంగ్రెస్ కీ, ఇటు బొత్సకి బుద్ధి వచ్చేలా మంచి పాతం చెప్పి ఉంటారని ఆశ.

2 comments:

హరే కృష్ణ said...

గుడ్డిగా పార్టీ కి వోటు వేసారు కాని మనిషికి వెయ్యలేదనడానికి నిదర్సనం వాళ్ళ గెలుపు

Anji Babu said...

@ హరే కృష్ణ:

ఒకింత మీరు చెప్పిందీ నిజమే సుమా. లేకపోతే మా ఎమెల్యే వరుసగా నాలుగో సారి గెలవడం ఏమిటీ!!

Post a Comment

Please leave your comments here.

Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.

 

Receive posts in your Inbox

Enter your email address:

Delivered by FeedBurner

Mobstac Badge