మన రాష్టంలో ఈ దఫా అసెంబ్లీకి, పార్లమెంటుకి ఒకే సారి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.
అసెంబ్లీకి వోటు ఒక తంతు ఐతే, పార్లమెంటు వోటు మరొక తంతు. పార్లమెంటు ఎన్నికల తరువాత దేశంలో 1996, 1997, 1998 వంటి రాజాకీయ అనిశ్చితి కల్గిన పరిస్థితులు నెలకోన కూడదు అంటే, చిన్న చితకా పార్టీల గుంపు మన దేశం మొత్తానికి దిశానిర్దేసం చేయకుండా ఉండాలంటే అందరూ పార్లమెంటు ఎన్నికలలో జాతీయ పార్టీలకు వోటు వేయాలి.
ఒక సారి మన రాజకీయ లోయల్టీలను పక్కన పెట్టి, దేశం యావత్తుకి సరైన, సుస్థిరమయిన పాలన ఇవ్వగాల్గిన జాతీయ పార్టీలకు వోటు వేయండి.
పార్లమెంటు ఎన్నికలలో తెదేపా, తెరాసా, ప్రారాపకి వేసే ప్రతీ వోటు మరింత రాజకీయ అనిశ్చితికి తోడ్పడుతుంది.
3 comments:
కాంగ్రెస్ పార్టీకే వోటు వేయమని నేరుగా చెప్పొచ్చు కదా.
ఇవాళ అన్ని జాతీయ పార్టీలను ఆడిస్తున్నది కూడా కొందరు ప్రాంతీయ నాయకులే.
అన్ని ప్రాంతాలూ మన దేశం లో అంతర్భాగమే.
ప్రాంతీయ నాయకులకు జాతీయ భావనలు, బాధ్యతలూ వుండవనుకోవడం చాలా పొరపాటు.
ఆమాటకొస్తే మన జాతీయ నాయకులలో ఎంతమందికి వుంది జాతీయ భావన.?
ఒక ప్రాంతానికే పరిమితమైన జాతీయ పార్టీల నాయకులు జాతీయ పార్టీలను అతాదించడం చూడటం లేదా?
జాతీయ పార్టీ అయితే సరిపోతుందా సిద్ధాంతాలు ఏమి చూడనక్కరలేదా?
ఆలోచించండి
Pratapa Rudra
కాంగ్రెస్ కి వేయమని తప్పక చెప్పవచ్చు. కానీ కేంద్రంలో వారి ప్రభుత్వ పని తీరుని ఐదేళ్ళు చూసాక నోటి వెంట త్వరగా ఆ మాట రావడం లేదు. భాజపా కూడా జాతీయ పార్టీనేనని గమనించాలి.
దేశంలోని అన్ని ప్రాంతాలు మన దేశంలోని అంతర్భాగాలే. కాదని నేను ఎక్కడా చెప్పలేదే!!
చిన్న చితకా రాజకీయ లబ్దిలకోరకు ఒక గుంపుగా చేరినవారు, ఒక కామన్ ఎజెండా అంటూ ఏమి లేని వారికి వోటు వేసి వారు ఇక దేశాన్ని ఎటు తీసుకుపోతే అటు అన్నట్లుగా వదిలేయడం మంచిదంటారా?
ఒకటి రెండు సీట్లు గెల్చుకున్న పార్టీలు మాటిమాటికి కేంద్ర ప్రభుత్వంలో తమ మాట నేగ్గించుకోవడం కోసం మాటిమాటికి బెదిరించడాలు, తమ వోటు బ్యాంకులను కాపాడుకునేందుకు చేసే కుటిల ప్రయత్నాలు ఇవన్నీ ఇప్పటి కాలంలో మనం తట్టుకోలేనివి.
నిజమే. ప్రభుత్వ సుస్తిరతకి ప్రాంతీయ పార్టీలు తోడ్పడిన సందర్బాలు ఉన్నాయి. మనం గడిచిన రెండు ప్రభుత్వాలలో అది చూసాము కూడా. కానీ జోరుగా సాగవలసిన సంస్కరణలు ఆగిపోలేదా ?
అణు ఒప్పందం కన్నా మంచి ఉదాహరణ నేను చూపలేనేమో. చంద్ర బాబు లాంటి వారు మైనారిటీల వోట్లకు, అమెరికాతో సత్సంభందాలకు లింకు పెట్టి, అదేదో పెద్ద ద్రోహం అన్నట్లుగా, మైనారిటీలకు మన దేశం మీద ప్రేమకన్నా అమెరికా మీద ద్వేషం ఎక్కువ కల్గిన వాళ్ళుగా చిత్రీకరించే ప్రయత్నం చేయలేదా? అదే కాదు. ఇరాన్ అణు సామర్ధ్య దేశంకాకూదదంటూ ప్రపంచ దేశాలతో పాటు ఆర్ధిక, రాజకీయ ఆంక్షలకు మద్దతు ప్రకటించినప్పుడు చంద్రబాబు వైఖరి జాతీయ భావంతోనే కల్గినది అంటారా ?
చంద్రబాబుని ప్రస్తావించడం కేవలం ఉదాహరణ కోసమే. ఇంకా దేశంలో చిన్న చితకా పార్టీల వారు ఎంతో మంది. వారిలో ఎంత మంది తీరు ఇలా లేదు చెప్పండి.
అవన్నీ పక్కన పెడితే, అస్సలు కమ్యూనిస్టుల నేతృత్వంలోని ప్రభుత్వం దేశానికి చేసే కీడు గురించి భయమ వేసే నేను ఆ వ్యాఖ్య చేసాను. ఉన్నా లేనట్టుగా ఉండే తెరాసా వంటి ఎంపి ల కన్నా ఏదో ఒక జాతీయ పార్టీలో ఉండే ఆ రెండు మూడు అదనపు ఎంపిల వలన దేశ ఆర్ధిక, రాజకీయ సుస్థిరతకు తోడ్పాటు.
I agree with Anjibabu comments.
Post a Comment
Please leave your comments here.
Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.