You may want to see the entire list of posts on this blog sorted by Date. Click here for the entire Table of Contents

If you like this blog you may want to subscribe to the RSS feed | Subscribe

16 April 2009

మన మీడియావారి కొత్త సిద్ధాంతం


ఈనాడు సృష్టించిన మంచి ట్రెండు ఇది. అన్ని మీడియా వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. వాళ్ల వాళ్ల స్వామీ భక్తీ చూపించుకోవడానికి.

కాంగ్రెస్ లేక వైయస్సో సభ పెడితే వీలైనంత దూరం నుండి ఫోటోలు తీయాలి. అదీ జన సందోహం బయట నుండి తీయాలి. సభలో జనం ఉన్నా కూడా లేనట్టుగా కనిపించేలాగా బాగా పై నుండి తీయాలి. చెట్టూ చేమ ఎక్కినా పర్లేదు. ఫోటో చూడగానే జనం బాగా పొడిగా ఉన్నట్లు అనిపించాలి. ఫోటో క్రింది వ్యాఖ్య కూడా అలానే రాయాలి.

తెదేపా సభ జరిగితే జనం మధ్యలోనుంచి, స్టేజీ మీద నుంచి లేక స్టేజీ పక్క నుంచి తీయాలి. జనంతో కిటకిటలాడుతున్నట్లు కనిపించాలి. వ్యాఖ్యల్లో అశేష జన సందోహం, జనవాహిని, జన ప్రబంజనం అనే మాటలు వచ్చి తీరాల్సిందే. చిరంజీవి సభ కూడా మంచి జనం ఉన్నట్లు కనిపించినా పర్లేదు.

ఇదీ ఈనాడు పురుడు పోసిన సిద్ధాంతం. ఇంకేముంది. మేమేం తక్కువ అని సాక్షి ఆ పాఠాన్ని బాగానే నేర్చుకుని ఈనాడు చేసే ఇంజనీరింగ్ నకు రివర్స్ ఇంజనీరింగ్ మొదలు పెట్టింది. వైయస్ సభలు అమోఘం అని, ప్రతిపక్షాల సభలు వెలవెల అని రాయడం మొదలు పెట్టింది.

ఇక మనకి ఏది నిజమో తెలియడం కష్టమేకానీ ఎవ్వదినీ పూర్తిగా నమ్మకూడదు అని మాత్రం తెలుసుకున్నాం.

0 comments:

Post a Comment

Please leave your comments here.

Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.

 

Receive posts in your Inbox

Enter your email address:

Delivered by FeedBurner

Mobstac Badge