You may want to see the entire list of posts on this blog sorted by Date. Click here for the entire Table of Contents

If you like this blog you may want to subscribe to the RSS feed | Subscribe

09 April 2009

ఒక్కొకరికి ఒక్కో న్యాయం. ఇదీ మన దేశం తీరు!!

ఉత్తర భారతంలో వరుణ్ గాంధీ చేసిన వ్యాఖ్యలకి అతనిని అత్యంత కటినమయిన జాతీయ భద్రత చట్టం క్రింద అరెస్టు చేసారు.


దీని పైన అన్ని పార్టీలు స్పందించాయి. భాజపా nతప్ప మిగిలిన పార్టీలన్నీ హర్షించాయి. కానీ అటువంటి వ్యాఖ్యలే చేసిన మన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి గురించి పట్టించుకునే నాదుడే లేదు. హీన పక్షం కనీసం ఆ విషయానికి తగిన పబ్లిసిటీ కూడా ఇవ్వడం లేదు.

దీనికి కారణాలు నా అభిప్రాయంలో:

ఒకటి: మన జాతీయ మీడియా ఉత్తర భారతం మీద చూపిన శ్రద్ధ దక్షిణ భారతం మీద చూపక పోవడం.

రెండు: వరుణ్ గాంధీ విషయంలో అతను భాజపాకి చెందిన కావడం వలన, మన మీడియా గుజరాత్ వంటి ఘటనల తరువాత కానీ, సైద్ధాంతికంగా కానీ భాజాపకి వ్యతిరేకులై ఉండడం వలన ఆ పార్టీని ప్రతి రకంగాను ప్రజల దృష్టిలో సమాజ వ్యతిరేక శక్తిగా చూపాలనే ఉద్దేశంతో వ్యవహరించడం వలన ఆ విషయానికి అంత పబ్లిసిటీ ఇచ్చారు.

మూడు: డి. శ్రీనివాస్ తిట్టింది కుస్లిముల పై చేయి ఎత్తే వాళ్ళని. అదే హిందువుల పై చేయి ఎత్తే వాళ్ళని తిట్టి ఉంటె మన వాళ్ళ స్పందన వేరు. ఓట్లు గడించడానికి మన వాళ్ళు ఆడే అనేక నాటకాలలో ఇది ఒకటి. ముస్లిములకి ఒక న్యాయం, హిందువులకి ఒక న్యాయంగా వ్యవహరించడం.

నాలుగు: రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. వారి పార్టీ నాయకుడే చేసిన వ్యాఖ్యలపై ఎటువంటి చర్య తీసుకోవాల్సిన అవసరం వాల్లకేంటి. అదే ఇంకే పార్టీ వాళ్ళు చేసినా వెంటనే చర్య తీసుకుంటారు.

3 comments:

యార్లగడ్డ కిరణ్ కుమార్ said...

Pity,, but true.. i hate these pseduo seculars

pseudosecular said...

@అంజి బాబు: Nice post.

Anji Babu said...

@వెన్నెల రాజ్యం:

మీరు అన్నది నిజమే. స్టేచర్ లో ఇద్దరికీ చాల తేడా ఉంది. కానీ లౌకికవాదానికి ప్రస్తుతం ఉన్న ముసుగు గురించి మాట్లాడడానికి ఒక ఉదాహరణగా చక్కగా పనికివచ్చింది.

@ కిరణ్ కుమార్:

"జాయిన్ ది క్లబ్"

@psuedosecular:

మీకు పోస్టు నచ్చడానికి నాకు రెండు కారణాలు కనిపిస్తున్నాయి. అందులో ఏది కరెక్ట్ అంటారు చెప్మా!!!

Post a Comment

Please leave your comments here.

Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.

 

Receive posts in your Inbox

Enter your email address:

Delivered by FeedBurner

Mobstac Badge