ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవుతాయి అంటే ఏమో అనుకున్నాను. నిజమే.
ఇంతకు ముందు టీవీ9 చూడాలంటేనే చిరాకు పడేవాడిని. "వార్తలలో క్వాలిటీ లేదు. వాడే భాష సరిగా లేదు. కవరేజీ బాలేదు. మరీ చెత్త కార్యక్రమాలు వేస్తున్నారు" ఇలా ఒకే సారి ఇన్నిఆలోచనలు వచ్చేవి.
ఎడారిలో ఒయాసిస్ లాగా ఈ ఎన్నికల సీజనులో వాడే దిక్కు. అటు ఈనాడు, ఇటు సాక్షి ఎవడికి వాడు సొంత propaganda నడుపుతున్న తరుణంలో టీవీ9 వాడు నా కళ్ళకు Edward Murrow లాగా కనిపించాడు.
కాస్తో కూస్తో నిష్పక్షపాతంగా వార్తలను ప్రసారం చేయగల్గిన tv9 నిజంగా మెచ్చుకోదగిన విషయం. ఏ మాటకామాట: ఊరికే క్లిక్ అవుతాడా ఇన్ని రాష్ట్రాలలో. తెలివైన చచ్చినోడు.
7 comments:
నేను అన్నిటి కంటే ఎక్కువగా చూసే టి.వి. చానెల్ TV9. ETV, జెమిని లాంటి చానెళ్ళలో ప్రసారమయ్యే ఏడుపుగొట్టు సీరియళ్ళు, కుట్రలు-కుతంత్రాల సీరియళ్ళు చూడడం ఎప్పుడో మానేశాను. నేను టి.వి. చూసే టమే తక్కువ. అందులోనూ ఎక్కువగా TV9 చూస్తుంటాను.
etv, geminiలు నేను చూడడం మానేసి చాల కాలం అయ్యిందండి. న్యూస్ చానల్స్ మాత్రం తప్పకుండా ఫాలో అవుతాను.
ఇక సీరియల్స్ అంటారా. నేను వాటిని ఏనాడూ చూడలేదు.
నేరాలు ఘోరాలు అంటే గుర్తుకు వచ్చింది. అస్సలు ఆ ఒరవడి సృష్టించింది ఈనాడే. గుర్తు ఉండే ఉంటుంది. అప్పట్లో బ్యాక్ గ్రవుండ్లో నూతన్ ప్రసాద్ డబ్బింగులో వచ్చేది. అది కాస్తా హిట్టు కావడంతో రోజు ర్రవడం, దానిని చూసి తక్కిన చానల్స్ వాళ్ళు కూడా అలాంటి ప్రోగ్రాములు మొదలు పెట్టడం, ఇంతంతా చాలదు అన్నట్టు పగటి వేషగాళ్ళ చేత యాంకరింగు చేపించడం అయ్యా బాబోయ్ అన్న చందాన తయారు అయ్యింది.
ఈ బ్లాగుల్లో బూతు డాన్సులు, బూతు పత్రికలు గురించి చర్చలు జరిగాయి. ఎక్కువ మంది బూతుని వ్యతిరేకిస్తూ వ్రాశారు. మరి కుటుంబ సభ్యుల మధ్య ఈర్ష్యలు, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు పెంచి పోషించే సోకాల్డ్ కుటుంబ కథ సీరియళ్ళ పై విమర్శలు ఎందుకు వ్రాయలేదు? అలాగే క్రైమ్ ప్రోగ్రాంల పై కూడా విమర్శలు ఎందుకు వ్రాయలేదు? బూతుని వ్యతిరేకించాల్సిందే. కానీ సమాజంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయని మర్చిపోకూడదు.
ఈ అఖండ బ్లాగ్లోకంలో ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట తప్పకుండా రాసే ఉంటారు. మనం అన్ని బ్లాగులు చదివి ఉండము కదా.
తెలుగులో బ్లాగింగ్ చేసేవాళ్ళు తక్కువే. అయినా నేను నాకు సాధ్యమైనన్ని బ్లాగులు చదువుతుంటాను.
Post a Comment
Please leave your comments here.
Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.