ఎన్నికల గురించి జరుతున్న సర్వేలు చూస్తుంటే కేంద్రంలో ఎవరికీ పెద్ద మెజారిటీ వచ్చేలాగా కనిపించడం లేదు.
ఎన్నికల తీరు అలానే ఉంది. ఉత్తరాన ఎక్కడా 55% మించి పోలింగు జరగడంలేదు. సహజంగా పోలింగు తక్కువ జరిగితే అది ప్రతిపక్షానికి అనుకూలించే సరళి కాదంటారు.
దీనికి తోడు దేశవ్యాప్తంగా సర్వేలలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నట్లు చెపుతున్నాయి (ఇదు పది సీట్లతోనే అనుకోండీ, కానీ...). అంతే కాక మన మీడియా అంతా భీబత్సమయిన బాజాపా వ్యతిరేకులన్న విషయం ప్రస్తావనార్హం.
నేనయితే కేంద్రంలో బాజాపా రావాలని కోరుకుంటున్నాను. దేశానికి ఒక సమర్థమయిన నాయకత్వం అద్వాని ఇవ్వగలడు అని నమ్ముతున్నా. ఐదేళ్ళ పాటు చేతులు కట్టుకు కూర్చున్న ప్రభుత్వం ఇక వద్దు అనిపిస్తుంది. 1999lo అధికారంలోకి వచ్చి దేశానికి కొత్త తరహాలో దిశానిర్దేసం చేసిన భాజాపా యొక్క అవసరం దేశానికి నేటి క్లిష్ట పరిస్థితులలో ఎంతో అవసరం అని నమ్ముతున్నాను.
అలా కాకున్నా 1996, 1998 వంటి పరిస్తితులు పునరావృతం కాకూడదని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. కమ్యూనిస్టులు, అవకాస వాదుల వలన దేశానికి జరిగిన నష్టం చాలు.
0 comments:
Post a Comment
Please leave your comments here.
Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.