'టీవీ 9': ఎవడితోనో పోటీ ఎందుకు, మనతో మనమే పోటీ పడితే మార్కెట్ షేర్ ఎక్కడికి పోకుండా మన దగ్గ్గరే ఉంటుంది కదా.
రాష్ట్రంలో రోజుకొకటి అన్నట్టుగా పుట్టుకొస్తున్న న్యూస్ చానల్స్ ని దీటుగా ఎదుర్కోవడానికి 'టీవీ 9' వాడు వేసిన పాచిక అద్భుతం. మొన్న 'ఐ న్యూస్', నిన్న 'సాక్షి టీవీ' రేపు మరొకటి. ఇలా మార్కెట్ లో వచ్చే ప్రతీ ఛానల్ కి ఎంతో కొంత మార్కెట్ షేర్ కోల్పోవడం కన్నా, అదేదో మనతో మనమే పోటీ పడి, మనకి మనమే కోల్పోతే బావుటుంది అని 'టీవీ 1' ని ప్రారంబించింది.
తద్వారా పోటీని మొదటి స్థానం కోసం కాకుండా రెండవ మూడవ స్థానాలకు ఉండేలా జాగ్రత్త పడుతుంది. ఎంతైనా తెలివైన వాడు కదా. అప్పట్లో 'ఈ టీవీ' ని ఎదుర్కోవడానికి 'జెమిని' వాళ్లు 'తేజ' ప్రారంబించినట్లు.
దానికి తోడు ఆర్థికంగా పరిపుష్టంగా ఉంది 'టీవీ 9'. ఆర్ధిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న కొత్త చాన్నాళ్ళు ఈ పోటీతో ఖంగుతిని, చతికల పడడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు..భళా 'టీవీ 9'.
2 comments:
babu adi tv1 ani kotta channel kadu samskruti channel dabbulu satelite vallaki katta ka pote ila peru marchukini credit meeda nadi pistunnaru . adi sangaty .
@ 'రవిగారు'
ఓ. అది 'సంస్కృతి' నా. ఎప్పుడు చూసినా వార్తలను ప్రసారం చేసే సరికి నేను అలా అనుకున్నాను.
I stand corrected. తదనుగుణంగా నా వ్యాసాన్ని మారుస్తున్నాను. మీ ఫీడుబ్యాక్ నాకు కృతజ్ఞతలు.
Post a Comment
Please leave your comments here.
Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.