మనిషి అనే వాడు ఏమి జరిగినా మారడు అనడానికి ఇదేనేమో ఉత్తమ ఉదాహరణ. ఐదేళ్ళు ప్రతిపక్షం లో కూర్చోపెట్టినా కూడా గురుడికి ఇంకా బుద్ధి రానట్టుంది.
చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూ ఒకటి 'ఐ న్యూస్' ఛానల్ వెబ్సైటులో చూసాను. అందులో ఒక ప్రశ్నకి సమాధానంగా "నేను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు వరుసగా నాలుగేళ్ళు వర్షాలు పడలేదు. దాని వలన కొంత మంది ఇబ్బంది పడ్డారు" అని అన్నాడు.
"ఇబ్బంది" అంటే అర్థం తెలియకనో లేక ఇబ్బంది అంటే "కొన్ని వేల మంది రైతుల ఆత్మహత్యలు" అనే విధంగా కొత్త నిర్వచనానికి నాంది పలకడమో.
అంతటితో ఆగలేదు. ఆ సంస్కరణలు, ఈ సంస్కరణలు, అభివృద్ది అదీ ఇదీ అంటూ సిగ్గూ ఎగ్గూ లేకుండా డబ్బా కొట్టుకుంటుంటే ఇక చూడలేక చాలు ఈ సంబడం అనుకుంటూ రెండో భాగంతోనే ఆపేసాను.
0 comments:
Post a Comment
Please leave your comments here.
Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.