ప్రజారాజ్యం పార్టీలో మూడు వేల మంది మాజీ నక్సలైట్లు చేరారు. ఇది చాల గొప్ప విప్లవం అన్నట్టుగా చెప్పుకుంటున్నారు ప్రారాపా అండ్ కో.
సామాజిక న్యాయం కోసం ఒక 'ప్రజా పోరాటాన్ని' ప్రారంబించిన చిరంజీవి ఒక కొత్త ఒరవడి సృష్టిస్తున్నాడు. ఇందులో చిరు కన్నా పవన్ కే ఎక్కువ పాత్ర ఉండి ఉంటుంది అనేది వేరే విషయం.
ఇంకేముంది. ప్రతీ పార్టీలో SC, ST, BC, మైనారిటీ సెల్స్ ఉన్నట్టు ప్రారాపా వినుత్నమయిన ఒక "నక్సలైట్ల" సెల్ ఉండబోతున్నదన్నమాట.
మహిళారాజ్యం, యువ రాజ్యం లాగా దీని పేరు 'నక్సలైటు రాజ్యం' అని పెడితే సరిగ్గా ఉంటుంది. భలే మంచి మార్పు కదా.
అంతర్గత ప్రజాస్వామ్యం ప్రతిబింబించేలా ఈ మాజీలంతా ఎవడెవడు ఎప్పుడెప్పుడు ఏ ప్రభుత్వ భవనాన్ని కూల్చాడో, ఏ పోలీసు అధికారిని కాల్చాడో కూడా చెప్పే ఒక పట్టికను తయారు చేసి పార్టీ ఆఫీసులో పెడితే బాగుండు. జనానికి వారి గొప్ప తనం తెలియాలి కదా.
0 comments:
Post a Comment
Please leave your comments here.
Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.