You may want to see the entire list of posts on this blog sorted by Date. Click here for the entire Table of Contents

If you like this blog you may want to subscribe to the RSS feed | Subscribe

11 March 2009

కాష్ ట్రాన్స్ఫర్: ఎవడబ్బ సొమ్మని.

అక్కడెక్కడో చేస్తున్నారు అని విని అదే ఇక్కడ అమలు చేస్తాననడం అవివేకం. అస్సలు ఈ 'కాష్ ట్రాన్స్ఫర్' స్కీము మనకి కలిగించే లాభం కన్నా సమాజానికి కలిగించే నష్టమే ఎక్కువ.


ఉపాది హామీ లాంటి ఒక స్కీముని తీసుకుని అందులో లోటుపాట్లను సరిదిద్ది దానికి దీటైన ఉపాది కల్పించే కార్యక్రమం లాంటిదేమైనా చేపట్టాలి కానీ తెరగా జనానికి డబ్బులు ఇస్తే రేపు పని పాట లేకుండా సోంబెరులున్న దేశంగా తయారు అవ్వడం ఖాయం.

ప్రభుత్వ చొరవుతో ప్రతీ పేదవాడికి ఉచిత వైద్య సదుపాయం కల్పించడానికి ప్రయత్నించాలి. ఉచిత విద్యను ప్రవేసపెట్టాలి.

అంతే కానీ జనానికి డబ్బులు ఇచ్చి అవన్నీ వాళ్ళే కొనుక్కుంటారు, చూసుకుంటారు అనడం మూర్ఖత్వం. పిచ్చి. వెర్రి. ఇంక అన్నీను.

కష్టపడి సంపాదించిన డబ్బుతోనే ఇష్టమొచ్చినట్లు తాగి తందనాలు ఆడి జీవితాలు నాశనం చేసుకుంటుంటే, ఇక తెరగా వచ్చిన డబ్బులతో ఏమి చేస్తారో చెప్పనక్కర్లేదు. ఈ స్కీము పెడతాను అనడం వెనుక చంద్ర బాబు ధైర్యం: "మనం నెల నేలా డబ్బులు ఇస్తాం. ఈ పిచ్చోళ్ళు తెగ తాగి మన ఎక్ష్సైజు ఆదాయం పెంచుతారు. అల వచ్చిన డబ్బులు తిరికి వాళ్ళకే పంచుదాం" అన్న కాన్సెప్టు మీద సృష్టించబడినది అనుకుంటా.

సమాజాన్ని నాశనం చేయడానికి తన వంతు కృషిగా చంద్రబాబు ఇలాంటి స్కీములపై overtime పని చేస్తున్నట్లున్నాడు. నాకు "దిమ్మ తిరిగింది" అంటారు చూసారా, ఆ ఇదిలోనే ఉన్నాను.

4 comments:

Unknown said...

I think we understood Money transfer scheme.
How many women in our state drink liquor using the Rs.2000 directly given to them by Govt.
siggu vunnavaadevadu itu pichi blog maataladu matladadu.

Anonymous said...

When/where did I suggest women would drink with the cash-transfer-scheme money?

Do you have any clue as to what kind of ill effects unaccountable social welfare schemes have on the society? Have you either witnessed or atleast thought about such a dimension to/for such scheme?

WHAT PEOPLE NEED IS WORK AND NOT FREE MONEY. GOVERNMENTS SHOULD STRIVE TO PROVIDE AS MANY OPPORTUNITIES TO AS MANY CITIZENS AS POSSIBLE.

Siggulenidi naaku kaadu brother. Konchem kooda logic apply cheyakundaa, nenu pattina kundeluku moode kaallu ani, vyakti/partee preethitho thama thama abhipraayaalanu nijam ani cheppi kodilaaga koosevaallu.

Praveen Mandangi said...

తాడేపల్లి గారి బ్లాగ్ లో టపాలు వ్రాసే "అజ్ఞాత" చేసే వితండవారం చదివి "crisis-dharma" కూడా ప్రభావితమైనట్టు ఉన్నాడు.

Praveen Mandangi said...

చంద్రబాబు నాయుడు జనాన్ని అడుక్కునేవాళ్ళనుకుంటున్నాడని అతని ప్రకటనలు చూసినవాళ్ళెవరికైనా అర్థమైపోతుంది. అతను ఎన్నికలలో గెలిస్తే ప్రతి కుటుంబానికి ప్రతి నెల రెండు వేలు ఫ్రీ క్యాష్ అందిస్తాడట! కిలో రెండు రూపాయలు బియ్యం స్కీమ్ సాధ్యం కాదని నమ్మేవాడికి ఫ్రీ క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ సాధ్యమే అనిపించిందట. మా ఊర్లో డి.టి.పి. ఆపరేటర్ గా పని చేసే వాళ్ళకి నెలకి మూడు వేలు జీతం వస్తుంది. అంత కంటే పేదవాళ్ళ సంపాదన నెలకి వెయ్యో రెండు వేలో ఉంటుంది. చంద్రబాబు నాయుడి తొమ్మిదేళ్ళ దివాలాకోరు పాలనలో మూత పడిన చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు తెరిపించినా బోలెడు మందికి ఉపాధి వస్తుంది. ఒక ఫాక్టరీలో కార్మికునికి నెలకి రెండు వేలు జీతం నిర్ణయించారనుకుందాం, ఆ ఫాక్టరీలో భార్య, భర్త ఇద్దరూ కార్మికులుగా చేరితే వాళ్ల సంపాదన నాలుగు వేలవుతుంది. ప్రభుత్వ రంగ పరిశ్రమలలో అయితే జీతం ఇంకా ఎక్కువగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు కావాలని దివాలా తియ్యించి, నష్టాల పేరుతో ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసిన ప్రభుత్వ రంగ ఫాక్టరీలని తిరిగి స్వాధీనం చేసుకున్నా కార్మికులకి మంచి జీతాలు అంది వాళ్ల బతుకులు బాగు పడతాయి. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే క్యాష్ ఇవ్వడు. రాష్ట్రం మరింత దివాలా తీసి మరింత మంది బిచ్చగాళ్ళుగా మారి అప్పుడు నిజంగా ఉచిత డబ్బులు (చిల్లర) అడుక్కోవాలి.
---మార్తాండ

Post a Comment

Please leave your comments here.

Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.

 

Receive posts in your Inbox

Enter your email address:

Delivered by FeedBurner

Mobstac Badge