You may want to see the entire list of posts on this blog sorted by Date. Click here for the entire Table of Contents

If you like this blog you may want to subscribe to the RSS feed | Subscribe

09 March 2009

ఈనాడు : 'తెదేపా' కరపత్రం

రానురాను ఈనాడు ఒక పత్రికలాగా కాకుండా తెదేపా కరపత్రం లాగా తయారవుతుంది. జనం డబ్బులు దొబ్బుతూ జనానికి వార్తలు చెప్పకుండా జనం ఎవడిని ఇష్టపడాలో తామే నిర్ణయించి చెపుతున్నారు ఈ జర్నలిజం యోధులు.

ఇవేల్టి ఈనాడులో ప్రచురితమైన వార్త ఇందుకు నిలువెత్తు సాక్షి. ఇన్నాళ్ళు అన్నా 'యన్టీఆర్' ఆంధ్రుల ఆరాధ్య దైవంగా ఆయన కుటుంబ సభ్యులు, తెదేపా నాయకులు డబ్బా కొట్టుకునే వారు. దాని గురించి నాకు ఈ అభ్యంతరం లేదు. కాని జర్నలిజానికి మారు పేరు, పెట్టింది పేరు అని చెప్పుకు తిరిగే పెద్ద మనుషులు 'యన్టీఆర్' ని ఆంధ్రుల ఆరాధ్య దైవంగా అభివర్ణించడం బజారు జర్నలిజానికి నిదర్సనం.

"తొలి అంకంలోనే ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్నను గుర్తుతెచ్చేల ప్రారంభం అయ్యింది ఆదివారం నాటి బాలయ్య నెల్లూరు జిల్లా పర్యటన..": ఇలా సాగింది ఆ వార్తాంసం.

ఇటువంటి వాడి ఆర్ధిక కార్యకలాపాల కంపనీ మీద దాడి చేసి అవకతవకలను బయటికి తీస్తే "పత్రికా స్వేచ్చ మీద దాడి"గా అభివర్ణిస్తూ "ది హిందూ" వంటి పత్రికలు వాకాల్తా పుచ్చుకోవడం శోచనీయం, ప్రజాస్వామ్యానికే సిగ్గు చేటు.

రామోజీ రావు గారు: నా మాట వినండి. మీరు పత్రికా రంగానికి చేసిన సేవలు చాలు. ఇంక అది ఆపేసి పచ్చళ్లు అమ్ముకోండి పద్ధతిగా. మన రాష్ట్ర ప్రజలు సంతోషిస్తారు.

18 comments:

Anonymous said...

రామోజీరావు పై నేను రాసిన ఇది కూడా చదవండి.

Anji Babu said...

మీ వ్యాసం చూశాను శ్రవణ్ గారు..

అక్కడ ఒక వ్యాఖ్య కూడా చేశాను.
ధన్యవాదములు..అంజి

pseudosecular said...

అంజి బాబు: It looks like that you hate Ramoji and TDP. Any reason for that?

Anji Babu said...

psuedosecular:

I hate anyone who tries to pull of lies and labels them truth.
When I say anyone its anyone !

And I am not surprised you didn't raise any objection whatsoever when I passed comments on Congress or PRP.

At the end of the day its not who I am talking about but what I am writing about that I really care for.

Satya Gopal said...

100 kotla prja dhanamto prakatana kosam Oo patrika petukuni rajavaru bhajana cheyagaa lenidi... gatacharitraloo Eenadu cong. kee dappalu kotiindi... ledante padayatya aDhikaram vypu aduguleyinchdannadi nijam... enta projectula vadda charchalu chesina... vipakshalu nirupinchaleka poyai kabatii Avineete ledani prkatinchukunna CM gari matalni achutappulekunda achuchese patrikaa lu cong. dappu kodite...Eenadu Deasam pala padindi maro sari... madyalo chiru chupuloo chusindi kadaa...

Praveen Mandangi said...

శ్రీకాకుళం పట్టణంలో ఈనాడు పత్రిక చదివేవాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయింది, మార్గదర్శి కుంభకోణం బయట పడిన తరువాత. సాక్షి పేపర్ వచ్చిన తరువాత "వార్త" సర్క్యులేషన్ కూడా తగ్గిపోయింది. నేను ఇంటిలో "వార్త" పేపరే చదువుతాను. ఆఫీస్ లో మాత్రం ఇంటర్నెట్ లో "సాక్షి ఈ-పేపర్" చదువుతాను. ఈనాడు పేపర్ లో తెలుగు దేశం పార్టీకి అనుకూలంగా వ్రాసే వ్రాతలు చూస్తే రోత పుడుతుంది నాకు.

Satya Gopal said...

isp admin rasina comment chadiva...
bahusa cong pakka veerabhimani anukunta...SKLM townlo Eenadu chadivevallu taggipoyarani comment... door to door sarve chesara leka agencylani sampradincharaa...meelage Eenadu e- paper chadivevallu ekkuvayaranukoraa... maku telisi sakshi printing ki salseki variation lekkalesara... bhusa meelanti dharma prabhuvula valle inka VARTA amatram nilabadiundemoo.... alage office hourslo seva vadilesi sakhi e-paperki hittings penchepani appaginchara... EENADU TDPki bakayee,,, mari sakshi sangatenti?
paper pakka partilani tittadanikee..upaooginchukunitunnarannadi vastavam meekeepaatike telisundali... bhahusa aratalu chadivi chadvi meeku migilina papers rasevi rota puttinchachu..
Ika sakshi chanal goorchi cheppakaarle... indepth, golisoda, light teeskoo.. ila vipakshalani tittadame pani... prabutavam veligipootondani cheppukuntunna sakshi... avakatakalaki.. arachakalaki, atyacharalaki Enadu khandichadu... ramoji vykigatampi, babu batukupi unna sredda YS Idupula pailo 30 yellu govt land anubhavinch enta sampadinchadani telsinaa chepparu...

Anji Babu said...

@ Gopal:

సాక్షి పేపర్ కాంగ్రెస్ కి వకాల్తా పుచ్చుకోక పోతే ఇంకెవరికి పుచ్చుకుంటుంది చెప్పండి. సాక్షి యొక్క పక్షపాత ధోరణి గురించి మాట్లాడుకోవడం పచ్చి దండగ.

అయితే ఈనాడు అలా కాదు. ఎన్నో ఎండ్లగా జనానికి వార్తలను అందిస్తూ సంపాదించుకున్న మంచి పేరు, వారు ఏమి రాసిన జనం నమ్మేలాగా, అలోచించేలాగా చేస్తుంది. ప్రభుత్వ అవినీతి గురించి రాస్తే ఎవడికి అభ్యంతరం.

కానీ news కన్నా views కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి తమ తమ అభిప్రాయాలను, ప్రజలకు పనికిరాని మరియు తమ రాజకీయ loyalty లకు లబ్ది చేకూరే విధమయిన వార్తలను ప్రజల పై రుద్దడం గురించే నాకు అభ్యంతరం.

చివరగా ఒక మాట: ఈనాడుని విమర్శించడం సాక్షిని సమర్ధించడంతో సమానం అనుకోవడం అవివేకం.

అది isp admin విషయంలో ఎలాగో మరి ఆయనకే తెలియాలి.

Praveen Mandangi said...

ఈనాడు శ్రీకాకుళం టౌన్ అడ్వర్టైజింగ్ ఏజెంట్ నాకు చెప్పాడు. అతను నాకు బాగా తెలిసినతనే.

కొత్త పాళీ said...

అవును. అమెరికాలో ప్రియ పచ్చళ్ళు దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నాం. రామోజీ రావుగారు వెంఠనే ఈనాడు విలేకర్లనీ సబ్బుల్నీ పచ్చళ్ళ ఫేకటరీకి తరలించాలి!

Satya Gopal said...

anji babu garu meerannadi curect.. kanee Eenaduni vytirekistu nnapudu... Aa paper chadavakunda... Cong Mp sanghi, Cm gari Sakhi lu chadivi Eenadu gurchi mataladampine naa abyantaram,,
meerannattu Eenaduki janamlo Oo pratyekam undi... Aa madya Sakski ki counterlu Ichi Ichi.. mee lanti vari suchantone paperlo manes webai pen counter prarambhicharu annadi nijam... Aite Eemadya mally anvasa chachalaku Eenadu teraleputondi.... deeni dhoranilo marint amarpu ravalsi undi... Emantaru...

Satya Gopal said...

isp gagu...
mee vadan sari kadu...
meeru kaneesam Eenadu pathakudu kudaa kadu.... Oo Add agency vykti paper seculation anchana veyadu... alage... sarqulation aDharangane Eenadu Ads ni CC (Colom Centimeeter) nunchi SC (Sq. Cen)ki marindi... Eenadulo agencyki High commision ravalante targets untai... prevet ads aina...sare...
skhilo com. ekkuva... Ika me SKLM nunchi prchuritamayye Vache kalinga sema.... Sikkolu times...mana MLA... ivanny... dadapuga... mee ramakrishna theatar sandulo prin ayye paperslo... 50 to 70 % Isataru...seq..ki... printingki teda undi...print ainade sakhi lekkalo undi... bytakellina prati di serq kinde lekkata variki... qnduke evening aina pan shops lo sakhi darsanamistundi.. alagani Eenadi serq tagaledani annu... taginanta mera printing kuda tagingcharu... asalu Enadu serculation gurchi mee veenas hotal pakkane unna friens pan shoplo adagandi... akkada ne cheppina smal papers kooda meeku andu batulo untai... leda pedda padu rdlo Eenadu officeki velte Serq Deptlo Agency list adagandi... naa ku telsi SKLM Dt lo % paperski kooda Eenadu Agency undi... Dadapu prati gramanni cover chesaru... Cong-TDP groups unnachotla 2 Agencylu kooda unai...
Ex.. VGT md lo talvaram.... PLKD lo Vadama.. ampili Ila chala...
Ila cheppindi.. meru porabad darani... Oo vykya chese ppudu ... Ookaru cheparane kanna swayamga telusukunte manchidani...

Anil Dasari said...

నాదో క్వశ్న. రెండున్నరేళ్ల క్రితం మార్గదర్శి గురించి రచ్చ రచ్చ చేశారు కదా. తీరా చూస్తే మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఇంకా నడుస్తూనే ఉంది. అప్పటి గోలంతా దేని గురించి? కొండని తవ్వి ఎలకనీ పట్టలేదా ఉండవల్లి?

Praveen Mandangi said...

@gopal
నేను పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు వెయ్యించే ముందు డిటైల్స్ కనుక్కునే అడ్వర్టైజ్మెంట్లు వెయ్యిస్తుంటాను. నేను ఎక్కువగా సాక్షి, వార్త లాంటి పేపర్లలోనే వెయ్యిస్తుంటాను. వార్త ఆఫీస్ లో ఉద్యోగం మానేసి సాక్షి ఆఫీస్ లో ఉద్యోగంలో చేరిన ఒకతను కూడా నాకు తెలుసు. లోకల్ పత్రిక అయిన సత్యం పేపర్ ఏ ప్రెస్ లో ప్రింట్ అవుతోందో కూడా నాకు తెలుసు. మా ఊరు సంగతి నాకు తెలియదనుకుంటున్నావా?

Praveen Mandangi said...

@gopal
నువ్వు చెప్పిన వడమ, తలవరం గ్రామాలు కూడా నేను తిరిగినవే. గతంలో తలవరంలో తెలుగు దేశం, కాంగ్రెస్ కార్యకర్తలు బాంబులు పట్టుకుని వీధుల్లో తిరిగి రాయలసీమని తలపింపచేసిన ఘటన కూడా నాకు గుర్తుంది. చిన్నప్పుడు గ్రామాల మధ్య క్రికెట్ టోర్నమెంట్లు జరిగినప్పుడు ఆ గ్రామాలన్నీ తిరిగాములే.

Satya Gopal said...

isp garu.. meeru criket perutoo urlu tirigite... janam gontu teleedu... Eepaper enta serculation koodaa teleedu.. Ik SKLMlo neenu chadivina vadine...munisipal high school NTR High school ga maraka mundu...SKLM lo dadapu jornalist mitrulanta suparichutile... nalli Darmarao, pedada paramesh, joginaidu Elaa chalamandi mitrulu netikee unnaru..
Ippatikee maku sambhandichina Visleshanal kosam nenu hyd nundi vasune untanu... mee uri gurchi meeku teliyadani ananu... satyam officeki velite vasantakumar ane news edior naku manchi mitrudu...
dadapu SKLM Distlo prati gramamam telusukunna.. tammineni, yarranna, kala, dharmana, kruparani andarito naaku netikee satsabhadhalunnai...

Satya Gopal said...

kotta pali garu...
apunyam kattu kondi...
ennikalayyaka.. meeru ramojini america lo meeku ruchikaramina pachallu andicheduku oppiste... ekkda naku telsina eenadu staff andarinee america vellamani batimalta... vallu vachaka elaagu sati andhrudiga mee Intlo kasta chotichi vasati sowkaryalu chusukuntaranna nammakam undi..bhojanaa lavi vallu vaddanna elanu meru pedataranukondi..

Praveen Mandangi said...

నువ్వు ఎక్కడో ఉంటూ శ్రీకాకుళం కబుర్లు మాట్లాడకు. నల్లి ధర్మారావు, రాజశేఖరం నాయుడు, సత్యం పేపర్ ప్రసాద్, వీళ్ళందరూ నాకు బాగా తెలిసినవాళ్ళే. ధర్మాన ప్రసాద రావు సొంత గ్రామం మొబగాం కూడా వెళ్లి వచ్చినవాళ్ళమే. నువ్వు కేవలం కబుర్లు విని ఈనాడు పేపర్ సర్క్యులేషన్ ఎక్కువ అని భ్రమపడకు.

Post a Comment

Please leave your comments here.

Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.

 

Receive posts in your Inbox

Enter your email address:

Delivered by FeedBurner

Mobstac Badge