"దేశం పరువు పోతే ఏమైంది. మన పబ్బం గడిస్తే చాలు. మనకి పబ్లిసిటీ వస్తే చాలు". ఈ రకంగా ఉంది మన రాజకీయుల వైఖరి.
మొన్నీ మధ్య గూగుల్ న్యూస్ చదువుతున్నపుడు సరదాగా పాకిస్తాన్లో ఏమి జరుగుతుందా అని చూస్తే "ఆంధ్ర ప్రదేశ్లో అల్లర్లు: అట్టుడికిపోతున్న రాష్ట్రం" అనే ఒక వార్తాంసం ఒక పాకిస్తానీ సైటులో కనిపించింది. ఇదేంటిరా బాబు ఇప్పటి దాక మన టీవీ ఛానల్ చూసాను, ఒక్కడు కూడా రిపోర్టు చేయలేదు, ఏమి జరిగిందా అని ఆ లింకు పట్టుకు వెళ్ళాను. తీరా వెళితే అక్కడ గోదావరి జిల్లాలో మత్స్యకారులను పోలీసులు లాఠీచార్జ్ చేస్తే రేగిన అల్లర్ల గురించి రాసి ఉంది.
నాకు ఏమి జరిగిందో తెలుసు కాబట్టి నేను ఆ "ఘోర సంఘటన"గా చెప్పబడిన విషయాన్ని పట్టించుకోలేదు. కానీ వేరే దేశం వాడు ఎవడైనా ఇది చదివితే ఎలా ఉంటుందో ఆలోచించండి ? నిజం అనుకునే అవకాసం ఎక్కువ కదా !
ఇప్పుదిదేందుకు చెపుతున్నాను అంటే, ఇవాళ పేపర్లో కడప జిల్లాలో పర్యటించిన యురోపియన్ యూనియన్ బృందం సభ్యులు అక్కడ "స్వేచ్చాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు" అని కనుగుందిట. ఆ ఫోటోలో పక్కన తెలుగు దేశం నాయకుడు ఉన్నారు. ఇంకేముంది నాకు సంగతి అర్థం అయ్యింది. అచ్చంగా ఈ విధంగా కూడా ఒక రకమయిన లబ్ది పొందాలని చివరికి బయటి దేశం వాళ్ళకి కూడా ఉన్నవీ, లేనివీ అన్ని చెప్పి పంపిస్తున్నారు మన తెలుగు దేశం నాయకులు.
ఈ విదేశీ బృందం వారు మన పరిస్థితి నిజంగానే ఇలా ఉంది అని నమ్మి ఎంచక్కా లోకం అంతా ఈ విషయాన్ని చాటి చెపుతారు. దేశం పరువు దొబ్బదా మరి. అది ముఖ్యం కాదు మన వాళ్ళకి. తెల్లోల్లు వచ్చారా, వాళ్ల చేత కూడా మన సర్కారుని తిట్టించామా లేదా అనేదే ముఖ్యం.
దేశంలో తెలుగు ప్రజలకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలి, తేవాలి అని అన్నగారు ఆనాడు స్థాపించిన పార్టీ ఈ రోజున యావత్ దేశానికి ఇస్తున్న చిరు కానుక ఇది. భళా బాబు..భళా !!
1 comments:
Yes Anji Babu i Agree with You
Chirag Ali
Post a Comment
Please leave your comments here.
Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.