ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలను ప్రజలకు వివరించడానికి, ప్రజలకు అట్టి కార్యక్రమాల యొక్క వినియోగ విధానాలను తెలియపరుచుటకు విడుదల చేయవలసిన ప్రకటనలు, ఈ కాలంలో ప్రభుత్వాలు తమ గురించి సొంత డబ్బా కొట్టుకోవడానికి జారీ చేస్తున్నాయి. ఇది ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికే కాక కేంద్ర ప్రభుత్వానికి కూడా వర్తిస్తుంది.
ఆర్ధిక మాంద్యం వలన ఒక పక్క దేశవ్యాప్తంగా జనం లక్షల సంఖ్యలో ఉద్యోగాలు పోగొట్టుకుంటుంటే, మన వాళ్లు ఫుల్ పేజ్ యాడ్లు విడుదల చేసి ఎవడి డబ్బా వాడు కొట్టుకుంటున్నాడు. ఇలా అర్థం పర్థం లేకుండా ప్రజా దానం విచ్చలవిడి ఖర్చుకు గురి కాకుండా ప్రభుత్వం కేంద్ర స్థాయిలో ప్రచార విధానాలలో మార్పులు తేవలసి ఉంది.
అస్సలు ఇలాంటి యాడ్లు ఎంత వరకు " effective " అనేది తేల్చే ఒక నివేదిక రూపొందించాలి. ఒక నిష్పాక్షిక సంస్థ ద్వారా అది చేపించాలి. ఏ ప్రభుత్వం కూడా, రాష్టం ప్రభుత్వమైనా లేక కేంద్ర ప్రభుత్వమైనా, ఎట్టి పరిస్థితులలో పత్రికలలో అరపేజీ కన్నా ప్రకటన ఇవ్వకూడదు. అదీ ముఖ పేజీ అయితే పావు పేజీకి మాత్రమే పరిమితం చేయాలి. జాతెయ విపత్తులు తలెత్తినచొ ఒక ఎగ్జేమ్ప్షన్ ఇవ్వవచ్చు.
అంతే కాక ప్రతీ బడ్జెట్టులో ఒక నిర్దిష్ట మొత్తాన్ని కేటాయించి అది దాటకుండా చూడాలి. దాటిన రాష్ట్ర పభుత్వాలకి కేంద్ర ప్రభుత్వం ఫైను వేయాలి. అలాగే తానూ పాటించాలి.
ప్రచార విభాగం ఏర్పాటు చేసి, అంటే ఇప్పటిలాగా కాకుండా ఒక నిష్పాక్షిక వ్యవస్తలాగా, మొత్తం భాధ్యతలను దానికి అప్పగించాలి. ప్రతీ డిపార్టుమెంటు తమ తమ ప్రకటనలను దీని ద్వారా మాత్రమే పంపించాల్సి ఉండేలా ఉండాలి. ప్రతీ రూపాయి ఖర్చుకి లెక్క ఉండాలి. ప్రయోజనం ఉండాలి. స్వామీ భజనలు చేసేటువంటి ప్రకటనలు జారీ అవ్వకుండా చూడాలి. ముఖ్యంగా అస్సలు ఉన్నారో లేరో తెలియని సంక్రాంతి లక్ష్మికి, యేసు క్రీస్తుకి ఉత్తరాలు రాస్తూ వచ్చే ప్రకటనలు నిషేదించాలి.
మన రాష్ట్రంలో ఇంతకు ముందు ఉన్నవాడు మూడొందల కోట్లు ఖర్చుపెడితే, ఇప్పుడున్నోల్లు ఐదు ఏండ్లలోనే అది దటేసినట్టున్నారు. ఈ పనికిమాలిన ఖర్చులు తగ్గించుకుంటే ఆరోగ్య శ్రీ లాంటి పధకాలు ఇంకెన్నో మొదలు పెట్టొచ్చు. ఇవన్నీ చేయాలంటే దమ్ముండాలి. అంత ఎవడికి ఉంది.
You may want to see the entire list of posts on this blog sorted by Date. Click here for the entire Table of Contents
08 February 2009
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
Please leave your comments here.
Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.