ఇన్నాళ్ళు చూసింది ఒక తంతు ఐతే, ఈనాడు ఇంకా దిగజారింది అనడానికి కొత్త రుజువు "హెరిటేజ్" ఫుడ్స్ వ్యవహారం. సాధారణంగా ఏదైనా కుంబకోణం జరిగితే చేసిన వాళ్ల వెనుక నాలుగు తరాలు శోధించి వ్రాసే ఈనాడు ఈ విషయం పూర్తిగా విస్మరించడం చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రమోటర్లుగా ఉన్న ఈ కంపనీ చేసినట్లు చెప్పబడుతున్న స్కామును సమర్దిస్తున్నట్లే. ఎంత సమర్ధిస్తున్న కూడా మరీ ఇంత పచ్చిగా ఎలా వదిలేసారు అనేది నాకు ఇంకా అర్థం కావడం లేదు.
ఈ ఉదంతంతో జనానికి తమ పేపరు ఎందుకు చదవకూడదో ఒక ఉదాహరణని వారే ఇచ్చుకున్నట్లు అయ్యింది. కాస్తో కూస్తో ఉన్న నమ్మకం కూడా పోయింది. ఉండే కొద్దీ ఇంకా ఇంకా అస్సలు రంగు బయట పడుతూ ఉంటుంది అనడంలో సందేహం లేదు.
ఇన్నాళ్ళు ఈనాడు చదివినా అందులోని వార్తలకు ఒక ఫిల్టరు పెట్టి చూడడం అలవాటు అయ్యింది. ఇప్పుడు వాడే ఫిల్టరు పెడుతుంటే ఇంక ఏ పేపర్ చదవాలో, ఎవడిని నమ్మాలో !
You may want to see the entire list of posts on this blog sorted by Date. Click here for the entire Table of Contents
05 February 2009
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
Please leave your comments here.
Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.