You may want to see the entire list of posts on this blog sorted by Date. Click here for the entire Table of Contents

If you like this blog you may want to subscribe to the RSS feed | Subscribe

04 February 2009

పిచ్చాంధ్ర ప్రదేశ్

ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ మన నాయకులలో, నాయకులవుదాం అని వచ్చిన వాళ్ళలో ఉన్న పిచ్చి బయట పడుతుంది.

బాల కృష్ణ :
ఊరూరా తిరిగి నిమిషానికొసారి మీసాలు మెలేయడం, తొడ కొట్టడం లాంటివి చేస్తున్నాడు. అది చాలదు అన్నట్టు జనాన్నీ కొట్టమని అంటున్నాడు. నాకైతే అప్పట్లో అదేదో కాసు నుండి బయట పడడానికి "మతి స్థిమితం" సరిగా లేదనో లేక మానసిక సమస్యలున్న రోగి అనో చెప్పుకున్న విషయం గుర్తుకు వచ్చింది. అదేదో కానీ ఇప్పుడు బాగా ముదిరిపోయినట్టుంది.

కంటి చూపుతో అవినీతి అంతం చేస్తా, తొడ కొట్టి వాళ్ల గుండెల్లో నిద్రపోతా అని పిచ్చి వాగుడు వాగుతున్నాడు. 'అన్నగారు' ఇప్పుడు లేరు కాని, ఉంటే పక్కకి పిలిచి లాగి ఒకటి పీకేవారేమో, పిచ్చీ గిచ్చీ వదిలేలా.

వై యస్:
వాడు అదీ, వీడు ఇదీ చేస్తున్నాడు. నేనూ ఏదోటి చెయ్యాలి అని ఏమి చెయ్యాలో తెలియక, జనానికి గాలిలో ముద్దులు ఇస్తున్నాడు.
నిజం చెపుతున్నా. ఇది టీవీలో చూసినప్పుడు నవ్వుకోలేక చచ్చిపోయాను. మీరు చూసారో లేదో. [వీడియో లింకు ]
బాబోయ్. మన వాళ్ల పిచ్చికి ఇది పరాకాష్ట.

పోసాని:
ఎక్కువ రాయడానికి కూడా ఇష్టం లేదు. కానీ ఒకటి చెప్పదలచాను. నిజంగా 'పిచ్చాసుపత్రి' నుంచి నేరుగా రాజకీయాలలోకి వచ్చాడు. చిరంజీవి ఇతనిని పార్టీలో చేర్చుకుని పిచ్చోడయ్యాడు.

స్వర్ణాంధ్ర ప్రదేశ్, హరితాంధ్రప్రదేశ్, సంతోష ఆంధ్రప్రదేశ్ అన్నీ పోయి ఇప్పుడు 'పిచ్చాంధ్ర ప్రదేశ్' గా మారుతుందేమో మన రాష్ట్రం.

1 comments:

Unknown said...

Mana rashtramu eppudo pichandhra pradesh ga maripoyindi nayana... Janam matram pichi vallu kaadu. Keelerigi vaata pettatam vallaki baga telusu. Vallu kotte debbaki maha mahule kallu tirigi kinda padataru. Appudu tode kottukuntaro,tale badukuntaro chooddam.

Post a Comment

Please leave your comments here.

Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.

 

Receive posts in your Inbox

Enter your email address:

Delivered by FeedBurner

Mobstac Badge