You may want to see the entire list of posts on this blog sorted by Date. Click here for the entire Table of Contents

If you like this blog you may want to subscribe to the RSS feed | Subscribe

18 February 2009

తెరాసా కోణం నుండి : మహా కూటమి ప్రభావం ఎంత ?

తెరసాని తమతో కలుపుకోవడానికి రెండు పార్టీలు ఎగబడ్డాయి. డిమాండు ఉండి కదాని వాళ్లు రెండు పార్టీలను ఒక ఆట ఆది చివరికి తెదేపా చెంత చేరారు. ఇంతకీ తెరాసా పరిస్థితి ఏంటి.

2004వ సంవత్సరం. మొదటి సారిగా అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్న తెరాసా. అవి తెరసాకి అత్యధిక ప్రజాదరణ ఉన్నా రోజులు అని చెప్పవచ్చు. రైతు ఆత్మాహత్యలు, వరుస కరువు కాటకాలు వరుసగా పదేళ్ళుగా ప్రభుత్వంలో ఉండి ఎంతో అప్రసిద్ధం అయిన ప్రభుత్వం, తిరుగులేని విధంగా పార్టీలన్నీ ఒకే గూట్లో ప్రభుత్వ వ్యతిరేక కూటమి. ఇవన్నీ ఉండీ కూడా 54 సీట్లలో 27 మాత్రమే గెలుచుకోగల్గింది.

2009వ సంవత్సరం. జనంలో తెరసకి అంతగా పాపులారిటీ లేదు అనే చెప్పాలి. తూ తా అంటే రాజీనామా చేసిన నాయకుడు. అరచేతిలో ఆకాశాని చూపించిన 2004 నాటి వాగ్దానాలు పటాపంచలు. తెలంగాణా కోసం కంటే పదవుల పందేరంలో చేసిన పోరాటాలు.పార్టీ నుండి చీలి వెళ్ళిపోయిన మూడొంతుల మంది ఎమ్మెల్యేలు. 2008లో మిగిలిన ఎమ్మెల్యేలు అంత కలిసి చేసిన రాజీనామాల డ్రామాలు, తదనంతరం జరిగిన ఎన్నికలలో జనం ఛీ కొడితే దాదాపు భూస్థాపితం అయ్యిన పార్టీ. ఒక రకంగా కాస్త ప్రజా వ్యతిరేకతను కష్టపడి సంపాదించిన పార్టీ అని చెప్పవచ్చు.

వీటికి జోడిన్చలవలసిన ఇంకొక రెండు అంశాలు: హీనపక్షం 3-4 % వోట్లను గెలుచుకోగల 'భాజాపా'. ప్రభుత్వ వ్యతిరేక వోటును ఒక మోస్తారుగా చీల్చగల్గిన 'ప్రరాపా'.

ఇది చూస్తంటే మహా కూటమి అనుకున్నంత ప్రభావం ఉండదు ఏమో అనుకుంటున్నాను. 2004వ సంవత్సరంలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కూటమి కూడా ఇదే కదా. అప్పుడున్నంత ప్రభావం ఇప్పుడు ఉండే అవకాశం కనిపించడం లేదు. కానీ కూటమి వలన తెదేపా లబ్ది పొందడం ఖాయం. అయితే అది ప్రభుత్వాన్ని చెప్పట్టాలంటే కోస్తా రాయలసీమలలో 100 సీట్లు గెల్చుకోవాలి. 2004 లాంటి వాతావరణంలో అది సాధ్యం కానీ, 'చిరు' రాకతో చాలా కష్టం అయ్యింది.

0 comments:

Post a Comment

Please leave your comments here.

Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.

 

Receive posts in your Inbox

Enter your email address:

Delivered by FeedBurner

Mobstac Badge