ఇన్నాళ్ళు twitter గురించి చదవడమే కానీ వాడినది లేదు. ఈ మధ్యనే కొత్తగా వాడడం మొదలు పెట్టాను. చాలా ముచ్చటేసింది అని చెప్పాలి
twitter ఎందుకు ఆనతి కాలంలోనే ఇంత ప్రఖ్యాతిగాంచిందో ఇప్పుడు అర్థం అవుతుంది. నేను ఎక్కువగా వాడడం లేదు కాని, నేను వాడినంతలో నాకు అర్థం అయ్యింది ఏమిటంటే: social networking నకు ఇది ఒక తిరుగులేని పరికరం అవుతుంది. ఇప్పటికే అయ్యింది అని చెప్పవచ్చు.
పెద్దలు అంతా కలిసి అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికి దీని ఏ విధంగా వాడవచ్చో సమాలోచన చేయవచ్చేమో ! social networking మరియు మైక్రో బ్లాగ్గింగ్ ని మనం హైజాక్ చేయవలసిన అవసరం మనకు కాకపోయినా తెలుగు వ్యాప్తి ఎంతైనా ఉంది అనిపిస్తుంది.
మీరు twitter ప్రయత్నించారా. లేకపోతే చేయండి. మీకు తప్పక నచ్చుతుంది. ఏమంటారు ?
0 comments:
Post a Comment
Please leave your comments here.
Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.