సరదా సంభాషణలలో నిన్న నా మిత్ర బృందంలో నా మిత్రుడు జీవం పోసిన ఒక చిన్న పాయింట్.
నేపధ్యం: కాంగ్రెస్ సర్కారు అవినీతి మీద ఒక చిన్న సంభాషణ.
ఏ మంత్రీ కాని చంద్రబాబే తన కుటుంబ కంపెనీ ద్వారా నలభై అయిదు కోట్లు దొబ్బితే మరి కష్టపడి ఎలక్షన్లలో గెలిచి మంత్రులయిన వాళ్లు ఎంత దొబ్బాలి ? నిన్న కాక మొన్న పార్టీ పెట్టిన తెదేపా వాళ్ళే అంత దొబ్బితే, దేశానికి డబ్బులు ఎలా దొబ్బాలో నేర్పించిన మొట్టమొదటి పార్టీ వాడు ఎలా, ఎంత దొబ్బాలి ?( చంద్రబాబు ఏమి దొబ్బాడా అనుకుంటున్నారా ? అదేనండి.. మొన్నీ మధ్య సాక్షిలో వచ్చింది కదా. హెరిటేజ్ కంపెనీ లోను తీసుకుని కంపనీ పేరు మార్చిన వైనం..)
అతను ప్రస్తుత ప్రభుత్వ అవినీతిని సమర్దించలేదు. కానీ వ్యంగ్యంగా కాంగ్రెస్ తరపున వకాల్తా పుచ్చుకున్నాడు. గట్టిగా నవ్వి అందరమూ ఇదయ్యా మన పరిస్థితి అనుకున్నాం.
0 comments:
Post a Comment
Please leave your comments here.
Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.