You may want to see the entire list of posts on this blog sorted by Date. Click here for the entire Table of Contents

If you like this blog you may want to subscribe to the RSS feed | Subscribe

26 February 2009

మూగపోయిన ఫోర్తు ఎస్టేటు.

పాపం రోశయ్య! మొన్న వార్త రాయలేదు అని ఈనాడు, ఆంధ్రజ్యోతిలను తిడుతూ పెట్టిన ప్రెస్ మీటింగుని కూడా ఆ రెండు పత్రికలు కవర్ చేయలేదు.

'చంద్రబాబు అవినీతి చిట్టా' అంటూ మంగళవారం ఐదుగురు మంత్రులు పాతిక ప్రశ్నలను సంధించారు చంద్రబాబు మీద. ఆ ఉదంతాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి అస్సలు రిపోర్టు చేయలేదు ( రాను రాను గజ్జి ఎక్కువ అయింది కదా. ఎందుకు చేస్తారులెండి). అంటే ఇన్నాళ్ళు జరిగిన విషయాలకు వీరి భాష్యం చెపుతూ వీరి కోణంలో మనకు చూపేవారు అనుకోండి. ఇప్పుడు ఏకంగా వార్తలను చెప్పడమే మానేశారు.(కానీ బాలకృష్ణ తొడ కొడితే హైలైటు చేసి మరీ రాస్తారు, అదేదో ఘనకార్యం అన్నట్టు).

అదేమని అడుగుదామని ఆ విషయం గురించి ప్రెస్ మీటు పెట్టి ప్రశ్నించిన రోశయ్య మాటలను ఇంకెందుకు ఖాతరు చేస్తారు. వీరి స్వామి భక్తి అలాంటిది మరి.

1ఇలాంటి చర్యలు ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి, ఇక ప్రభుత్వం ఏమి చెప్పదలచుకున్నా పత్రికా సమావేశం బదులు డబ్బులు కట్టి ప్రకటనలు ఇచ్చుకుంటుంది. లాభం పేపర్లకి..బొక్క మన సొమ్ముకి.

ఆ విషయం పక్కన పెడితే, వీళ్ళు చేసే ఆరోపణలను ప్రభుత్వం ఎలాగైతే పట్టించుకోవడంలేదో, వీళ్ళూ అలానే చేస్తున్నారు అనుకోవలసిన పరిస్థితి. ఎవడి లాభం కోసం వాడు పని చేస్తున్నాడు. మధ్యలో ఇరుక్కుపోయింది మనం.

0 comments:

Post a Comment

Please leave your comments here.

Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.

 

Receive posts in your Inbox

Enter your email address:

Delivered by FeedBurner

Mobstac Badge