షబ్బీర్ అలీ. రాష్ట్ర మంత్రి వర్గంలోని ముఖ్యులలో ఒకడు. కీలక శాఖకు మంత్రి. అలాగే ఒక విధంగా కేబినెట్లో మైనార్టీల ప్రతినిధి. రాజకీయ అనుభవం ఎంతో కొంత ఉన్న వ్యక్తి. అలాంటి మనిషి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన తీరూ చాలా చండాలంగా ఉంది. పవన్ కళ్యాణ్ ఏదో తన కుటుంబ సభ్యుల గురించి ప్రశ్నలు వేసాడనుకున్నట్టున్నాడు. చాలా చీప్ గా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాడు. ఇదీ మన నాయకుల మెంటల్ కండిషన్.
************
దేవేందర్ గౌడ్. పాపం. ఏదో పోడిచేద్దాం, తెలంగాణా పేరు చెప్పి మనం కూడా ఒక ఊపు ఊపుదాం అని కొత్త పార్టీ పెట్టాడు. పెట్టాడోలేదో ఇక రిస్క్ తీసుకోవడం ఇష్టం లేని 'బాబు' జై తెలంగాణా అన్నాడు (ఇది పార్టీ కేడర్ ని కాపాడుకోవడానికి బాబు వేసిన పాచిక అని చెప్పనక్కర్లేదు). గౌడు గారికి ఈ దెబ్బ చాలదు అన్నట్టు చిరంజీవి కూడా కొత్త పార్టీ పెట్టుకున్నాడు. ఇంకేముంది. నలుగురిలో పడి మనం మునిగిపోతాం అని అర్థం అయ్యినట్టుంది. చిరు గారి చుట్టూ తిరుగుతున్నాడు. పొత్తు పెట్టుకుందాం అని. పాపం రాష్ట్ర హోం మంత్రి గా చేసిన వ్యక్తి ఇవాళ బొకేలు పట్టుకుని చిరు ఇంటికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్తున్నాడు. (ఎందుకు అదొక బొక్క. ఏకంగ పార్టీ లో చేరొచ్చు కదా అంటే అక్కడ అరవింద్ గారి రాజ్యం కదా. మన పప్పులు ఉడకవు అని తెలుసు కుర్రాడికి)
**************
ఎన్నికల ఫొకస్:
ఆవనిగడ్డ నియోజికవర్గం గురించి బాగా తెలిసిన వారికి నా ప్రశ్న. ఇటీవలి రాజకీయ పరిణామాలు రాబోయే ఎన్నికల పై అక్కడ ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి ?
మంత్రి 'మండలి బుద్ధ ప్రసాద్' కి ఎవరు సరైన పోటీ ఇస్తారు ? తెదేపానా లేక ఇటీవల ప్రారాప లో చేరిన సింహాద్రి సత్యన్నారాయణ వారసుడా ? నేనయితే మంత్రి గెలుస్తాడు అనుకుంటున్నా. మరి మీరో ?
( ఇది కేవలం కుతూహలంతో అడిగిన ప్రశ్న మాత్రమే. నిష్పక్షపాత, నిరభ్యన్తరకర వ్యాఖ్యలు చేద్దాం. నలుగురికి స్ఫూర్తిదాయకులమవుదాం.)
5 comments:
మంత్రే గెలుస్తాడు, బలం వలన కాదు, Opposition చీలిక వలన. ప్రజారాజ్యం వలన, ఇలా equations మారిన నియోజకవర్గాలు చాలా ఉన్నవి. కొన్ని చోట్ల, Congress కు లబ్ది చేకూరితే, మరి కొన్నిచోట్ల, ప్రజా రాజ్యానికో, TDP కో లబ్ది చేకూరుతుంది. ముక్కోణపు పోటీలవలన.
ఉదాహరణకు, నరసరావుపేట లో TDP లాభ పడుతుంది. చీరాల లో ప్రజారాజ్యం లాభపడుతుంది. అవనిగడ్డ లో, Congress లాభ పడుతుంది.
అంజి బాబు చెప్పారు...
@ Pseudosecular:
You seem to have been bearing a lot of personal grudge against YSR and of course his Christianity.
Do you not accept that as a citizen of this free country, everyone of us has a right to choose a faith of our liking and preach it as well.
Swami Vivekananda did. I do. I am surprised you don't !!
December 27, 2008 9:55 AM
pseudosecular చెప్పారు...
@అంజి బాబు"
Your analysis or assumption was wrong. I have no personal grudge against YSR, for that matter with any person.
Lets talk about the real issue here. So it is ok for you, if a Christian Missionary, appoints another christian Missionary has Chairman of TTD, the most sacred Hindu Temple in the world?
BTW: I am a practicing Hindu, so I have all the right to question if a person who wants to convert me, and at the same controlling controlling my sacred places.
Don't you see something is wrong with this picture? BTW. Swami Vivekanada strongly recommends to protect the Dharma. It looks like your views are totally opposite to that of Swami Vivekanada. BTW. From where you pull Swami into this discussion!.
BTW. Swami preached his Dharma, but not controlling (occupied) other peoples Religious places. Note this distinction. In his private space, if YSR wants to convert people, let it be, but he has no right to control and loot Hindu Temples.
Another example. Do you allow a person, who opposes your views, as a guarding of your family? It is like giving the keys to the thief.
What is your faith/religion/ideology?
Once you answer that question, we can continue a meaningful discussion.
If we(each one of us) are intellectually honest, then we can continue the discussion for ever.
అవనిగడ్డ నియోజకవర్గం రూపురేఖలు మారిపోయింది ఇప్పుడు.నిడుమోలు నియోజక వర్గంలో ఉండే చల్లపల్లి మండలం ఇప్పుడు అవనిగడ్డలోకి వచ్చింది.కుల సమీకరణాల దృష్ట్యా(మనకు ఇష్టమున్నా, లేకున్నా ఇది తప్పదు...)కాపులు, కమ్మ,మత్యకారులు ముఖ్యమైన వర్గాలు.కాపుల వోట్లు మంత్రికి, ప్రరాపా కి మధ్య చీలిపొయే అవకాశం ఎక్కువ (ప్రరాపా అభ్యర్ది ఎవరైనా...).తెలుగు దేశం వెనుకబడిన వర్గాల వారికి సీటు ఇస్తే, త్రిముఖ పోటి గట్టిగా వుంటుంది. సిమ్హాద్రి కి వున్న మంచిపేరుకు, కొడుకు వినయ్ ప్రరాపా అభ్యర్ధి అయితే చాలా గట్టిపోటి మరియు తెదేపా ఓట్లు కూడా చీలే అవకాశం.కాని, వినయ్ బందరు నుండి లోక్ సభకి పోటీచేసే అవకాశం ఎక్కువ.చల్లపల్లి మండలం, మోపిదేవి మండలం లలో ఉన్న కమ్యునిష్టుల బలం,కుల సమీకరణాలు,నాగాయలంక మండలం లో వున్న మత్యకారుల ఓట్లు పరిగణలోకి తీసుకుంటే తెదేపా అభ్యర్ధి మత్యకారుల వర్గం నుండి అయితే,గెలిచే అవకాశాలని తోసిపుచ్చలేము.
ముక్తాయింపు: గెలుపు గుర్రాన్ని నిర్ణయించేది దొంగఓట్లు,దొంగనోట్లు, దొంగసారానే చివరికి.పైవేమికాదు.....
-నేనుసైతం
నేను సైతం గారు చెప్పినట్లూ ఎన్నికల ఫలితాన్ని శాసించేది చివరకి నోటు,మందు,కులము,కండ బలము అంతే కాని అభ్యర్ధి మంచి వాడా కాద అన్నది కాదు .కాని ఈ సరి మొత్ఠం గా చూచినట్లయితే ఒక అవనిగడ్డ మత్రమేకాదు చాలా చోట్ల ప్రభువత్వమ్మీద ముఖ్యం గా మధ్య తరగతి ప్రజల కు చాల అసంత్రుప్థి గా ఉంది నాకు అనిపిస్తున్నది ఎమంటె ఈ సారి ప్రజలు నిశబ్ధ విప్లవం స్రుష్టిస్తారని
విజయ్ భాస్కర్
కృష్ణ గారు,
సరిగా నేను కూడా మీ లాగే ఆలోచిస్తున్నాను.ఈ విషయంలో. ఈ మంత్రి గెలిచినా మంచిదే. మన మంత్రి వర్గం లో ఉన్నా మచ్చ లేని వ్యక్తి ఆయనొక్కడే. గెలిస్తే తప్పులేదు.
నేనుసైతం గారు,
మీ విశ్లేషణకు ధన్యవాదములు.
అంత కొత్త వ్యక్తికి ఎంపీ సీటు ఇస్తారంటారా ? ఇస్తే ఒక సీటు వేస్టు చేసినట్లు అవ్వదా ? ఇక మందు అంటారా. చిన్నపటినుండి చూస్తున్నాం అండి దాని ప్రభావం. మా ఇంటి దగ్గర కుర్రోళ్ళు రెండు పార్టీల దగ్గర మందు, డబ్బు తీసుకుంటారు, కాని వోటు వేసేది ఎప్పుడూ ఒక్కరికే. అది తెలిసి కూడా రెండో పార్టీ వాడు పంచుతాడు, ఏదో ఆసతో. పాపం.
విజయ్ గారు,
నిశ్శబ్ద విప్లవం 2004 లోనే జరిగిందండి. ఆనాడు చంద్రబాబు చూపిన అలసత్వానికి బలైన ప్రజలను చూసి ఎంతో మంది కాంగ్రేస్స్కి అందలం పట్టారు. కొన్ని జిల్లాలలో తెదేపా వంటి పార్టీ ఒక్క సీటు కూడా నెగ్గలేక పోయింది అంటే చూడండి. ఆ విప్లవానికి ప్రతిపలంగా వచ్చిన ప్రభుత్వం ఇలా పరిపాలిస్తుంటే ఇంక ప్రజలు, మనకి దిక్కెవరు అనుకుంటూ ఉంటారనుకుంటా.
ఈ సారి ఎవరికీ వోటు వెయ్యాల అని తలలు పట్టుకుక్ కూర్చున్న వారిలో నేను ఒకడిని.
మీ
అంజి బాబు
Post a Comment
Please leave your comments here.
Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.