You may want to see the entire list of posts on this blog sorted by Date. Click here for the entire Table of Contents

If you like this blog you may want to subscribe to the RSS feed | Subscribe

31 December 2008

పవన్ కళ్యాణ్ : ఆవేశం ఏ ప్లస్, మరి ఆలోచనో ?

గురుడ్ని మొత్తానికి రంగంలోకి దించేశారు. ఇన్నాళ్ళు పెద్దగా బయటకి రాని పవన్ కళ్యాణ్ నిన్నటి ప్రసంగంతో ఇక పార్టీ ప్రచారాల్లో పాల్గొనే సమయం వచ్చినట్టు సంకేతం ఇచ్చాడు.

ముఖ్యంగా అతను కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీపై చేసిన విమర్శలు చూశాక ఇక గురుడు నిద్ర లేచాడు అనిపించింది. మీరు గమనించారో లేదో అతని ప్రసంగంలోని ఆవేశాన్ని. అది ఇన్నాళ్ళు తన సినిమాల్లో మొదటి పాటకే పరిమితం అయ్యేది. ఇప్పుడు కట్టలు తెంచుకుంటున్నట్లుంది.

ఒక విధంగా పవన్ కళ్యాణ్ ని చూసినప్పుడల్లా అది తేటతెల్లం గా కనపడిపోద్ది. ఇంతకు ముందు అంటే రాజకీయాలలోకి రాక ముందు ఒకటి రెండు సార్లు అతని స్పీచులు చూశాను. ఉదాహరణకి సత్యాగ్రహి సినిమా ఆవిష్కారం రోజున. మళ్ళీ అదేదో పిస్తోలు పోలీస్ స్టేషన్లో జమ చేయడానికి వెళ్ళినప్పుడు. కుర్రోడిలో ఏదో తపన. ఎందుకో తెలియదు. ఏదో చేయాలి. ఏదో మాట్లాడాలి అనుకుంటాడు. మాట్లాడతాడు కూడా. కాని అంతా అయ్యిన తరువాత అతను ప్రసంగం ఈ టాపిక్ మీదనేనా మొదలు పెట్టింది అని మనకు అనుమానం కలగక తప్పదు.

అస్సలు సత్యాగ్రహి ఫంక్షన్లో సినిమా తీసి దేశాన్ని ఉద్ధరిస్తానన్నంత పని చేసాడు. (బంగారం దెబ్బకి ఆ ప్రొడ్యూసర్ తరువాత కనిపించకుండా పారిపోయాడు అనేది వేరే విషయం). వీటన్నిటికి తోడు నేననుకోవడం భీభత్సంగా "కమ్యూనిస్ట్ భావాలను కల్గిన" పుస్తకాలు చదువుతాడు. చే గువేరా, లోకనాయాక్ ల అభిమాని అని చెప్పనక్కర్లేదు. అంటే పక్కా సోషలిస్టు. చదివీ చదివీ ఇన్నాళ్ళు తనలో ఉన్న ఉక్రోశాన్ని ఇవ్వాళ ఇలా బయట పెడుతున్నాడు.

రాజకీయాలలో ఆవేశం అవసరమే. కానీ అగ్రెషన్ కి , ఎక్సైట్మెంట్ కి తేడా తెలియాలి. ఇప్పుడు రాజకీయాలన్నీ ఇవాళ మాటలు అనుకుని రేపు కలిసిపోయే రకం. ఉన్నపళాన పార్టీ తను తిట్టిన వాళ్లతో పొత్తులు పెట్టుకుంటే మధ్య బకరా అయ్యేది తనే అని తెలుసుకోవాలి.

4 comments:

చైతన్య.ఎస్ said...

నిజమే,ఆవేశం మాత్రం చాలదు. ఆవేశపూరితమైన ప్రసంగం చప్పట్లు కొట్టించుకోవడానికి బాగుంటుంది దానికి ఆలోచన తోడవటం అవసరం. చూద్దాం భవిష్యత్తులో ఎలా ఉంటుంది. అయినా ఇప్పటికి "ఆపరేషన్ పవన్" మొదలెట్టేసి ఉంటారు "రాజ" వారు :)

Anonymous said...

పవన్‌కల్యాణ్ ప్రసంగాన్ని రాజకీయం చెయ్యవద్దు. అతను లేవనెత్తిన సమస్యలపై , సమస్యలకు బాద్యత వహించవలసిన వారిని నిలదీయ్యాలి. అది ఆవేశం కాదు. ఆవేదన. ప్రజా ప్రతినిధులు, ప్రజా సమస్యలను తమ సమస్యలుగా భావించి పేదలను ఆదుకోవలసిన బాద్యత గల నాయకులు, తమ బాద్యతను మరిచి నవ్వుతూ ఉంటే ఏమీ చెయ్యలేక పోతూన్నమే అని ఎవరికైనా కలిగే ఆవేదన. బాద్యత గల నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Raja Rao Tadimeti (రాజారావు తాడిమేటి) said...

ప్రజారాజ్యం పార్టీలో రౌడీ గా వ్యవహరించే విజయవాడ ఎమ్మెల్యే వంగవీటి రంగా తనయుడిని చేర్చుకోవడం వెనుక మర్మమేమిటో పవన్ కే తెలియాలి. తమ పార్టీలోనే రౌడీలను చేర్చుకొంటూ, వారు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై వస్తున్నారు అని చెప్పడం విడ్డూరంగా ఉంది. ప్రజలు కోరుకొనే మార్పును ఇలాంటి పాత నాయకులతో ఎలా సాధించగలరన్నది చిరంజీవికే తెలియాలి. మాటలు చెప్పడం సులువు, ఆచరణలో చేసి చూపగలగడం ఎంతో కష్టం. పార్టీలో ఇలాంటి వారికి చోటును నిర్మొహమాటంగా నిరాకరించి ఉండి ఉంటే చిరంజీవి, పవన్ ల మాటపై ప్రజలకు ఈ పాటికే నమ్మకం కుదిరి ఉండేది. ఏది ఏమైనా ప్రజారాజ్యం పార్టీ అధికారాన్ని చేపట్టడం వారు అనుకున్నంత సులువు కాదని నాకు అనిపిస్తోంది.

Anji Babu said...

పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని ఒకరు రాజకీయం చేసేంత పెద్ద నాయకుడని నేను అనుకోవడం లేదు. దానికి ఇంకా టైం ఉంది. నా వ్యాసానికి అంత పెద్ద పేరు ఎందుకు లెండి.
ఇవ్వాళ ఈ సమస్యలను వేలెత్తి చూపాడు. కరక్టే. కాను రేపు వీరి పార్టీ తీరూ ఎలా ఉంటుందో ఎవడికి తెలుసు. జీవితంలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోము అని చెపితే నాకు ఓకే.
ఒక చిన్న ఉదాహరణ. సమ సమసాజ స్థాపన కోసం మిష్టర్ క్లీన్ గా నిన్న మాట్లాడిన పవన్ కళ్యాణ్ మరి తమ పార్టీ వాళ్లు పార్టీ పదవులకు టాలెంట్ కాకుండా సామజిక సమతౌల్యాన్ని సమర్ధించడం. ఈ పార్టీ మిగతా పార్టీల పద్ధతినే అవలంభిస్తుంది కదా.

రాజకీయ వలసలను వీళ్ళు ప్రోత్సహించిన తీరు చూసాక " " ఈ పార్టీ చాల దూరం అని రుజువు అవ్వలేదా. ఇవన్ని రాజకీయాలలో సహజమే. కాని మేము చాల క్లీన్ అన్నా కటింగ్ ఇస్తున్నారే.

Post a Comment

Please leave your comments here.

Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.

 

Receive posts in your Inbox

Enter your email address:

Delivered by FeedBurner

Mobstac Badge