అధికార పార్టీలు ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అన్నట్టుగా వ్యవహరించడం మనం ఇన్నాళ్ళు చూశాము. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ కొత్త వరాలను ప్రసాదిస్తూ పని చెయ్యడం చూశాం. సందు దొరికితే సర్కారుని తూర్పారపట్టేందుకు పార్టీలన్నీ కాచుకుని కూర్చున్నపుడు ఇంతటి తొందరపాటు చర్యకు ఎందుకు పాల్పడినట్టు ?
ఇన్నాళ్ళు ఆగి ఇప్పటికిప్పుడు గాంధీ భవన్ దగ్గర నివాసాలను పడకోట్టాల్సిన అవసరం ఏంటి ? రెండు సం! క్రితం దీనికి 'పిజేఆర్' అడ్డుచేప్పాడు. అప్పుడు ఈ ప్లాన్ అటక ఎక్కింది అన్నట్టు కటింగ్ ఇచ్చారు.
రాష్ట్రంలో రోజు రోజు మారుతున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా, ఒక వేళ కాంగ్రెస్ కి కొత్త అనుమానాలు పుడుతున్నయేమో. ఒక వేళ రేపు ఎన్నికల్లో తిరిగి రాకపోతే అక్కడ గాంధి భవన్ కట్టాలన్న వీరి కల సాకారం అవ్వదు అనే ఆలోచన వచ్చిందేమో అని నా ఫీలింగ్.
ఇవన్నీ పక్కన పెడితే, చిల్లరతనం కాకపోతే ఇంకెక్కడైనా కట్టుకు చావొచ్చు కదా ! అలా కాదు అక్కడే కట్టాలి అంటే కనీసం అక్కడ ఇప్పుడు ఉన్న వాళ్ళకి మంచి హౌసింగ్ కల్పించాక ఇవి పడకొట్టవచ్చు కదా ! చెయ్యరు. ఎందుకు చేస్తారు. మనలో ఉన్న చిల్లరతనం బయటపడాలి కదా. మళ్ళీ ఇలా కట్టే దానికి 'గాంధీ' పేరు కూడానా ?
ఇప్పుడు ఒక పక్క బాడ్ పబ్లిసిటీ, మరో పక్క చేపట్టిన పని జరగదు. తిక్క కుదిరిందా !!
You may want to see the entire list of posts on this blog sorted by Date. Click here for the entire Table of Contents
28 December 2008
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
Very well written. Keep up the good work. People must be vigilant to force politicians and bureaucrats to work properly.
Post a Comment
Please leave your comments here.
Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.