మన వాళ్లు ఎంత సంపాదించినా చిల్లర పనులు చెయ్యడం మానరు. ప్రజల డబ్బులు దొబ్బి లక్షాధికారులు అయినా చేసే పనులు అన్నీ పకీరు పనులు. నిన్న నేను చెప్పినట్టు మాయావతి లాగ రాయల్ గా డబ్బులు గుంజడం ఎవడికీ చేతకాదు. దద్దమ్మలు. చేసేది వెధవ పని అయినప్పుడు కాస్తంత జాగ్రత్తగా ఉండాలా. లేదు. అందరికి తెలిసిపోయేలా చేస్తారు.
ఇప్పుడే ఈనాడు లో ఈ వార్తను చూశాను. ఒక పోలీసు అధికారి గురించి. పేరు యం.కె సింగ్ అట. తను ఇల్లు కట్టుకోవటానికి సిమెంట్ బస్తాలను పోలీస్ స్టేషన్ పేరిట తీసుకున్నాడట. సరే దొబ్బేది ఏదో బేవార్స్ గా దొబ్బాక గుట్టు చప్పుడు కాకుండా పని చూసుకోవచ్చుగా అంటే లేదే. మరీ దారుణం. ఎదురు మాట్లాడారు కదా అని హోం గార్డులను ఇంటికి కూలీలుగా వాడుకున్నదంతా. పనికి మాలిన వెధవ. అంతః కక్కుర్తి ఎందుకురా బాబు. ఛిఛీ.
పాపం. పై అధికారి ఆదేశాలకు ఎదురు చెప్పలేని ఆ హోం గార్డులను బలి పశువుల్ని చేసి వాడుకుంటున్నారు. అస్సలు కృష్ణ జిల్లా నుండి హైదరాబాద్ తీసుకేల్లాడంటే అతని ధైర్యం గురించి మనం చెప్పుకోవాల్సిందే. పోలీసు వ్యవస్థ అంతా తన బాబు సొత్తు అనుకున్నట్టున్నాడు. దరిద్రుడు. ఇంత చేసినా వాడి మీద యాక్షన్ తీసుకోవడానికి ఎవడికి దమ్ములు లేవు. మన ఖర్మ ఇలా తగలపడితే ఉగ్రవాదులు ముంబై తరహా దాడి ఎందుకు చెయ్యరు.
You may want to see the entire list of posts on this blog sorted by Date. Click here for the entire Table of Contents
28 December 2008
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
దీనికి భిన్నంగా నిజమైన పోలీస్ కథనాన్ని నా బ్లాగ్‌లో చూడండి.
http://worthlife.blogspot.com
Post a Comment
Please leave your comments here.
Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.