You may want to see the entire list of posts on this blog sorted by Date. Click here for the entire Table of Contents
27 December 2008
అప్పుడే మొదలు అయ్యిన వీధి డ్రామాలు
విజయవాడలో రంగా వర్థంతి సందర్బంగా జరిగిన గొడవ, అనంతరం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, రానున్న రోజులలో జరగబోయే తంతులకు, రాజకీయ డ్రామాలకు ఒక మచ్చుతునక లాంటిది. ఇక ముందు ముందు దీన్ని ఇంకా ఎంత రాజకీయం చేస్తారో వేచి చూడాలి. చేజారిపోతుందన్న వోటుబాంకు పదిల పరుచుకోవడానికి కాంగ్రెస్సు, కొత్తగా వచ్చినా పాత వోట్లన్ని మాకే పడాలని ఆరాటపడుతున్న ప్రారాపా పార్టీకి చెందినా వంగవీటి రాధ వర్గీయులు 'రంగా' మావాడంటే మావాడు అని చిన్న కుమ్ములాట నడిపారు.
ఈ తంతు ఇంతటితోనే తెగితే మంచిది. అలా కాకుండా ఒకప్పటి గొడవలను మరిపించే విధంగా రూపాంతరం కాకూడదు అని మనం ఎంత అనుకున్నా మన పార్టీలు ఊరుకోవు కదా. జనం ఒక్క చోట ఉంటే వాళ్లకు నిద్దురపట్టదు. రోజూ ఏదో ఒక గొడవ జరగాలి. జనాన్ని కుదిరినంతగా విడదీయాలి అని నానా ప్రయత్నాలు చేస్తారు. పైగా ముందున్నది ఎన్నికల సీజను.
ఇదిలా ఉండగా మీడియా మాత్రం గోరంత దాన్ని కొండంత చేసేదాక నిద్దురపొయెలా లేదు. కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ నుండి విడిపోయి ప్రరాపాలో చేరిన వంగవీటి రాధా వర్గీయుల మధ్య జరిగిన గొడవను మీడియా వాళ్లు అప్పుడే 'వర్గ పోరాటం' గా అభివర్ణిస్తున్నారు. ఇప్పటినుంచే జన్నాన్ని భయభ్రాంతుల్ని చేయడానికి పూనుకున్నట్టునారు. ఇంకా మొదలు అవ్వని వాటిని మొదలు అయ్యేలాగా ఇప్పటినుండే ప్రజలను సమాయత్తం చేస్తున్నారు. బహుశా పెద్ద కొట్లాట జరగలేదు అని బాగా ఫీల్ అవుతున్నట్లున్నారు అనుకుంటా.
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
http://blogchalo-blogchalo.blogspot.com/
mee blog chaala baagundhi andee .. all the best
చాలా థాంక్స్ అండి రవీంద్ర గారు.
Post a Comment
Please leave your comments here.
Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.