రాజకీయాలలో అడుగుపెట్టి దొంగతనంగా సంపాదించిన సొమ్ముని దాయడానికి నానా కష్టాలు పడే ఈ కాలపు నాయకులు మాయావతిని చూసి ఎంతో కొంత నేర్చుకోవాల్సిందే.
బడుగు బలహీన వర్గాల ప్రజలను ఉద్ధరిస్తానని చెప్పి అందలం ఎక్కిన ఆమె, ప్రజల నుండి, పార్టీ కార్యకర్తల నుండి డబ్బులు పోగు చేసే తీరు అసమానం. తలమానికం కూడా. భారి స్థాయిలో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసి తనను చూడడానికి పనులు మానుకుని వచ్చిన అమాయక ప్రజలను తన పుట్టిన రోజు కోసం డబ్బులు పబ్లిక్ గా అడుక్కోవడం ఆమెకే సాటి.
అంతే కాదు తనకు ఎవరూ లేరు అంటూ, తను పెళ్లి చేసుకోకుండా ఉన్నది ప్రజలకోసమేనని ఒక పక్క చెపుతూ జనం దగ్గర అడుక్కున్న డబ్బుతో తన స్వంత గ్రామంలో ఇంద్ర భవనం లాంటి ఇల్లు కట్టుకుంది. నాలుగేళ్ళలో తన స్థిరాస్తి దాదాపు పదింతలు అయినట్లు అఫిడవిట్ లో చూపించింది. కారణం అడిగితే పార్టీ వాళ్ళు తన మీద ప్రేమతో ఢిల్లీలో తనకు ఒక ఇల్లు కొనిపెట్టారని చెప్పుకుంది.
ఇప్పుడు లేటెస్ట్ గా ఆమె పుట్టిన రోజు వేడుకల కోసం పార్టీ నాయకులు ఎవరెవరు ఎంత సమకూర్చాలో టార్గెట్లు పెట్టిందట. ఆమె పెట్టడంతో ఆ దేవత గారి భక్తులంతా ఊరి మీద పడి జనాన్ని కొట్టి మరీ మామూళ్ళు వసూళ్లు చేస్తున్న క్రమంలో ఒక ఇంజనీరు ప్రాణాలు కోల్పోయాడు. కొట్టి చంపింది ఎవరో కిరాయి గూండా కాదు. సాక్షాత్తు ఆ పార్టీ ఎమ్మెల్యే.
ఇది చాలదా ఆమె బడుగు బలహీన వర్గాలకోసం ఎంత కష్టపడుతుందో తెలుసుకోవడానికి ! ఇవన్నీ ఒక ఎత్తు ఐతే కాన్షీరాం పేరిట కట్టిన పార్కుకి కోట్లు ఖర్చుపెట్టి డజన్ల కొద్దీ ఇత్తడి ఏనుగులు తరలించి నలువైపులా పెట్టింది. విడ్డూరం ఏమిటంటే ఆమె అధికారం చేపట్టిన వెంటనే ప్రధాన మంత్రిని రాష్ట్రాభివృద్ధి కోసం ఎనభై వేల కోట్ల రూపాయలు మంజూరు చేయమని అడిగింది. ఇంకా నయ్యం. ఇవ్వలేదు. ఇస్తే వాటితో ఏమి చేపించేదో.
You may want to see the entire list of posts on this blog sorted by Date. Click here for the entire Table of Contents
26 December 2008
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
When people elivate some one who is not qualified to the position, this what happens.
Caste politics dividing Hindus and that give access to others to manipulate Indian poltical power.
The tooth less Singh (slave of Sonia), don't know how to react to external aggression.
@ pseudosecular:
I didn't get you when you said "give access to others to manipulate Indian political power"
@అంజి బాబు,
I am referring to foreign forces. If you know India's history well, you will realize that India was ruled by foreigners for the last 1200 years.
Even today (2009) a foreigner is ruling India. You may say that she took the Indian citizenship etc. That was only a technicality that she completed to rule over One Billion Hindus.
10th century to 11750 by Muslims
1750 - 1947 by Christians
2004 - by Italian
If you deny the history of India, then you can ignore this. Else you can respond with your views. I always respect other peoples views.
Post a Comment
Please leave your comments here.
Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.