You may want to see the entire list of posts on this blog sorted by Date. Click here for the entire Table of Contents
26 December 2008
ఇస్రో : నా 'భారత రత్న'
గూగుల్ వారి 'ఎర్త్' సేవను మీరు వాడే ఉంటారు. ఉపగ్రహం నుండి భూమిని తీసిన దృశ్యాలను మనకు చూపించే ఒక ఉత్తమ సేవ. గూగుల్ ఎర్త్ వాడేప్పుడు ఉండే మజా అంతా ఇంతా కాదు. ఢిల్లీ లో రాష్ట్రపతి భవన్ దగ్గరనుండి, ఆంద్రలో మా ఇంటివరకు అన్ని చూసేసాను. వీలైనప్పుడల్లా ఏదో ఒకటి చూస్తూనే ఉంటాను. ఐతే ఈ దృశ్యాలు మూడు నుండి నాలుగు సం! క్రితం నాటివి.
భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ, ఇస్రో, కొత్తగా గూగుల్ ఎర్త్ సేవకు దీటుగా 'భువన్' అనే వీక్షణ సాఫ్ట్ వేర్ ను తయారు చేస్తుంది. ఇస్రో అధికారుల ప్రకారం 'భువన్' వచ్చే యేడాది మార్చి కల్లా సిద్ధం అవుతుందట. భువన్ దృశ్యాలు గూగుల్ ఎర్త్ కన్నా ఐదు రెట్లు ఎక్కువ స్పష్టతతో ఉంటాయట. దీనిని విపత్తు నివారణ మరియు దేశ అంతర్గత భద్రత వ్యవహారాలలో ఉపయోగిస్తారు.
ఎంతైనా మన వాళ్లు మొనగాళ్ళు. ఈ విషయం మరో సారి నిరూపించారు. ప్రపంచానికి మన భారతీయుల సత్తా గట్టిగా చెప్పే మరొక అవకాశం ఇచ్చారు. ఒక విధంగా 'ఇస్రో' సాధించినంత వృద్ధి, విజయాలు ఆరు దశాబ్దాల స్వతంత్ర బారత చరిత్రలో ఇంకే సంస్థ సాధించలేదు అని చెప్పవచ్చు. ఇస్రో శాస్త్రవేత్తలకు, సంస్థకు మన వాళ్లు ఒక "భారత రత్న" అవార్డు ఇవ్వాలి. వాళ్లు ఇచ్చిన ఇవ్వకపోయినా 'ఇస్రో' నా 'భారత రత్న'.
వార్త సోర్సు: ఈనాడు, ది హిందూ
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
Please leave your comments here.
Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.