You may want to see the entire list of posts on this blog sorted by Date. Click here for the entire Table of Contents

If you like this blog you may want to subscribe to the RSS feed | Subscribe

23 December 2008

ఈనాడు సాక్షిల యుద్ధం: మరింత దిగాజారనున్న పత్రికా విలువలు

సాక్షి పేపరు పెట్టిందే ఈనాడు ప్రచారాన్ని(సాక్షి ప్రకారం దుష్ప్రచారం) తిప్పికోడతానికే అని మనకు తెలిసిన విషయమే. అలాగే ఈనాడు కాంగ్రెస్ పట్ల తమ తీరును మార్చుకునే ప్రసక్తే లేదు, ముఖ్యంగా మార్గదర్శి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిన తీరు చూశాక అది కల్ల.

అయితే నిష్పక్షపాత జర్నలిజానికి ఎప్పుడో తిలోదకాలు ఇచ్చిన వీరు ఇరువురూ ఇప్పుడు మరో కొత్త పుంత తోక్కబోతున్నారు. ఇన్నాళ్ళు ఈనాడు కాంగ్రెస్ పైన, సాక్షి ఈనాడుపైన రాసుకుంటూ ఉండేవి. అది పరోక్ష యుద్ధంగా కొనసాగేది. ఇప్పుడు వీరి వైరానికి కొత్త నిర్వచనం ఇస్తూ ఈనాడు అధికారికంగా 'సాక్షి' ఆరోపణలను తిప్పి కొట్టడానికి, వీళ్ళు కొత్తగా మరిన్ని చేయడానికి, 'పెన్ కౌంటర్' పేరిట ఒక కొత్త శీర్షిక మొదలుపెట్టింది.


ఏదో మన టైం కాస్త బాగుండి ఈనాడు వాళ్ల లేటెస్ట్ వార్ వెబ్ సైటులో అట. లేకపోతే ఇప్పటికే ఈ ఇరువర్గాల మధ్య బకరాలు అయ్యిన మనం, రోజూ పేపర్ తీయగానే మళ్ళీ మళ్ళీ ఆ మాట అనిపించుకున్నట్లు ఉండేది. ముందు ముందు ఇంకా చాలా చందాలాన్ని మనం చూడబోతున్నాం.

ఇది ఈనాడు పెన్ కౌంటర్ లింకు.

4 comments:

Anonymous said...

రామోజీరావు మీద ఎంత దుష్పచారం జరిగినా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆయన మీద నమ్మకం పొలేదు. ఇది ఆయన నిజాయితీ , ఆయన మీద ప్రజలకు ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తాది. ఆయనకు ఉన్న ఒకే ఒక వీక్‍నెస్ కక్ష సాధింపు చర్య. ఇండైరక్ట్ గా ’బ్లాక్ మెయిలింగ్’.

ఇక సాక్షి విషయానికి వస్తే, తండ్రి కిలో బియ్యం రెండు రూపాలకు ఇస్తుంటే, తనయుడు కిలో పేపరు రెండు రూపాయలకు ఇస్తున్నాడు.

pseudosecular said...

సాక్షి paper is run by Christian Missionaries Rajashekar Reddy and his son for converting Hindus to Christianity.

Rajashekar Reddy's Daughter and his Son-in-law (Brother Anil Kumar) recently organized a conversion program in Hyderabad.

Missionary Reddy receives funds from Missionaries from America and Europe. He has backing of Italian Sonia for his sinister conversion activities in AP. He has total control of Hindu Temples and he is selling Temple Lands to his cronies.

Anji Babu said...

@ a2zdreams:

మన రాష్ట్రంలో మెజారిటీ ప్రజల ఇళ్ళల్లోకి దూసుకుపోయే ఈనాడు పేపర్ని ఎక్కువ మంది నమ్ముతారు అంటే అతిశయోక్తి కాదు. ఇది సహజం. కాని ఈనాడు, వారికి సెలెక్టివ్ గా వార్తలను వడ్డిస్తూ ద్రోహం చేస్తుంది అని నా అభిప్రాయం. అక్కడే ఆయనకున్న నిజాయితి దెబ్బతింటుంది. ఎన్నో ఏళ్ళుగా తింటూనే ఉంది. కాని ఆ నిజాయతి బీటలు వారడం 'మార్గదర్శి' ఎపిసోడుతో మొదలయ్యింది. నేను ఈనాడు తప్పకుండా చదువుతాను. కాని వార్తలను ఎంత వరకు అర్థం చేసుకోవాలో అంత వరకే అర్థం చేసుకుంటాను.
ఇక సాక్షి లాంటి పేపర్ని నేను 'trivia' కోసం చూస్తాను.

@pseudosecular:


Sakshi's purpose of existence is a well established fact.

And I think you have gone way ahead in deriding the Reddy family. Needless to say, I do not agree with your view, even as I respect your right to have one.

నేటి ఆంధ్ర said...

ఇంక రెండు రూపాయలు ఎక్కడ అండి సాక్షి పత్రిక ఇప్పుడు అది రెండున్నర రూపాయలు పత్రిక సైజు తగ్గినది పత్రిక పేజీలు తగ్గాయి , అ పత్రికని ఇప్పటి వరకు నడిపినది రాఘవ రెడ్డి అని ముఖ్యమంత్రి గారికి కి దగ్గర పర్సన్ ఆయనకి నిబంధనాలి విరుద్ధం గా చీమకుర్తి లో గలక్ష్య్ గ్రానైట్ కొండలు ఇచారు
నామమాత్రపు లీజు తో ,అయన గారి కంపెనీ నుండి ఎగుమతి అయ్యే రాయికి సీనరేజి కాని పన్నులు కాని ఉండవు అందుకని అయన ఇప్పటివరకు అ పత్రికకి ధన సహాయం చేసారు ,ఇంక వేరే వాళ్ళుకూడా ఉన్నారు కానీ అందరు ఇప్పటి ఆర్ధిక మాంద్యం వలన చేతులు ఎత్తేసరి వింటున్నాము అందకే పత్రిక రేటు పెంచారు అని
అయిన పత్రిక నడపడం అంటే మాటలు కాదు దానికి నిబద్హత ఉండాలి , దేశాన్ని దోచిన డబ్బులతో వ్యాపారాలు చీస్తే ఎలాగండి
విజయ్ భాస్కర్

Post a Comment

Please leave your comments here.

Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.

 

Receive posts in your Inbox

Enter your email address:

Delivered by FeedBurner

Mobstac Badge