You may want to see the entire list of posts on this blog sorted by Date. Click here for the entire Table of Contents

If you like this blog you may want to subscribe to the RSS feed | Subscribe

14 January 2009

కొన్ని సూటి ప్రశ్నలు - సమాధానాలు.


నా నమ్మకం ?
నేను నమ్మకాలను నమ్మను. నాస్తికుడను.

నా కులం/మతం ?
మొదటి దానికి అర్థం లేదు అని. రెండవది చెప్పుకునేది కాదు. ఒక జీవన విధానం మాత్రమే.

నా ఇడియాలజీ ?
సమ సమాజ భారతం. సమైక్య భారతం. సంపన్న భారతం. సంతోష భారతం.

తితిదే కి ఒక క్రైస్తవుడిని చైర్మన్ గా నియమించవచ్చా ?
కూడదు. 'ఏ పిచ్చికి ఆ మందే ఇవ్వాలి' అనే సామెత నా సమాధానం.

తితిదే మాజీ చైర్మన్ కరుణాకర రెడ్డి క్రైస్తవుడా ?
తెలియదు. అవునేమో. కాదేమో. ఒక వేళ పైకి ఒకటి చెప్పి లోపల ఇంకొకటి అనుకుంటాడు ఏమో. కాని అది నిరూపించగాలమా ? లేము కదా!!

సోనియా గాంధి విదేశీయురాలా ?
కాదు. ముమ్మాటికీ భారతీయురాలు.




4 comments:

Icanoclast said...

తితిదే కి ఒక క్రైస్తవుడిని చైర్మన్ గా నియమించవచ్చా ?
కూడదు. 'ఏ పిచ్చికి ఆ మందే ఇవ్వాలి' అనే సామెత నా సమాధానం.

చాలా బాగా చెప్పారు...

సోనియా గాంధి విదేశీయురాలా ?
కాదు. ముమ్మాటికీ భారతీయురాలు.
ఆమెన్....

ఒక వేళ ఎవరైనా కాదని వాదించినా... భారతీయుడైన రాహుల్ కన్నా చాలా better. అసలు నన్నడిగితే bill clintonనొ George Bushనో మన ప్రధానిని చేసుకుంటే దేశం చాలా బాగుపడుతుంది.

Anonymous said...

సోనియా గాంధీ ప్రధాని అవ్వాలని నేను అనలేదు. ఆమెకు అటువంటి అర్హతలు ఉన్నాయని నేను అనుకొను (అంటే దేవేగౌడకి అర్హత ఉందనీ కాదు!). కాని అయ్యే హక్కు ఉంది అని మాత్రం చెపుతాను.

టెక్నికల్ గా ఇతర దేశస్తులైన నేపాలీయులను మన దేశంలో జాతీయ పౌరులతో సమంగా చూస్తాం.

అలాగే మనం విదేశాలు వెళ్లి చదువుతునో, ఉద్యోగం చేస్తూనో అక్కడి వారు జాతి వివక్ష చూపిస్తే మనం తట్టుకోలేము.

మన వాడు ఎవడైనా వేరే దేశాల్లో స్థిరపడి, అక్కడి పౌరసత్వం తీసుకుని, అక్కడ రాజకీయాలలో వెల్లపోడిస్తే ఇక్కడ మనం రచ్చబండల మీద కూర్చుని ఈనాడులో ఆ వార్త చదువుతూ, ఓ తెగ డబ్బా కొట్టుకుంటాం.

కానీ ఒక భారతీయుడిని వివాహమాడి, నలభై ఏండ్లుగా భారత దేశంలోనే స్థిరపడి, భారత పౌరులకు జన్మనిచ్చిన ఒక స్త్రీ మాత్రం మనతో సమం కాదు. ఆమె ఎం.పి కావచ్చు. కాని ప్రధాని కాకూడదు. ఆహా..ఓహో !!!! ఇదే అసలైన ప్రజాస్వామ్యం.

నేటి ఆంధ్ర said...

lcanoclast గారు రాసినట్టు మనము జార్జి బుష్ నొ బిల్ల్ క్లింట్ట్ ణో తెచుకుంటే బాగుంటది అనె మాట చాలా బాధ కలిగించెది గా ఉన్నాది.మన దెసన్ని మార్చుకోవల్సినది మనము మారాల్సినది మనము తప్పు మనలొ పెట్టుకొని మనము ఎవరొ విదెసీయులు వచ్చి మనలని మన దేశాన్ని మారుస్తారనొ అనుకుంటె చాల పొరపాటు అయిన జార్జి బుష్ తన దేశాన్ని ఎలాంటి స్ట్థితి
కి తెచదొ మనందరము ఇప్పుదు చూస్తున్నాము .మూర్థిభవించిన అహంభావం కలిగిన బుష్ లాంటి నాయకులు మన దేశా నికి అవసరంలెదు మనలని మనము కించపరుచుకొకుండా మనము ముందుకు పొదాము
విజయ్ భాస్కర్

Anonymous said...

విజయ్ గారు
Icanoclast మనస్ఫూర్తిగా బుష్ ని మనం ప్రశానిని చేఉకోవాలి అనలేదు. సోనియా దేశీయత పై ఆయన నాతో విభేదించి అలా వ్యంగ్య వ్యాఖ్య చేశారు. అంతే.

అంజి.

Post a Comment

Please leave your comments here.

Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.

 

Receive posts in your Inbox

Enter your email address:

Delivered by FeedBurner

Mobstac Badge