You may want to see the entire list of posts on this blog sorted by Date. Click here for the entire Table of Contents
20 January 2009
అవినీతే కాదు: మరో రకమైన నీతి కూడా సాధ్యం ఇక్కడ.
అస్సలు మన దద్దమ్మలకు బుద్ధి ఎక్కడ ఉందో తెలుసా. అరికాళ్ళలో.
యన్ వి యస్ రెడ్డికి పదవి పొడిగింపు, జీతభత్యాల పెంపు, వాటిని శాశ్వతం చేస్తూ జి.వో ఒకటి విడుదల చేయడం.
ఇంతకీ ఇతనెవరు అంటారా. అప్పట్లో మైటాస్ కంపెనీకి హైదరాబాదు మెట్రో కాంట్రాక్టు ఇస్తే డిల్లీ మెట్రో అధినేత శ్రీధరన్ విమర్శించారని, ఆయన మీద పరువు నాస్తం దావా వేస్తాం అని బెదిరించిన ఘనుడు.
అంతే కాక అప్పటివరకు మార్గదర్శిగా ఉన్న ఆ సంస్థను ఆ విధుల నుండి తప్పించిన గొప్ప వ్యక్తీ.
యావత్భారతానికే రత్నం లాంటి శ్రీధరన్ ఆన్న మాటలను ఒక్క కోశానా కూడా ఆనాడు పట్టించున్న నాధుడు లేడు. ఆయన ఆ రోజున చెప్పిన స్కాము ఈ రోజు బయట పడ్డాక కూడా ప్రభుత్వం కళ్లు తేరుచుకోకుండా, విధులు సక్రమంగా నిర్వహించలేని అధికారికి శాశ్వత పోస్టింగు, రాష్ట్ర సర్వీసుకు బదిలీ వగైరాలు.
అంతే కాక లక్ష ముప్పై వేళ రూపాయల జీతం అట. త్రివిధ దళాల అధిపతులకు కూడా దక్కనంత జీతం. ఇంత కూర్చి ఈయన వెలగ పొడిచేది ఏంటి రా బాబు అంటే, ఇలా దివాలా కోరు కంపెనీలకు ఏరి కోరి వేళ కోట్ల రూపాయల పనుల అప్పగింత. ఈ అప్పగింతల వెనుక చాల తతంగమే నడిచి ఉండాలని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
సార్లకు వత్తాసు పాడితే చాలు ఆన్న మాట. ఏమైనా జరిగిపోతాయి. ఆర్ధిక మాంద్యం మనకే. సర్కారు మెచ్చిన ఉద్యోగులకు అది వర్తించదు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
Please leave your comments here.
Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.