ఇవ్వాళ అమెరికాలో కొత్త తరాన్ని ప్రతిబింబించే కొత్త నాయకత్వం పగ్గాలు చేపట్టబోతుంది.
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక మాంద్యం నేపధ్యంలో అంతా ఈ కొత్త నాయకత్వం అమెరికాని ఎటు వైపు తీసుకువెళ్తుంది అని ఎదురుచూస్స్తున్నారు. మన దేశంలోని ఆర్ధిక స్థితిగతులు కూడా అక్కడి పరిస్థితుల మీద ఆధారపడి ఉంది అని చెప్పడంలో తప్పు లేదు.
కొత్త కొత్త సవాళ్ళకు కొత్త రకం నాయకత్వంతో ముందుకు దూసుకువేల్లాల్సిన తరుణం ఇది. దేశ ప్రజలలో నెలకొన్న ఆర్ధిక అనుబంధ భయాలను, అనుమానాలను తరిమికోట్టేల్లాంటి చర్యలు చేపడుతూ ప్రజల వెన్నంటి ఉండవలసిన సమయం.
మన ఖర్మ ఏమిటో కాని మనం మాత్రం స్కాముల మీద స్కాముల గురించి రోజు పేపర్లో చదువుతున్నాం. అదేమిటో ప్రభుత్వం కాని, ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం అనుకున్నా వాళ్లు కాని ఏదైనా కొత్త హామీ కాని స్కీము కాని ప్రకటించిన వెంటనే అందులో ఏం స్కాము ఉందో ఏమిటో అనే కోణం నుంచి ఆలోచించాల్సి వస్తుంది. కావాలని కాదు. దానంతట అదే ఆలోచన వస్తుంది.
ఆర్ధిక మాంద్యం మనకు సంభందించిన విషయం కాదు అని చేతులు దులుపుకు పోతున్న నాయకత్వం కనిపిస్తుందే కాని, వెధవ జీవితం, ఒక్కడు కూడా మన కోసం పని చేస్తున్నాడు అనేలాగా కనిపించడం లేదు. ప్రభుత్వం వెలుపల ఉన్నవాళ్ళు ఏ పేపర్లో ప్రభుత్వ వ్యతిరేకంగా వార్త వస్తుందా, మనం దాన్ని హైలైటు చేసి టీవీలకి ఎక్కుదాం అన్నట్టు రెడీగా ఉన్నారు.
మనకి ఎప్పుడు వస్తుంది ఆదర్సప్రాయమైన నాయకత్వం. చూస్తే వీడు మన కోసం పుట్టాడు అని అనిపించేలా నాయకులు ఇంక పుట్టారా. వాళ్లు పైకి ఎదిగి రాలేరా. ఆ నాడు తెల్ల దొరలను ఎదిరించి మనందరి కోసం అసువులు బారిన నాయకుల భావాలు కలిగిన వారు ఇంక మళ్ళీ పుట్టారా.
మరీ మేలోడ్రామలాగా మాటాడుతున్నాను అనుకుంటున్నారా. ఇప్పుడు నాకు అంత కన్నా ఆలోచనలు ఏమి రావడం లేదు. చేతిలో వోటు అనే ఆయుధం ఉంది. కాని అది ఎవరికి వేసినా ఇన్నాళ్ళు చేయనిది ఇప్పుడేమి చేస్తారులే అన్న భావన. కొత్త వాడికి వేయమంటారా, నా పాత పోస్టులు చూసాక అలా అనరులెండి.
ఇంక నయం. కేంద్రంలో కూడా రాజకీయాలు ఇంత చిల్లరగా ఇంత దగాతనం తో కూడుకున్నవి అయివుంటే మనం ఈపాటికి దివాలా తీసేవాళ్ళం, పాకిస్తాన్ లాగా. కేంద్రం విషయంలో అయినా కొంచెం ఆశ మిగిలిఉంది.
ఇప్పటికే నా భావాలను రాయడానికి నానా తిప్పలు పడ్డాను. ఇంక శెలవు.
You may want to see the entire list of posts on this blog sorted by Date. Click here for the entire Table of Contents
20 January 2009
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
:(
మీరు చెప్పిన విషయాలు మనందరికీ తెలుసు
కాని ఈ పార్టీ నాయకులకు అవి పట్టవు
అధికారమే ముఖ్యం
అందుకు భార్యను కూడా తాకట్టు పెడతారు - కీ శే నాగభూషణం గారు ఒక సినిమా లో చెప్పారు
ఇక్కడ రాజకీయనాయకులకు ప్రజలు పట్టారు - అధికారం, దర్పం, అవినీతి, మతిలేని మాటలు తప్ప.
ఎన్ని వ్రాసిన ఉపయోగం ఉంది అంటారా ?
రవి కుమార్
మీరు అన్నది నిజమే. మనం ఎంత కోరుకున్నా, ఏమి అనుకున్నా జరిగేతంతు జరుగుతూనే ఉంటుంది. మన మాటలు ఆశలు అన్నీ ఇలా రాతల్లాగా మిగిలిపోవడం తప్ప ఒరిగేతి ఏమి లేదు.
మీరు చెప్పినది చదువుతుంటే పరుచూరి గోప్లక్రిష్ణ ప్రతిధ్వని అనే సినిమాలో చెప్పిన ఒక మాట గుర్తుకువస్తుంది రాజకీయం అంటే రాక్షసం గా జ- జనానికి కీ - కీడు చేసే య్యం - యమ్త్రంగం
ఇదే రాజకీయం
ఎవరు అధికారానికి వచ్చిన ఇదే సంగతి
రాజకీయం కి వేరే భాష్యం చెప్పగలిగితే చెప్పగలిగే నాయకుడు ఇప్పుడు కను చూపు మేరలో లేడు
విజయ్ భాస్కర్
Post a Comment
Please leave your comments here.
Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.