You may want to see the entire list of posts on this blog sorted by Date. Click here for the entire Table of Contents

If you like this blog you may want to subscribe to the RSS feed | Subscribe

18 December 2008

తెలుగు జాతిని పీడిస్తున్న పలు రకాల పిచ్చిలు


ఇప్పుడే ఒక వెబ్సైటులో ఒక వార్తాంసం చూశాను. దాని కింద ఉన్నా వ్యాఖ్యలపై పోరాపాటున నా దృష్టి పడింది. చూసి ఆశ్చర్యపోలేదు కాని చిరాకు పడ్డాను. ఈ మధ్య వెబ్ ఫోరుమ్స్ మన వాళ్లకు ఒకరినొకరు తిట్టి పోసుకునే బెటిల్ గ్రవుండ్లుగా మారుతున్నాయి. వార్తాంసం నచకపోతేయ్ రాసినవాడిని అమ్మనా బూతులు తిడుతున్నారు. ఒక విశ్లేషణ రాసిన వెబ్సైటుపై మన యువత ఇన్ని అభాండాలు వేయడం లేక మనం ఒకరినొకరు తిట్టి పోసుకోవడం చాల దారుణం.

చిరంజీవి పార్టీ పెడితే తప్పు ఏముంది. అది ఆయనిష్టం. తనేదో చేద్దాం అని వస్తున్నాడు. చేయగల్గుతాడో లేదో అప్పుడే వెబ్సైటుల న్యూస్ చదివి కామెంట్స్ లో మీరో నేనో డిసైడ్ చేయలేము. అలాని చెప్పి మన అభిప్రాయం చెప్పకుండా ఉండలేము. కాని చెప్పే విధానం ముఖ్యం.

అది ఒకటి ఐతే, చిరజీవి పార్టీ పెట్టాడు. ఓకే. ఆ పార్టీ వ్యూహాలను అభిప్రాయాలను ఎవరు విమర్సిన్చకూడతా. ఏం ఆయనేమైనా ఆకసం నుండి వచ్చారా. ఇంక చిరంజీవి చెప్పే ప్రజాస్వామ్య విలువలు ఎలా కాపాదగాల్గుతాము.

జీవితంలో అందరికి ఇష్టాలు అయిష్టాలు ఉంటాయి. అవి ఒకోకరికి వేరుగా ఉంటాయి. అలాగని చెప్పి పక్క వాడి ఇష్టపదేదాన్ని చెడు అనడం సమజసం కాదు. పద్దతిగా విమర్శించడం నేర్చుకోవాలి. అలాగే విమర్శలను తిట్లగా భావించరాదు.

మన తెలుగు జాతి ఇంకా తగిన గుర్తింపునకు నోచుకోవడం లేదు అంటే అందుకు కారణం మనమందరం. తమిళ సోదరులను చూసి మనం నేర్చుకోవలసింది చాల ఉంది. కుల, మత, సినీ ప్రేమ ప్రాతిపదికన మనము మన రాజకీయ అభిప్రాయాలను ఏర్పరుచుకోకూడదు. ఒకవేళ అలా ఎవరైనా ఏర్పరచుకుంటే వారిని చిన్న చూపు చూడడం ఒకరినొకరు బూతులు కూసుకోవడం కన్నా హీనమైన హేయమైన పని ఇంకొకటి ఉండదు ఈ లోకంలో.

లోపం వార్త చేరవేసేవాడిలో కాదు. మనలో ఉంది. ఇది మనం ఎప్పుడు గ్రహిస్తామో అప్పుడే మన జాతికి తగిన మర్యాద ఇచిన, తెచ్చిన వారమవుతాము.

0 comments:

Post a Comment

Please leave your comments here.

Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.

 

Receive posts in your Inbox

Enter your email address:

Delivered by FeedBurner

Mobstac Badge