You may want to see the entire list of posts on this blog sorted by Date. Click here for the entire Table of Contents
18 December 2008
ఉన్మాదానికి శిక్ష
అవి నేను తిరుచిరాపల్లిలో ఇంజనీరింగ్ చదివే రోజులు. నేను మూడో సం! లో ఉన్నాననుకుంటా. ఎప్పటిలానే కాలేజీ నుండి ఇళ్ళకు తిరిగివేల్లెప్పుడు దారిలో ఒక చిన్న దుకాణంలో సాయంకాలం పేపర్ ఒకటి చూసాను. అందులో పెద్ద పెద్ద అక్షరాలతో " విద్యార్ధిని దారుణ హత్య" అన్న దుర్వార్త వుంది.
మొత్తం చదివాక ఒక్కసారిగా వెక్కముకలో వణుకు పుట్టింది. rec లో ఒక విద్యార్ధినిని ఒక యువకుడు తన ప్రేమ అంగీకరించలేదు అన్న కోపంతో, ఇంకెవరినైనా ప్రేమిస్తుందేమో అన్న అనుమానంతో, పట్టపగలు అందరూ చూస్తుండగా డిపార్టుమెంటు బిల్డింగ్ ముందట కత్తితో పొడిచి అతి దారుణంగా చంపాడు. అతను ఆ కాలేజీ కాదు. బయట నుండి వచ్చాడు. పొడిచిన తరువాత రాజాలాగా నడిచి వెళ్లి మెయిన్ గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ రూమ్ బయట ఉన్న కుర్చీలో కూర్చొని, కత్తి కింద పడేసి , గార్డుని చేతులు కడుక్కోవడానికి నీళ్లు అడిగి తీసుకున్నాడు. అతనిలో ఏ మాత్రం అదురు బెదురు కనిపించలేదు అక్కడివారికి. పోలీసులు వచ్చాక తనే నేరుగా వెళ్లి జీప్ ఎక్కి కూర్చున్నాడు.
సమాజంలో ఇంకా ఇలాంటి పిచ్చి వాళ్ళున్నారా అని అనుకున్నాను. ఆ సాయంత్రమంతా ఎవరిని కలిసిన అదే టాపిక్. మరుసటిరోజు కాలేజీకి వెళితే అక్కడ తెలిసింది. ఆ ఉన్మాది నా మిత్రుని పక్కింట్లో ఉండేవాడు అని. అతను కూడా ఒక మంచి కాలేజీలో బాగానే చదివేవాడు అంట. మరి ఏం పోయేకాలం.
ఇంతా జరిగాక అన్ని కాలేజీలు సెక్యూరిటీని కాస్త కఠినం చేసాయి. కొన్నాళ్ళవరకు ఆ విషయం గురించి మల్లీ వార్తలు ఏమి తెలియలేదు. మనం ఏమనుకుంటాం. ఆ దౌర్భాగ్యుడిని తగినట్టు శిక్షిస్తారు అనుకుంటాం. కాని కొన్నాళ్ళ తరువాత నా మిత్రుని ద్వారా తెలిసింది. అతన్ని బయటకు తీసుకు వచ్చారని. కారణం ఏంటి అంటే , అతనికి మతి స్తిమితం లేదు అని కోర్టులో నిరూపించి మెంటల్ హాస్పిటల్ కు తరలించారు. ఏముంది గురుడు కొన్నాళ్ళు అక్కడ పిచ్చి వాళ్ళతో గడిపి తరువాత ఎంచక్కా బయటకు వచ్చి మీలాగ నాలాగ తిరుగుతాడు.
ఇదంతా ఎందుకు చెపుతున్నాను అంటే ఇటీవల వరంగల్లో జరిగిన అఘాయిత్యం, దాని తరువాత నిందుతులను పోలిసులు ఎన్కౌంటర్ చేసిన విధం గురించి ఆలోచిస్తుంటే ఆ పాత విషయం గుర్తుకు వచ్చింది. ఒక వేళ ఈ కేసులో కూడా నిందితులు ఏదో ఒకటి చేసి తప్పించుకుని ఉండే వారేమో అని అనిపించింది. అంతే కాక ప్రేమ పేరుతో సమాజంలో యువతులపై ఉన్మాదులు పాల్పడే అఘాయిత్యాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది అని నా అభిప్రాయం. ఒక వేళ నిందితులను శిక్షించినా ఇకపై ఎవరూ అలా చెయ్యకుండా నియంత్రిచడంలో ఆ తీర్పు ఉపయోగపడేదని నేను అనుకోవడం లేదు.
యువతులపై రోజు రోజు అఘాయిత్యాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఇవ్వన్ని దృష్టిలో ఉంచుకునే పోలిసులు ఆ ముగ్గురు యువకులను ఎన్కౌంటర్ చేసారు అనడంలో సందేహం లేదు. అంటే కాక ఈ ఎన్కౌంటర్ వెనుక తప్పకుండా వరంగల్ పోలీసులకు చాల ఉన్నత స్థాయి నుండి ఆదేశాలు వచ్చి ఉంటాయి అని కూడా నేను నమ్ముతాను. లేకపోతే ఇంత పెద్ద ఎన్కౌంటర్ మీద ఒక్క ఉన్నత స్థాయి విచారణ కూడా లేకపోవడం ఏమిటి.
ఏది ఏమైనా నేను అనుకున్నది చెప్పాలి కదా. అంటే ఇక మీదట ఎవ్వడైనా స్త్రీలపై ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడే ముందు ఒకటి పది సార్లు ఆలోచిస్తారు. ఈ ఎన్కౌంటర్ గుర్తుకు వచ్చి ఒక్కొక్కడికి చెమటలు పట్టాలి. సమాజంలో స్త్రీలను నిత్యం పలు రకాలుగా వేధిస్తున్న ఉన్మాదులందరికి ఇది పోలిసులు పంపిన వర్తమానం అనుకోవచ్చు.
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
ఈ బ్లగ్ చూసి చాలా సంతోషం
కిరణ్ గారు,
మీ రాక మాకు మరింత సంతోషాన్ని కలిగించింది.
వందే మాతరం
Post a Comment
Please leave your comments here.
Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.