You may want to see the entire list of posts on this blog sorted by Date. Click here for the entire Table of Contents

If you like this blog you may want to subscribe to the RSS feed | Subscribe

17 December 2008

గూగుల్ నిర్వహిస్తున్న ఉత్తమ పంచాయతి పోటీ



మనం అందరం ఆదరించే, అభిమానించే సేవలను ఇంటర్నెట్లో అందిస్తున్న గూగుల్ ప్రపంచవ్యాప్తంగా సామాజిక సేవను గూగుల్.ఆర్గ్ ద్వారా చేస్తుంది.

అలాగే మన దేశంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలలో ఉత్తమ పంచాయతీలను గుర్తించి మరింత ప్రోత్సహించడానికి ఒక పోటీ నిర్వహిస్తుంది. పోటీ ప్రకటనను నేను ఈనాడు పేపర్లో చూసాను. ఇది ఒక మంచి పరిణామము.




అంతే కాదు. పెద్ద పెద్ద కంపెనీలు అనేక రకాల సామాజిక సేవా కార్యక్రమాలను చేపడతాయి. అయితే గూగుల్ వంటి అంతర్జాతీయ కంపెనీ పంచాయతీ వంటి ఒక పూర్తిగా భారతదేశానికే చెందినా అంశమును గుర్తించి వాటిని ప్రోత్సహించాలనుకోవడం చాలా అభినందనీయం. పోటీలో గెలిచిన పంచాయతీలకు బహుమతిగా ఇచ్చే నగదు కేవలం ఇదు లక్షలే అయినా వేసే అడుగు మంచిదైనప్పుడు అది పెద్దగా పట్టించుకోనక్కరలేదు.

గూగుల్ వెబ్సైటులో ఈ పోటీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి .

0 comments:

Post a Comment

Please leave your comments here.

Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.

 

Receive posts in your Inbox

Enter your email address:

Delivered by FeedBurner

Mobstac Badge