ఈ వార్త మొన్న ఈనాడులో చూసే ఉంటారు. ఈనాడులో వేసిన లెక్క ప్రకారం కనీసం ఐదారు డజన్ల ఎమ్యెల్లేలకు కాంగ్రెస్ ఈ సారి టికెట్ ఇవ్వకపోవచ్చు అట. ప్రజలలో కాంగ్రెస్ ని బాగా వెధవలలాగా చూపించడానికి ఈనాడు పేపరు కొంచెం పెద్ద అంకెను రాసింది అనుకున్నా కూడా ఇప్పుడు ఉన్నా వారిలో చాలామది సీట్లు పోగొట్టుకుంటారు అనేది నమ్మవచ్చు.
ఎందుకు అంటే ఇప్పుడు ఉన్నవారిలో నిన్న కాక మొన్న పదవిలోకి వచ్చిన వారే ఎక్కువ. నా దృష్టిలో అందులో ఎంతో మంది ఉన్నంతలో కుదిరినంత దోచుకుందాం అనే చందాన తెగ సంపాదించారు అనడంలో తప్పులేదు. ఉదాహరణకి గుంటూరు నుండి ఎన్నికైన తాడిసేట్టి వెంకట్రావుని తీసుకుందాం. మొన్న ఎలెక్షన్ గెలవక ముందు ఆయనగారి స్టేటస్ ని ఇవాల్టి స్టేటస్ ని , ఆయన అనుభవిస్తున్న పలు రకాల అనవసరపు భోగాలు ఏమాత్రం పొంతన లేదు. అంతే కాక నగర కార్పొరేషన్ అన్నికలు జరిగినప్పుడు తన తమ్ముడికి పదవి దక్కించుకోవడానికి చేసిన లాబీయింగ్ అంత ఇంతా కాదు.
వరదలు వచ్చి ప్రజలు చాలా కష్టనష్టాల బారిన పడితే పరామర్సించడానికి వస్తున్న ముఖ్యమంత్రికి స్వాగత తోరనాలకి కనీసం నలభై లక్షలు వరకు ఖర్చు పెట్టాడు అని అప్పట్లో మారుమోగిపోయింది. ఈ డబ్బు అంతా అవినీతి డబ్బే అనడంలో సందేహం లేదు. ఇలా ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుంటే మనకు జీవితకాలం సరిపోదు ఏమో.
ఇలాంటి వారికి సీట్లు ఇచ్చి దారుణంగా ఓడిపోవడం కన్నా శివసేన వాళ్లు ముంబై కార్పొరేషన్ ఎన్నికలకు చేసినట్లు సిట్టింగ్ వాళ్లకు కాదు అని కోత వాలకు ఇచ్చి కొంత వరకు ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకోవడానికి ప్రయత్నించడంలో తప్పు లేదు అని కాంగ్రెస్ వాళ్లు అనుకుంటున్నారేమో.
ఈ సారి అయినా పోటీలో ఉన్నా వెధవలలో ఉత్తమ వెధవను ఎన్నుకోండి అనే రీతిలో కాకుండా మన పార్టీలు కొందరికైనా మంచి అబ్యర్ధులకు సీట్లు ఇవ్వాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
You may want to see the entire list of posts on this blog sorted by Date. Click here for the entire Table of Contents
16 December 2008
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
Please leave your comments here.
Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.