You may want to see the entire list of posts on this blog sorted by Date. Click here for the entire Table of Contents

If you like this blog you may want to subscribe to the RSS feed | Subscribe

06 December 2008

పాత బస్తీ కాల్పుల సంఘటన : పోలిసుల అతి తెలివి


మొన్న పాతబస్తీలో వికారుద్దిన్ అనే సిమి కార్యకర్త పోలిసులకు మస్కా కొట్టి చిన్న పిల్లవాడి చేతిలో బెల్లం పెట్టి పారిపోయినట్టు తప్పించుకున్నాడు. ఈ ఉదంతం హైదరాబాద్ లో టాక్ అఫ్ ది టౌన్ గా మారింది.

అదే రోజు మన హోం మంత్రి జానా రెడ్డి ప్రెస్ వాళ్ళతో మాట్లాడుతూ ఈ ఉదంతం పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని రుజువుచేసింది అన్నాడు. వినగానే నేను నవ్వుకోలేక చచ్చిపోయాను.

ఏదో 'జేబుదొంగను' పట్టుకోవడానికి వెళ్ళినట్లు మన పోలిసులు
లింగు లింగు మంటూ లాటీలూపుకుంటూ వెళితే "ఇంకొక సారి ఇటు పక్కకు వస్తారా" అన్నట్టుగా సరదాగా కాల్చినట్టు తుపాకీలతో ఇద్దరు పోలీసులను కాల్చి దర్జాగా పారిపోయారు ఉగ్రవాదులు. ఇది ఏదో గొప్ప విజయం అన్నట్టుగా హోం మంత్రి పోలీసులకి కితాబు ఇవ్వడం వాడి దద్దమ్మతనానికి ప్రతీక.

నేనయితే ఆ పోలిసుల ఇంచార్జులను కొన్నాలు ఏ అటవీ ప్రాంతానికో ట్రాన్స్ఫర్ చేసేవాడిని. అస్సలు కాస్త అటు ఇటు ఐతే పోలిసుల ప్రాణాలు పోయిఉండేవి. ఏదో టైం బాగుంది మన వాళ్లు తోపాకి గాయాలతో బతికిపోయారు. అప్రమత్తంగా ఉండడానికి అజాగ్రతగా ఉండడానికి తేడా తెలియని మన పిచి హోం మంత్రిని చూసి నవ్వాలా ఏడవాలా ?

0 comments:

Post a Comment

Please leave your comments here.

Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.

 

Receive posts in your Inbox

Enter your email address:

Delivered by FeedBurner

Mobstac Badge