You may want to see the entire list of posts on this blog sorted by Date. Click here for the entire Table of Contents
05 December 2008
రోడ్ షోల పై స్టే : హైకోర్టు సరైన తీర్పు
మొన్న మన రాష్ట్ర హైకోర్టు రోడ్ షోలపై స్టే విధించడం అభినందనీయం. ఎందుకంటే ఇటీవల కాలంలో కనీసం ఒక అర డజను రాజకీయ పార్టీలు ఇష్టం వచినట్లు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ రోడ్ షోల పేరుతో రాజకీయ ప్రచారాలు చేయటం ఆయా ప్రాంతాలలో నివసించే జనానికి లేని పోనీ ఇబ్బందులు తలనోప్పిలకు గురిచేయడం అలవాటు అయిపోయింది.
పల్లెబాట, నగరబాట పేర్లతో కాంగ్రెస్, మీ కోసం అంటూ తెదేపా, నిన్నకాక మొన్న తెరాస , అంతే కాక కొత్తగా పెట్టిన ప్రరాపా , నతెపా ఎవరికి వాళ్లు ఒక ఎ.సి బస్సు లేక వాన్ సిద్ధంచేసుకుని ఊరిమీద పది జన్నాన్ని నానా ఇబ్బందుల పాలు చేస్తున్నారు. హై కోర్టు ఇచ్చిన స్టే తో కొంత కాలం ఈ వీధి నాటకాలకి తెర పడినట్లే.
ఖర్చు లేకుండా జనాన్ని పోగుచేయ్యవచ్చు అని ఇన్నాళ్ళు రకరకాల పేర్లతో ఉనికి చాటుకోవడానికి చేసిన, చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇక మీదట పటాపంచెలు కాకతప్పదు. అయితే ఈ నిరయం స్టే మాత్రమే కాకుండా ఒక పూర్తి తరహా తీర్మానంగా రావాలని నా కోరిక. హై కోర్టు కాదు అంటే సుప్రీం కోర్టుకు మన వాళ్లు తప్పకుండా వెళతారు అనేది మనం చెప్పనక్కర్లేదు. అక్కడ కూడా ప్రజలకు అనుకూలంగా తీర్పు రావాలని ఆశిద్దాం.
కాగా ఈ నిర్ణయం వల్ల అందరికన్నా ఎవరికి పెద్ద బొక్క అంటే పాపం ప్రజా రాజ్యం పర్తీకేనని చెప్పాలి. నిన్న కాక మొన్న పార్టీ పెట్టి ప్రజలలోకి వెళ్లి పరిచయాలు పెంచుకుందాం అని కలలు కన్న చిరంజీవికి ఇది చాలా పెద్ద దెబ్బ.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
Please leave your comments here.
Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.