You may want to see the entire list of posts on this blog sorted by Date. Click here for the entire Table of Contents
19 December 2008
భళా జగన్ భక్తులారా!
ఆంగ్లములో "sycophancy" అనే పదం ఒకటి ఉంది. అది బహుశా కాంగ్రెస్ వాళ్ళకి సరిపోయినంత ఇంకెవరికి సరిపోదు ఏమో. ఇంతకీ ఆ పదం అర్థం ఏమిటంటే: ఉన్నత స్థానాలలో ఉన్నవారిని అతిగా పొగిడి తద్వారా స్వలాంభం కోసం ప్రయత్నించే గుణం.
ఈ గుణం కాంగ్రెస్ లో అత్యున్నత స్థాయి నాయకుడి నుండి క్రింది స్థాయి వారికి కూడా ఉంటుంది. ఐతే ఈ గుణం కట్టలు తెంచుకుంటే ఎలా ఉంటుంది అంటే ఈ క్రింది ఉదాహరణని చెప్పుకోవచ్చు.
ఇంత వరకూ ఎటువంటి ప్రజా పదవిని అలంకరించని, కనీసం పోటీ కూడా చేయని వై యస్ జగన్ పేరిట ఒక సేవ సమితి నెలకొల్పడం ఒక ఎత్తు. (పెడితే తప్పా అంటారా! ఎ మాటకామాట. లేదులెండి. ఎవడిష్టం వాడిది కదా.)
అయితే అది నెలకొల్పి వై యస్ రాజ రెడ్డి పేరిట ఒక అవార్డు నెలకొల్పడం కూడా ఓకే. కానీ రాజ రెడ్డి స్మారకార్థం నెలకొల్పిన అవార్డును జగన్ పుట్టినరోజు నాడు ఇవ్వడం అస్సలు సిస్సలు చావుకబారుతనం అనిపించుకుంటుంది.
అంతేకాక రాజ రెడ్డి స్థాయి దిగజార్చడం అవుతుంది. ఇందులో మంత్రులు వేరే ముఖ్య అతిధులుగా పాల్గొంటారట.
పిచ్చికి పరాకాష్ట. "Such a bunch of losers" అని అనకుండా ఉండలేకపోతున్నాను.
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
ఈ జాడ్యం ఒక్క కాంగ్రేశ్ వాళ్ళకే ఉందనుకుంటే పొరపాటేనండీ. మొత్తం రాజకీయ రంగం అంతా ఇంతే. కొత్తగా వస్తున్న ఫ్రజా రాజ్యం వాళ్ళలో కూడా ఈ పోకడ కనబడుతోంది. ఈ విషయాన్ని తొందరగా వంట పట్టించుకున్నట్లున్నారు.పద నిర్ధారణ తొలగించ గలరని మనవి.
మీరు అన్నది వాస్తవమే. కాకపోతే ఇటువంటి వాటికి దశాబ్దాల క్రితం ఆజ్యం పోసింది కాంగ్రెస్ పార్టీ అని నేను చెప్పతలచాను. ఇక ప్రజారాజ్యం అంటారా, అది ప్రస్తుతానికి వన్ మాన్ షో అన్న విషయం మనకు తెలిసిందే కదా.
మీరు కోరినట్లు పద నిర్ధారణ తీసివేశాను. మీ ఫీడు కొరకు కృతజ్ఞతలు. మరలా కలుద్దాం.
వరంగల్ హత్యల గురించి మీరు రాసినదానితో ఏకీభవించడంలేదు. మనకు కడుపు మండినప్పుడల్లా కడుపుతో ఆలోచించడం కరెక్టు కాదు.
అక్షరదోషాలు రాకుండా చూడగలరు.
మీరు అన్న మాట నూటికి నూరుపాళ్ళు సరైనదే. ఇటువంటి ఎన్కౌంటర్ లు పదే పదే జరగాలనో లేక పోలిసులు ప్రవర్తించిన తీరు సరైనదనో నేను అభిప్ర్రయపడలేదు. వాళ్లు వెళ్ళిన దారి తప్పుడిదే అయినా దుర్మదాన్ధులకు వారి చర్య ఇచ్చిన హెచ్చరిక బాగా పనిచేస్తుందని నా అభిప్రాయం. ఈ ఎన్కౌంటర్ నకు కారకులైన పోలీసులను శిక్షించడానికి నేను వ్యతిరేకిని కాను.
అచ్చుతప్పులు రాకుండా తప్పకుండా ప్రయత్నిస్తాను. మీ సమీక్షకు మా మెప్పులు.
Post a Comment
Please leave your comments here.
Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.