You may want to see the entire list of posts on this blog sorted by Date. Click here for the entire Table of Contents

If you like this blog you may want to subscribe to the RSS feed | Subscribe

20 December 2008

మొద్దు శీను హత్య కేసు: ఇదేమి ట్విస్టు ?



మొద్దు శీను హత్య కేసులో అరెస్టు చేయబడ్డ ఓంప్రకాష్ అనే వ్యక్తిని నిన్న కోర్టులో హాజరు చేయడానికి పోలిసులు తీసుకువెళ్తుండగా అతను మీడియా వాళ్ళతో "మూడు నెలలు ఆగండి. ఎన్నికలు వస్తాయి. రామ రాజ్యం ఏర్పడుతుంది" అని అన్నాడట. అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి అతను వ్యతిరకం అనే సందేశం ఇస్తున్నాడు.

ఇది చదివాక నాకు రెండు ఆలోచనలు వచ్చాయి. ఒకటి: ఒక వేళ మొద్దు శీనుని తెదేపా ఆరోపించినట్లు కాంగ్రెస్ వాళ్లు చంపించలేదు ఏమో, పరిటాల సానుభూతిపరులు కాని , తెదేపా సానుభూతిపరులు కాని చేపించిఉంటారు అనే వాదన బలపడుతుంది. మీకు గుర్తు ఉందో లేదో. ఇతని కుటుంబ సభ్యులు ఒకరు ఇది వరకు తెదేపా తరపున వారి ఊరిలో సంస్థాగత ఎన్నికల్లో పోటీ చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి కూడా.

రెండు: ఇది అంతా కాంగ్రెస్ తరపు వాళ్లు చేపించి, జనంలో అనుమానపు బీజాలు వేయడానికి పకడ్బందీ పధకం వేసి, అతని చేత ఇటువంటి వ్యాఖ్యలు చేపిస్తున్నారేమో.

ఏది ఏమైనా మిస్టరీ వీడి అస్సలు నిజాలు బయటికి రావడానికి ఏళ్ళు పడుతుంది అనేది అనుమానం లేకుండా చెప్పవచ్చు. అస్సలు వస్తుందో లేదో.

0 comments:

Post a Comment

Please leave your comments here.

Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.

 

Receive posts in your Inbox

Enter your email address:

Delivered by FeedBurner

Mobstac Badge