You may want to see the entire list of posts on this blog sorted by Date. Click here for the entire Table of Contents

If you like this blog you may want to subscribe to the RSS feed | Subscribe

21 December 2008

వచ్చే ఎన్నికల గురించి నా ప్రివ్యూ


దాదాపు రెండున్నర దశాబ్దాల తరువాత ఒక పార్టీ ఆవిర్భావం మళ్ళీ ఇంతటి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఒక ఇద్దరు ముగ్గురు తెలుగు వాళ్లు ఎక్కడ కలుసుకున్నా అదే టాపిక్. ఆ పార్టీ పెట్టిన వారు ఎంత లాభపడతారు అనేదానికన్నా ఇప్పుడున్నవారిలో ఎవరు ఎక్కువ నష్టపోతారు అనే పాయింట్ మీదనే ఎక్కువ సంభాషణలు జరుగుతున్నాయి అని చెప్పవచ్చు.

ఇక కాంగ్రెస్ తెదేపా అయితే ప్రరాపా వలన మీకు నష్టం అంటే మీకు నష్టం అని ఒకరికొకరు మీడియా సమక్షంలో జోస్యం చెప్పుక్కుంటున్నారు. ప్రారాపా అయితే ఆల్రెడీ రెండో స్థానంలో ఉన్న పార్టీ తమకు పోటీ కాదు అని ఇప్పుడు రాజ్యమేలుతున్న కాంగ్రెస్ పార్టీయే తమకు పోటీ అని చెప్పుకుంటున్నారు. ఇక టిఆర్ఎస్ ఒంటరిగా వెళితే లాభం లేదు అని చెప్పి ఎవడో ఒకడితో కలిసి పోటీ చేద్దాం అని డిసైడ్ అయ్యింది. కమ్యూనిస్టుల గురించి నేను మాట్లాడదలచుకోలేదు.

అస్సలు వోటు ఎవరికీ పడుతుంది. ఎవరిది చీలుతుంది అనేది కచ్చితంగా ఇప్పుడే చెప్పలేము కానీ, నాకేమనిపిస్తుందంటే:

మొదట్లో కొంత జంకినా కాంగ్రెస్ కొంచెం నిద్ర మేలుకుని తాము సేఫ్ అన్నట్టుగా కటింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. అధికారంలో ఉన్న పార్టీగా ఆమాత్రం ఉండాలి కదా. నాలుగున్నరేళ్ళలో ఇప్పటివరకు ఏ ఎన్నికలలోనూ ప్రతికూల పవనాలు వీయకపోవడం వారి ధైర్యానికి ఒక కారణం అయితే, ప్రభుత్వ వ్యతిరేక వోటు చీలిపోతుంది అన్నది అస్సలు కారణంగా కనపడుతుంది. ఆ ధైర్యమే బలంగా వచ్చే ఎన్నికల్లో వాళ్లు బరిలోకి దిగుతారు అనేది నిస్సంకోచంగా చెప్పవచ్చు. దానికి తోడు ఈ నాలుగున్నరేళ్ళు సంపాదించిన డబ్బు కుప్పలుతెప్పలుగా రాష్ట్రం మీదకి విసురుతారు.

తెదేపా ప్రభుత్వ వ్యతిరేక వోటును కుదిరినంతవరకు చీలకుండా మహా కూటమి పేరుతో ప్రయత్నిస్తుంది. ఆ దిశగా అప్పుడే నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగిపోయింది. తెరాసతో పొత్తు మాత్రమే ఇంకా మిగిలిఉంది. ఒక వేళ తెరాసా కనుక తెదేపాతో చేతులు కలపకపోతే రాష్ట్రంలో హంగు ఏర్పడుతుంది అని నా అభిప్రాయం.

తెరాసా తమతో చేతులు కలపని యెడల ప్రారాపా ఎన్నికల్లో ఏకాకి అయ్యి అటు డబ్బూ ఇటు తోడు లేక నెట్టుకురావడం చాలా కష్టం. కేవలం చరిస్మాతో ఎంతమంది అని మాత్రం ఓట్లు వేస్తారులెండి. కాని తన వంతు వాటాగా బాగానే ఓట్లు చీలుస్తాడు, సందేహం లేకుండా.

ఎన్నికలలోపు ఇదే పరిస్థితి కొనసాగితే కాంగ్రెస్ ను గద్దె దించడం కష్టమే.

3 comments:

author_number_2 said...

కాంగ్రెస్ చేసిన అక్రమాలకి మళ్లీ పదవిలోకి వస్తే, అది దురద్రుష్టకరమయిన పరిస్థితి. అలా అని tdp కూడా అధికారం లోకి వచ్చే సూచనలు కనిపించటంలేదు. చిరంజీవి పార్టీ వోట్ బ్యాంకు ని చీలుస్తుంది కానీ, స్పష్ట మెజారిటీ అనేది కల్ల అని నా అభిప్రాయం. ప్రజలకు మంచి చేసే ఉద్దేశం తో వచ్చిన మరొక పార్టీ, లోక్ సత్తా పార్టీ. కాని పోటి చేసే మొదటి ఎన్నికలలోనే మెజారిటీ రాదని వాళ్ళకి కూడా తెలుసు. హంగ్ ఒక్కటే మార్గం గా ప్రస్తుతం కనిపిస్తున్నా, ఎన్నికలు సమీపించే కొద్దీ స్పష్టత ఏర్పడుతుందని నా భావన.

Anji Babu said...

నేను ఒక పోస్టులో రాసినట్లు, మన ఓటరుకి వోట్ వేసేప్పుడు నూటికి తొంభై శాతం ఉన్న వెధవలలో ఉత్తమ వెధవను ఎంచుకోండి అనే ఆప్షన్ మాత్రమే మిగులుతుంది. ఇక లోక్ సత్తాకి ఎలెక్షన్ గెలిచే సత్తా లేదు. అటువంటి పార్టీలకు బాగా వృద్ధి చెందిన దేశాలలో మంచి ఆదరణ ఉంటుంది. మన దేశంలో ఉల్లిపాయల రేట్లు ఎన్నికల ఫలితాలను ఇంకా ప్రభావితం చేస్తాయి.

ప్రజారాజ్యం అంటారా, వాళ్ళు రాజ్యాధికారం కోసం తాపత్రయ పడితే తప్పు చేసిన వాలవుతారు. కుదిరినాన్ని ఎక్కుఅవ సీట్లు గెలవడానికి ప్రయత్నించాలి. ఓటు శారు సంపాదించి ఏమి ప్రయోజనం. అసెంబ్లీ లో నుంచుని ప్రభుత్వాన్ని నిలదీసేంత బలం అయినా సంపాదించుకోవాలి.

Anonymous said...

ఎన్నికల గురుంచి పక్కన పెడితే నిజాలు మాట్లాడదాం!

తమ్ముడు డైలాగులు జుగుప్సాకరంగా వున్నాయి...పంచెలూడదీసి కొట్టమనడం ఎంతవరకు కరెక్టు? దేశద్రోహి అవునో కాదో ప్రజలె తేలుస్తారు, సినిమా స్టైలు ఎందుకంట? నిల్చుని మాట్లాడటం మనకి వస్తే, మంచి కథలు ఎన్నుకుని(అపరిచితుడు, చంద్రముఖి, బాబా, అరుణాచలం, స్టాలిన్, జర్నలిస్టు లాంటి కథలకి తగ్గ అలోచనా సామర్థ్యానికి మనం చాలా దూరంలో వున్నామన్న భావన ప్రజల్లో ప్రస్ఫుటంగా వుంది) స్క్రీన్ షో టేలెంట్(స్కిన్ షో టేలెంట్ కాదు, మన తెలుగు జాతిలొ ఇంకా స్క్రీన్ షో చేసే అమ్మాయిలు/స్త్రీలు వున్నారన్న విషయాన్ని మెల్టన్, అగర్వాల్, బెంద్రే, కొటాక్, ఇలియానా, ముఖర్జీ, 3ష, తార లాంటి వాల్లను ఫిల్ అప్ చేసిన స్టార్స్ మర్చిపోయినా 'సామాన్యుడు కళ్లు తెరిచే వున్నాడు! కల్లు కాదు!) వున్నవాళ్లను హీరొయిన్స్ ని చేస్తే, భార్యలని గౌరవించడం మనకి అలవాటు వుంటే 26 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకత్వం వహించి, ఎదురేలేదన్న హైటెక్ ముఖ్యమంత్రిని పాదయాత్ర ద్వారా ప్రజలకి దగ్గరై మనకు హైటెక్ ముఖ్యమే కానీ అంత కన్నా మన భూమి వ్యవస్థని గుర్తుపెట్టుకుని పని చేయడం మంచిదన్న వ్యక్తి సీఎం అయితే ఎందుకంత ఉలుకు? ఉడుకుతనం ఎందుకంట?

ఇక పొతే ఎన్నికల ఫలితాలలొ….
తెలంగాణ విషయం ముందుంటుంది,

అలాగే నిత్యావసరాల ధరలు, పెట్రో మంటలు,

బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ కేంద్రం హైదరాబాద్ లొ వుండడమే జన్మ సార్థకత అవునో కాదో, వున్నదానికీ లేనిదానికీ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లపై కళ్లు వురమడం అవసరమో లేక పని లొ వారికి స్వేచ్చ ఇవ్వడం, మంత్రులకి విచక్షణాధికారం ఇవ్వడం అవసరమో లేదో, మీడియాతో అంతా బాగుందని రాయించుకోవడం ముఖ్యమో కాదో, తెలంగాణ వద్దు - సమైఖ్యాంద్రే ముద్దు అనీ ప్రజలతో రొమాన్స్ చేసిన వారు ముఖ్యమో కాదో......

ప్రజల అవసరాలు తీరడానికి కేవలం సంక్షేమ పథకాలే ముఖ్యమో కాదో తేల్చే సమయం ఆసన్నమయింది ......మేలుకో తెలుగువీరా! మేలుకో భారతీయుడా! నీ సత్తా చాటుకొవడానికి లోకం సత్తా చూపించు మరీ!

నా ప్రెడిక్షన్....

1. కాంగ్రెస్ -> 150+, చిరంజీవి -> 70+, టీడీపి కూటమి -> 60+, లోక్ సత్తా -> రెస్ట్!

2. కాంగ్రెస్ –> 120-130, చిరంజీవి -> 90+, టీడీపి కూటమి -> రెస్ట్!

3. అందరికీ సమానంగా వస్తాయి.....లోక్ సత్తా కొంత సత్తా చాటుతుంది....

అయినా సీబిఎన్ పని అయిపోదు, వైఎస్ అసలే వెల్లడం జరగదు... చిరంజీవికి మాత్రం సినిమా వాళ్లకి ఇంకా ఆదరణ తగ్గలేదని నిరూపించుకునే అవకాశం వస్తుంది.. థర్డ్ ఫ్రంట్ అసాధ్యం...మళ్లీ ఎన్నికలు వస్తాయి....లోక్ సభ ఫలితాలు ఇప్పుడు కేంద్రం పాకిస్తాన్ మీద ఎటాక్ చేస్తుందో లేదో అన్న విషయం మీదే ఆధారపడుతుంది....

Post a Comment

Please leave your comments here.

Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.

 

Receive posts in your Inbox

Enter your email address:

Delivered by FeedBurner

Mobstac Badge