You may want to see the entire list of posts on this blog sorted by Date. Click here for the entire Table of Contents

If you like this blog you may want to subscribe to the RSS feed | Subscribe

10 December 2008

'ఈనాడు' చేసే చూసే రాజకీయం

సిహెచ్ రామోజీ రావు: ఆంధ్ర ప్రదేశ్ లో ఒక ముఖ్య స్థానాన్ని ఏర్పరుచుకున్న వ్యక్తి. తనదైన శైలిలో అనేక వ్యాపారాలను ఆరంభించి ఎన్నో విజయాలను చవి చూసిన, మనము గర్వించదగిన తెలుగు వాడు. వ్యాపారాలను ఎలా నడపాలి అని ఆయన చెపితే మనం ఎంతసేపైనా వినవచ్చు.

కానీ రాజకీయాల విషయానికి వస్తే నేను ఆయన మాట వినడానికి రెడీగా ఉండను. కాంగ్రెస్ పార్టీకి ఆయన భయంకరమైన వ్యతిరేకి అని మనకు తెలిసిందే. అయితే కాంగ్రెస్ వాళ్లు ఏమి చేసినా తప్పని చూపించడం, ఏదైనా మంచి పని చేసినా అందులో తప్పు ఎంచడం ఆయన స్థాపించిన ఈనాడు పేపరుకు అలవాటుగా మారింది అనేది నిత్య సత్యం.

ఈ మధ్యనే నేను " పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలా ? " అనే టాపిక్ మీద రాసాను. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ రేట్లను తగ్గిస్తూ ఒక ప్రకటన చేసింది. అయితే ఇన్నాళ్ళు చమురు రేట్లను తగ్గించాలని అడిగిన ఈనాడు, ప్రభుత్వం తగ్గించిన వెంటనే ఏదో ఒక తప్పు ఎంచాలి అనే ఉద్దేశ్యంతో "తగ్గేప్పుడు ఆ జోరు ఏది" అనే శీర్షికన ఈనాడు ఫ్రంట్ పేజీలో ముఖ్య కధనం రాసింది. (06-12-2008)

వీళ్ళ జర్నలిజం ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో చూడడానికి మొత్తం వ్యాసం చదివాను. ఎంత సేపూ చమురు రేట్లు తగ్గినంతగా పెట్రోల్ డీజిల్ రేట్లను తగ్గించలేదు అనే వాదించారు కాని ఎక్కడా అమెరికన్ డాలర్ రేట్ విపరీతంగా అంటే ౩౦% వరకు పెరిగిన విషయాన్ని ప్రస్తావించలేదు. మనం చమురు ఉత్పతి చేసే దేశాల వద్ద డాలర్ రూపేణా చమురు కొంటాము అనే విషయం కూడా పాఠకులకు చెప్పలేదు. ఆ ముక్కా చెపితే ఇంక కాంగ్రెసను తప్పుపట్టడం కుదరదు కదా.

తమ ప్రయోజనాల కొరకు తమకు నచ్చిన రాజకీయ పార్టీల ప్రయోజనాల కొరకు వార్తలను మలుచుకుని పాఠకులకు తమకు నచ్చిన విధంగా వార్తలను సమర్పించడం ఈనాడుకే కాదు, ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్నా దాదాపు అన్ని పత్రికలకు అలవాటు అయిపోయింది. ఇలాంటి సమయాలలో దేశంలో జరిగిన, జరుగుతున్న విషయాలను తెలుసుకోవాలని పత్రికలను ఆశ్రయిస్తున్న మన రాష్ట్ర ప్రజల పరిస్థితి పాపం దారుణం.

4 comments:

Rajendra Devarapalli said...

:)

Anji Babu said...

దేవరపల్లిగారి భావానికి అర్థం ఏమిటో ! మీరు జర్నలిస్టు అని తెలుస్తుంది. బహుసా మీరు నాతో భీబత్సంగా ఏకీభవిస్తున్నారు అనుకుంటా !

వందే మాతరం

Suresh said...

avunu neenu meeto ekibhavistunnanu. Sarina information ivvatamlo eenadu poorthiga vofalam ayyondi. eenadu journalism sthayi digajarindani cheppali. I only read eenadu but it looks so stupid to me. No proper data it made available to people. As you mentioned like dollar issue. Konnisarlu adi vrase news kooda chala funny ga vuntundi. Adi eendau nunchi ayithe inverted comas to ''eenadu'' ani vrasthundi. Lekapothe cm garu oka telugu news channel ki icchina interview lo ani cheptundi. It donot or never sited source for copied news. One can simply sit infront of internet and i will assure he can write better news than eenadu now a days!

Anonymous said...

@Suresh

"హెరిటేజ్ ఫుడ్స్" వ్యవహారం ఈనాడు నిష్పాక్షిక జర్నలిజానికి మరొక మచ్చుతునక

వందే మాతరం.

Post a Comment

Please leave your comments here.

Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.

 

Receive posts in your Inbox

Enter your email address:

Delivered by FeedBurner

Mobstac Badge