You may want to see the entire list of posts on this blog sorted by Date. Click here for the entire Table of Contents

If you like this blog you may want to subscribe to the RSS feed | Subscribe

23 November 2008

పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలా ?

మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్ర బాబు నాయుడు ఇటీవల ముడి చమురు రేట్లుతగ్గినందువల్ల ప్రభుత్వం వెంటనే పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించాలని డిమాండ్ చేసారు.


ఇది నిజమే కదా. ప్రభుత్వం మాత్రం రేట్లు తగ్గించకుండా సొమ్ము చేసుకుంటుందేమో అనే ఆలోచన మనలో రావచ్చు.

క్రమంలో ప్రభుత్వం ఎందుకు రేట్లు తగ్గించ వద్దు అంటే ?

1. విషయంలో వాస్తవాలు ఏమిటంటే ముడి చమురు రేట్లు ఆకాశాన్ని అంటినా ప్రభుత్వం రేట్లు పెంచడంలో జాప్యంచేయడం వలన మన జాతీయ కంపేనీలు ఎంతో నష్టాన్ని చవి చూసాయి.

నష్టాన్ని పూరించేందుకు కాకపోయినా తదుపరి కొనుగోలులలో కంపెనీలు నష్టపోకుండా ఉండేలా కేంద్ర ప్రభుత్వంరేట్లు స్వల్పంగా పెంచింది. అయితే గత కొంత కాలంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనేక పరిస్థితుల వలన ముడిచమురు రేటు బాగానే తగ్గిందని చెప్పాలి.

అంతే కాక ట్రెండ్ ఎంత కాలం కొనసాగుతుందో తెలియక ముందే ప్రభుత్వం రేట్లు తగ్గించినట్లయితే సమీప భవిష్యత్తులోరేట్లు పెరిగిన యెడల మన జాతీయ కంపేనీలు తిరిగి భారీగా నష్టపోయే అవకాసం లేకపోలేదు.

2. రెండు నెలల ముందు వరకు 36-38 రూపాయల మధ్య ఉండే డాలర్ రేటు ఇప్పుడు ౫౦ రూపాయల అంచున ఉంది. దాదాపు 35% పెరిగినట్టు. దీనివలన చమురు రేటు బాగా తగ్గినా వస్తావానికి పైకి కనిపిస్తున్నంత తగ్గినట్లు కాదు.

రెండు విషయాలు తెలియకుండానే చంద్ర బాబు రేట్లు తగ్గించమని డిమాండ్ చేసాడని నేను అనుకోను. మననాయకులు వేసే అనేక నాటకాలలో ఇది ఒకటి అని నా అభిప్రాయం.

3 comments:

Srikanth Bendi said...
This comment has been removed by the author.
Srikanth Bendi said...

చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయాలన్నీ తెలుసు.. వాటితో పాటుగా రాజకీయాలు మరికొంచెం ఎక్కువగా తెలుసు అంతే..! వారు.. వారి మధ్ధతుతో అధికారం వెలగబెట్టిన ఎన్.డి.ఎ.ప్రభుత్వం అధికారం లో ఉండేనాటికి బ్యారెల్ ముడి చమురు ధర సుమారుగా 20-25 డాలర్లు ఉండేది.. ఆ కాలంలో వారు వసూలు చేసిన ధర లీటరు పెట్రోలు 40-45 రూ. డీజిల్ 30 రూ. మరి ఇప్పుడు చమురు బ్యారెల్ ధర 45డాలర్లుగా ఉంది. అయినా వారీ మధ్యన కొత్త మిత్రులతో చేసిన ఓ ధర్నాలో సూత్రీకరించిన పెట్రొలు ధర 25 రూ. డీజిల్ 20 రూ. ఎంత నీచమైన రాజకీయం. కొంచెం కూడా బాధ్యత లేకుండా కేవలం అధికార పార్టీ మీద నిందలు వేయటమే లక్ష్యంగా కనిపించటం లేదూ..? ఇక కమ్యూనిస్టుల సంగతి సరే సరి..! వారికి దేని మీదా పన్నులు వేయకూడదు.. ప్రజలకు కావలసిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వమే నెరవేర్చేయాలి..! ప్రభుత్వాల దగ్గరేమైనా మంత్ర దండాలుంటాయా? ఇలా అంటే కార్పొరేట్ సంస్థల నుంచి పన్నులు వసూలు చేయమనే ఉచిత సలహా ఒకటి పారేస్తారు. వాళ్ళకి పన్నులు దగ్గర మాత్రమే ఈ సంస్థలు గుర్తుకు వస్తాయి. లేకపోతే వాళ్ళకి ప్రభుత్వాలు రాయితీలిచ్చేస్తున్నాయంటూ గోల. వాళ్ళకి ఎప్పుడూ ప్రభుత్వం ఏర్పాటు చేసే సామర్ధ్యం రాదని ఎలాగూ తెలుసు అందుకనే ఈ కుదరని విధానాలను ఎన్నైనా ఏకరువు పెడతారు. కానీ ఈయన 9 ఏళ్ళ పాటు పాలన వెలగబెట్టారు కదా, ఈ విషయాలన్నీ తెలుసు కదా.. అయినా ఎందుకీ రాజకీయం..? ప్రజలకు తెలియదనుకుంటారేమో..! అన్నీ గుర్తుంటాయి వాళ్ళకి. ఈయనకు ఇలాంటివన్నీ అలవాటే అని చెప్పటానికి మరో ఉదాహరణ. ఆయన అధికారం లొ ఉన్నపుడు "మధ్ధతు ధర బాధ్యత మీదే" అంటూ ఓ సారి సూత్రీకరించారు. కానీ అధికారం పోయాక మధ్ధతు ధర పెరుగుతున్నా దాని మీద ఎన్ని సార్లు ఢిల్లీ లోనూ , హైదరాబాద్ లోనూ ధర్నాలు చేసారో కదా..! ఇవి మచ్చుకు ఒకటీ రెండు ఉదాహరణలు మాత్రమే.. మొత్తం అన్నీ ప్రస్తావిస్తే అది కొండవీటి చాంతాడంత అవుతుంది.

Anonymous said...

శ్రీకాంత్ గారు,

నేను ఏ పోస్టుని తొలగించలేదండి. మీరు దేనిని ఉద్యేసించి చెపుతున్నారో !

ఇక చంద్రబాబు అంటారా. రోజు రోజుకీ దిగజారుడుతనం ఎక్కువ అవుతుంది తప్పితే మనిషికి బుద్ధి మారింది అని నేను అనుకోవడం లేదు.

అంజి

Post a Comment

Please leave your comments here.

Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.

 

Receive posts in your Inbox

Enter your email address:

Delivered by FeedBurner

Mobstac Badge