"స్లమ్ డాగ్ మిల్లియనేర్" సినిమా ఈ మధ్యనే చూశాను. ఏదో పర్లేదు అనిపించింది. కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. సినిమా సంగీతానికి అవార్డులు గెలవడంలో ఆశ్చర్యమేమీ లేదు. రెహమాన్ తన మాయాజాలాన్ని చూపించాడు అనవచ్చు. కాని ఇంత కన్నా మంచి పాటలు, సంగీతం ఇంతకు ముందు చాల సార్లు కొట్టాడు అని ఖచ్చితంగా చెప్పగలను.
ఆ సినిమాలో మన దేశాన్ని చూపించిన విధానం గురించి చర్చలు, మన వాళ్లు ఆ దర్శకుడిని తిడుతున్న తిట్లు విన్నాక జాలి వేస్తుంది. అమితాబ్ బచ్చన్ లేవనెత్తే వరకు ఎవరూ ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఆయన వ్యాఖ్యల తరువాత మాత్రం ఎవరికీ వారు తన దేశాన్ని తప్పుడు కోణంలో చూప్పించారు అని ఆ సినిమా తీసినవాల్లను తిట్టిపోసుకోవడం పరిపాటి అయ్యింది. ఎవరో ఎందుకు. నా మిత్రులలో కూడా కొంత మంది "వాడు ఎలా రా మన దేశం గురించి అల చొప్పించవచ్చు"అని ఒకడు, "అరె మామా మన గురుంచి మనం అనుకోవాలి ర. మధ్యలో ఒక విదేశీయుడు ఎందుకు తీయాలి" అని ఒకడు అంటాడు.
నేనేమంటానంటే అది సినిమా రా బాబు, మరీ ఎక్కువగా రియాక్ట్ అవ్వకు అని. ఉదాహరణకి రాయల సీమలో ఒకరినొకరు చంపుకోవడానికే పుట్టారు అన్నట్టుగా సినిమాలు తీయడంలా, మనోళ్ళు. అవి మాత్రం ఎగ పడి చూస్తామే.
ఒక వేళ కాదూ కూడదూ అన్నా కూడా, మన దేశం వచ్చి అందరూ తాజ్ మహల్ ని మాత్రమే చూడాలి, దాన్ని మాత్రమే పొగడాలి, దాని మీద మాత్రమే సినిమాలు తీయాలి అనుకోవడం పొరపాటు. వాడికి నచ్చింది వాడు తీసుకుంటాడు అని అంటాను. అయినా ఒప్పుకోరు మన వాళ్లు. మన మనోభావాలు దెబ్బతీసాడు అంటారు.
అరె. మన మనోభావాలను గురించి ఎక్కువగా ఆలోచించి మనల్ని మనమే దెబ్బ తీసుకుంటున్నాం. మన దేశంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా కూడా ఫర్వాలేదు, కాని పక్క వాడు దాని గురించి మాట్లాడ వద్దు అంటే ఎలా. అంతగా మనకి ఉలికి పాటు ఉన్నప్పుడు మనం మన పరిస్థితులను బాగు చేసుకోవడానికి పాటు పడాలి. అంతే కాని సినిమాలు చూసి ఓ తెగ ఫీల్ అయిపోవడం ఎందుకు.
You may want to see the entire list of posts on this blog sorted by Date. Click here for the entire Table of Contents
29 January 2009
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
Music is below average, i am a big fan of AR, and i can say that his other movies deserves awards than Slumdog. He got simply because of International Producers of this Movie.
Ramana gaaru,
Perhaps yes. I would reckon the reason is that this particular movie has got exposure and listeners worldwide which has inturn let people think this is good work, which obviously wasn't the case with his earlier films.
Post a Comment
Please leave your comments here.
Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.