You may want to see the entire list of posts on this blog sorted by Date. Click here for the entire Table of Contents
15 January 2009
నేటి ఆంద్ర : ఒక చిన్న రౌండప్
సగం ధరకే కరెంటు : చిరంజీవి
మిగతా సగం ఎవడు కడతాడు. అది కూడా ప్రభుత్వమే కట్టవచ్చు కదా. రాను రాను జనాన్ని ఇంకా బిచ్చగాళ్ళ లాగ తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు నిరుద్యోగ నిర్మూలన గురించి మాట్లాడలేదు కాని వోటర్లకు లంచాలు ఇచ్చే పని హామీల ద్వారా మొదలు పెట్టారు. ఇది వీళ్ళు తెచ్చే మరొక మార్పు. (విజయ్ కాంత్ చాల బెటర్ తమిళనాడులో. ఒక మంచి మానిఫెస్టోతో వచ్చాడు)
సంక్రాతి లక్ష్మికి వై యస్ నివేదన : ఆహా !!
సంక్రాంతిని పురస్కరించుకుని రెడ్డి గారు పేపర్లలో ఫుల్ పేజి యాడ్లు ఇచ్చారు. అదీ మొదటి పేజీలలో. ఏమైనా జనానికి పనికి వచ్చే విషయమా అంటే కాదే: అది వారు సంక్రాతి లక్ష్మికి రాస్తున్న లేఖనట. ఆ మధ్య క్రిస్మస్ కి కూడా రాసినట్టున్నారు. ఈ రాతలు నిజంగా దేవుల్లకా లేక సాక్షి పేపర్లో యాడ్లు ఇవ్వడం కోసం అని కావాలనే అన్ని పేపర్లలో యాడ్లు ఇస్తున్నారా ? ఈ పెద్ద మనిషేనా నాలుగేళ్ళ క్రితం చంద్రబాబు తన హాయాంలో ప్రచారానికీ మూడు వందల కోట్లు ఖర్చు పెట్టాడు అని గగ్గోలు పెట్టింది ?
ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు: బాబు
ఇవ్వండి బాబు. ఇవ్వండి. ఎవడబ్బ సొమ్మని. ఒకడు కరెంటు. మరొకడు ప్రకటనలు. నువ్వు ఇల్లు.
అప్పట్లోనేమో నెలకొక రోజు ఊరి మీద పంపి బలవంతంగా మురుగు కాలువలు శుభ్రం చేయించాడు.
పోయిన ఎన్నికల్లో దగ్గరుండి బాబుకి వ్యతిరేకంగా వోట్లు వేయించిన ఉద్యోగులను ఇవ్వాళ మచ్చిక చేసుకుంటున్నాడు.
కాంగ్రెస్ మునిగే నావ: విద్యాసాగర్ రావు
ఇదీ కామెడీ అంటే. కాంగ్రెస్ మునిగే నావ ఐతే మరి బీజేపీ ఎగిరే విమానమా. దేశమంతా ఎలా ఉన్నా ఆంధ్రాలో మాత్రం బీజేపీని జనం ఎప్పుడో మరిచిపోయారు. మీరు గమనించారో లేదో. శాసన సభలో కిషన్ రెడ్డి ఉద్వేగభరితమైన ప్రసంగం చేసిన తరువాత అంతే సీరియస్ గా "బీజేపీ తరపున మేము వాకవుట్ చేస్తున్నాం" అంటాడు, తీరా చూస్తే ఓ మూల నుండి ఇద్దరు లేచి వెళ్లిపోతుంటారు. ఎవ్వడూ పట్టించుకోడు. ఇక ఈ సారి ఎన్నికలయాక ఆ ఇద్దరు కూడా వస్తారో రారో. ( మరిచే పోయాను సుమా. ఉన్నా ఇద్దరిలో ఒకరు ప్రారాపాకి జంపు కదా. పాపం !)
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
బాగుంది మీ రౌండప్, నిజమే నిరుద్యోగ సమస్యను పట్టించుకోకుండా అన్నీ ఉచితం అని జనాలని బద్దకస్తులని చేస్తున్నారు.
అంత ఇంతా కాదు. కొన్ని దేశాలలో ఇలా తెరగా వచ్చే వాటికి అలవాటు పడి జనాభాలో ఎంతో శాతం మంది సమాజానికి భారం అవుతున్నారు. మన దేశంలో అలాంటి భావనలు మన వాళ్లు తప్పక తెచ్చేలా ఉన్నారు.
చంద్రబాబు నిరుద్యోగ యువతకు వెయ్యి రూపాయల నెల వేతనం ఇస్తాను అంటున్నాడు. అందులో స్కామ్ చేయడానికి మంచి ఆస్కరముందేమో మరి ?
Post a Comment
Please leave your comments here.
Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.