మొన్న ప్రెస్ మీట్ లో చిరంజీవి మాట్లాడుతూ మహా కూటమిలో చేరిన అన్ని పార్టీలను తూర్పారబట్టాడు. సహజమే అంటారా. సరే. కాని గురుడు అన్ని పార్టీలను ప్రశ్నించాడు. ఏమి నచ్చి తెదేపాతో చేతులు కలిపారు అని. అంటే వీరంతా మంచి వారు, వాళ్లు అంటరాని వారు అనేనా.
ఆ ప్రశ్నలు కొంత వరకు..అంటే చాల వరకు సమంజసమే. కాని అది ఏ లోక్ సత్తా వాళ్ళో అంటే ఇంకా బాగుండేది. అంటే వీళ్ళు అనకూడదు అని కాదు. నేను వేరే కోణంలో చూస్తున్నాను.
ఇన్నాళ్ళుగా ఈ పార్టీలన్నీ ఏమి ఉద్ధరించాయి అని వీరితో పొత్తులు నడపడానికి సిద్ధం అయ్యారో చెప్పనే లేదు. అందుకే నీను ఇలా అడుగుతున్నాను.
--> తెరాసా వాళ్ల ఏ సిద్ధాంతం నచ్చి వారితో పొత్తుకి సన్నద్ధులై చర్చలు జరిపారు. ప్రజలలో ఉన్నా ప్రాంతీయ భావాలను కొంత వరకు హైజాక్ చేసి, ఇదిగో తెలంగాణ అదిగో తెలంగాణ అంటూ ఇన్నాళ్ళు మోసం చేయడం భావ్యమని మీ అభిప్రాయమా ?
--> చంద్రబాబుని కమ్యూనిస్టులు ప్రపంచ బ్యాంకు జీతగాడు అన్నారు సరే. మరి కమ్యూనిస్టులు ఏమి పొడిచారు అని వాళ్ళతో పొత్తు కలపాలి. నందిగ్రామ్లో, సింగూర్ లో జరిగిన మారణకాండలను సమర్దిస్తున్నట్లేనా ?
--> సి పి ఐ పార్టీ వాళ్లు అధిష్టానానికి తలొగ్గి తెదేపాతో వెళ్లారు అన్నాడు. అస్సలు ఆ పార్టీకి ఒక సిద్ధాంతం ఉందా. సి పి ఎం వాళ్లు కలవకపోయిన ఒక సం! క్రితం వరకు కాంగ్రెస్ తో కులికిన పార్టీ అది. మరి వాళ్ళతో ఎలా కలిసి ఉండాలి అని వచ్చింది.
వీరిది ప్రజా ప్రయోజనాలకోసం ఏర్పడిన కూటమి కాదు అని, కేవలం రాజకీయ అవసరాల కోసం ఏర్పడినది అని అనడం విడ్డూరం.
ఏ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాయావతి పార్టీతో పొత్తు కోసం ఎగబడుతున్నారు అని నేను అడుగుతున్నాను. ప్రజలను అమాయకులను చేసి కుల రాజకీయాలను రెచ్చగొట్టి తనను తాను 'దేవత' అని చెప్పుకు తిరుగుతున్న ఆమెలో, ఆమె పార్టీలో ఏమి నచ్చిందో కూడా వివరిస్తే వినాలి అని ఉంది.
అస్సలు మాయావతి గురించి పవన్ కళ్యాణ్ అభిప్రాయం వినాలి అని ఉంది.
You may want to see the entire list of posts on this blog sorted by Date. Click here for the entire Table of Contents
18 January 2009
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
nenu meetoekeebhavistunnanu ,chiru garu modati nundi ayana kani ayana party nayakulu kaani tama vidhanam ,tama pratyekata emito cheppatledu(JP LOKSATTA CHEPPINATTU) ,enta sepu vallu baagaleru ,vveellu bagaleru,ani andarini vimarsinchadam tappa id samanya janam lo chaal charchaku vastundi .memu kotha rajakeeyam testamu antunnaru meeru teche rajakeeyam elantido cheppandi ani prajalucharchinchukuntnnaru
entasepu avatali vallanu vimarsinchadam tone rojulu gaduputunnaru kaani meeru teche maarpu elantito cheppatledu,idi samanya janamu leda voter lo e nadu jarugutunna charcha.PRP nayakatvamanta TDP nunchi veelinavare kabatti kotha seesa lo paata saara annatt undi PRP paristiti.meeru annattu chirugaru anniti answwer cheyali ninna ayana maatalu vintuntee chinna pilllau akkasuto matladinattu undi kaani andulo vere bhavam kanipinchaledu
vijaybhaskar
Post a Comment
Please leave your comments here.
Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.