ఈ మధ్య మన తెలుగు బ్లాగు గుంపులో 'లత్తుకోరు' అనే మాట, దాని అర్థం గురించి ఔత్సాహికుల మధ్య సంభాషణ జరిగింది. ఆ మాటకు సరిగా సరిపోయే పని ఒకటి నాకు అగుపడింది.
మన రాజకీయ నాయకులు ఎన్నో లత్తుకోరు పనులు చేస్తారు అని ఎవరూ చెప్పకుండానే మనందరికీ తెలిసిన విషయం. అయితే అవి చేయడంలోనయినా కాస్తంత అర్థం పర్థం ఉండేలా చేస్తారా అంటే లేదే. ఇట్టే దొరికిపోఎలా, బయటికి తెలిసిపోయేలా చేస్తారు. అలాంటప్పుడు దొంగతనంగా చేయడం ఎందుకోయి అని అంటాను.
మొన్న టీవీ లలో చూసే ఉంటారు. సోనియా గాంధీ ఇంటికి దేవె గౌడా కుమారుడు కుమారస్వామి ముఖానికి ఏదో అడ్డు పెట్టుకుని "కళ్ళు మూసుకున్న పిల్లి చందాన" కారు ముందు సీట్లో కూర్చుని "లే. నన్నెవరు సూత్తల్లె" అన్నట్టుగా పోయాడు. మన మీడియా కళ్ళకి నేరుగా కనిపించినా వదిలేస్తారు కానీ ఇలా దొంగచాటుగా వెళ్ళబోయి దొరికితే వదులుతారా ఏంటి. వెంటనే టీవీలు అన్నింట్లో ఆ ఘనకార్యం ప్రసారం. ముసుగు చాటున దేవేగవుడ కుమారుడు అని హేడ్లయిన్స్.
ముఖ్యమంత్రి గా ఒక రాష్ట్రానికి కొన్నాళ్ళు పని చేసిన కుమారస్వామి ఒక్కసారిగా చిల్లరసామి అయిపోయాడు. ఏమయ్యా. పోయేదేదో పోతున్నావ్. ఆ దాగుడేందో వెనుక సీట్ల చేసినట్లయితే మంచిగుండేటిది కదా. కక్రుత్తి పడ్డావ్. అభాసు పాలయ్యావ్.
ఇంతకు మించిన తాజా ఉదాహరణ "లత్తుకోరు" పదానికి ఉండదేమో.
0 comments:
Post a Comment
Please leave your comments here.
Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.