కేంద్ర మంత్రి వర్గంలో ఆంధ్రాకి మరలా అన్యాయం. ఇది వరుసగా రెండో సారి మన రాష్ట్రానికి జరుగుతున్న పరాభవం.
సీట్లు మన వాళ్ళవి. పదవులు దేశంలోని మిగిలిన అన్ని ప్రాంతాల వారివి. ఎంత అన్యాయం. ఇంతకన్నా దారుణమయిన ట్రీట్మెంట్ మరే ఇతర రాష్ట్రానికీ దక్కలేదు. ముప్పై మూడు మంది యంపీలను పంపినా కూడా మన రాష్ట్రం పైన కొంత కూడా కృతజ్ఞతా భావం లేకుండా కాంగ్రెస్ పార్టీ వారు ప్రవర్తిస్తున్నారు.తెలుగుదేశం పార్టీ పెట్టిన వెంటనే ప్రజలు బ్రహ్మరథం పట్టడానికి ఇటువంటి చర్యలే కారణం.
రాష్ట్ర మంత్రివర్గ కూర్పులో తల దూరచలేదు అనే కృతజ్ఞతా భావంతో వైయస్ ఈ విషయంలో పట్టువిడుపుగా వ్యవహరించినట్లున్నారు. ఆరుగురు యంపిలను పంపిన కర్నాటకకి మనకన్నా ఒక మంత్రి ఎక్కువ. మొదటిసారిగా కేంద్ర మంత్రి అవుతున్నవారు కూడా కాబినెట్ మంత్రి పదవినలన్కరించనున్నారు. మన రాష్ట్రానికి మాత్రం ఒకే ఒక కాబినెట్ మంత్రి, మిగిలిన వారంతా సహాయ మంత్రులు. ఇలాంటి అన్యాయం ఇంకెంత కాలమో?
7 comments:
Andhra gave 33 MPs to congress. It gave 29 last year apart from lot of party funds. But congress leadership is thankless. They gave just one cabinet and 5 MOS to AP. Does high-command think that AP produces MPs that are not eligible for ministry? If so, why did you select them while giving seats. The congress leaders from AP are spine-less, just say we will accept whatever Soniaji and Rahulji decodes that is final.
This is a a matter of self-respect. Our AP congress leaders should open their eyes.
కాంగ్రసోళ్ళకి ఆత్మగౌరవమా? ఎంత మాట, ఎంతమాట.
అది వాళ్ళ నిఘంటువులోనే లేదు.
@ Bhaskar
Its actually one Cabinet and 4 MoS. Jairam Ramesh (a very efficient person I must admit) is a Rajya Sabha member from AP but is not from AP himself.
They should open their eyes and protest, I believe with threats of resignations and no less.
There are MPs who have been representing us for 4-5 times now who certainly deserve a chance better than the smug A. Raja of the DMK.
YSR has cleverly managed to be out of the country when this is all happening.
What a shame for all of our people!!
@ పద్మనాభం దూర్వాసుల:
ఈ విషయంలో తగిన విధంగా ప్రతిఘటించలేక పోతున్న కాంగ్రెస్ వారిని చూస్తే ఆ మాట నిజమే అనిపిస్తుంది. అల అనిపించడం ఇదే మొదటి సారి కాదు అనుకోండి!!
ఈ జరుగుతున్న తంతు YSR కి తెలియకుండా జరిగిందనుకుంటున్నారా? అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. లేకపోతే సాయిప్రతాప్ కి మంత్రిపదవి ఎలా వచ్చిందో, అది కూడా Steel ఎలా వచ్చిందో చెప్పండి చూద్దాం. ఒకటి మాత్రం నిజం. వాపుని చూసి బలుపు అనుకుంటున్నారు. అనుభవిస్తారు. వినాశకాలే విపరీత బుద్దీ అని ఊరకనే అన్నారా?
వై యస్ కి తెలియకుండా ఉండే సమస్యే లేదు. ముందుగానే చెప్పినట్టునారు, ఇలాగా అని. కుర్రోడు తన కాబినెట్ సంగతి చూసుకును పుసుక్కున ఫ్లైట్ ఎక్కి పారిపోయాడు ఎక్కడ జనానికి సమాధానం ఇవ్వాల్సి వస్తుందో అని.
Post a Comment
Please leave your comments here.
Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.