సభ్య సమాజం ఒక వ్యక్తి పైన తన అభిప్రాయాల చెత్తను రుద్ది గెలిచిన వైనం ఇది.
పవన్ కళ్యాణ్ జీవితంలో ఏదో చేద్దాం అని అనుకున్నాడు. తనకు నచ్చిన విధంగా జీవించాలి అనుకున్నాడు. కాని పాపం ఇటువంటి పరిస్థితి వస్తుందని కొన్నాళ్ల క్రితం ఊహించిఉండడు.
తన అన్న రాజకీయ ఆరంగేట్రం కోసం త్యాగం చేసాడా? లేక తను అనుకున్నది సాధించడం కోసం అడ్డంకిగా భావించాడో? లేక తను కోరుకున్నట్లుగా జీవిస్తున్న ఒక స్త్రీ, తన సహచరుడి రాజకీయ ఆరాగేట్రం వలన ఎదుర్కోవలసి వస్తున్న విమర్శలు, వినవలసి వస్తున్న ఛండాలపు పోలికలు, అత్యంత నీచమయిన రాజకీయ బాణీల నుండి విముక్తరాలుని చేయాలనో ?
ఫలితం నిన్న మనం చూసాము. పవన్ కళ్యాన్ రేను దేశాయ్ ని పెళ్లి చేసుకున్నాడు.
పెళ్లి తప్పు కాదు. కానీ సమాజం ఈ జంటపై తన ముద్రని వేసిన తీరు. మేజర్లు అయిన ఇరువురి అభిప్రాయాలకు రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్చని నేటి సమాజం అపహాస్యం చేసిన తీరు బాధాకరం.
రాజకీయాలలోకి అడుగేయటంతోనే అతను అడిగే ప్రశ్నలకు బదులు చెప్పలేక, సరైన జవాబుదారీ తనం లేక, నీచపు బుద్దితో కేవలం తమను ప్రస్నిచారు, విమర్శించారు అనే అక్కసుతో మరొక మనిషి వ్యక్తిగత జీవితం గురించి హేయమైన విమర్శలు చేసిన కుళ్ళు మనస్తత్వాలు ఇంకా మన మధ్య ఉన్నంత కాలం మన పరిస్థితులు మెరుగు పడుతాయి అని నేను అనుకోను.
తన ప్రవర్తనతో పవన్ కళ్యాన్ నా దగ్గర మార్కులు కొట్టేసాడు. ( అలాగని అతని రాజకీయ అభిప్రాయాలతో ఎకీభావిస్తున్నని అర్థం కాదు. )
You may want to see the entire list of posts on this blog sorted by Date. Click here for the entire Table of Contents
29 January 2009
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
నిజమే మీరన్నది.
ఒకవేళ ఇటువంటివి ప్రశ్నించాలి అనుకుంటే ప్రతి పార్టీలోను ఉన్నారు కదండీ ఇటువంటి వాళ్ళు.
మంత్రి చిన్నారెడ్డి విషయం అప్పుడెప్పుడో పేపర్లో చదివినట్టు గుర్తు..మరి గంగాభవాని గారికి గుర్తులేనట్టు ఉంది.
మేజర్లు అయిన ఇరువురు సహజీవనం చేయటం పర్లేదా? అతనికి భార్య వున్నా పర్లేదా? పెళ్ళి మాత్రం చేసుకోకుండా వుంటే చాలా? మరి వేశ్యా గృహాలపై దాడులెందుకు? వాళ్ళు కూడా మేజర్లు అయినప్పటికీ జరిమానాలెందుకూ?
రాను రానూ రామా అంతే తప్పవుతోంది.
చైతన్య గారు,
కరక్టే. ఇటువంటివి పరిస్థితులు ఎవరికైనా ఉండవచ్చు. కాని వ్యక్తిగత జీవితానికి సంబధించిన విషయాలు వచ్చేసరికి ఏ వ్యక్తీ మరొకరికి జవాబు దారి కాదు. అదే నేను చెప్పదలచాను.
@ పెదరాయుడు
సహజీవనం తప్పు కాదా అంటే : ముమ్మాటికీ కాదు. మన రాజ్యాంగం దానిని గుర్తిస్తుంది.
భార్య ఉంది సహజీవన చేయడం అంటారా:
ఇక్కడ పరిగణలోకి తీసుకోవలసిన parameters కొన్ని ఉంటాయి. కోర్టు అవన్నీ పరిశీలించాకే పవన్ కళ్యాణ్ ని విముక్తుడిని చేసిందని నేను నమ్ముతాను. ఇక కోర్టు తీర్పు తప్పు అంటే నేను ఏమి మాట్లాడలేను.
వేశ్య గృహాలపై దాడులు : మన దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర చట్టం, సరైన అవగాహన లేక, ఒక చోట సరి అయినది మరోచోట తప్పు అన్న చందాన అమలుపరుస్తున్న నీతితో వచ్చిన చిక్కులు. ఇప్పుడు అవలంబిస్తున్న వైఖరిని మార్చుకుని, వేశ్య వృత్తిని ప్రభుత్వం గుర్తించాలి, చట్ట బద్ధం చేయాలి అనేది నా వ్యక్తిగత అభిప్రాయం.
@పెదరాయుడు: immoral trafficking కూ consensual sex కూ చట్టపరంగా చాలా తేడా ఉంది. భార్య ఉండగా మరోస్త్రీతో సంబంధం కలిగుంటే, చట్టం చెయ్యగలిగేదేమీ లేదు భార్యకు విడాకులు తీసుకునే హక్కును కల్పించడంతప్ప. మీరు దయచేసి సామాజిక నమ్మకాల్నీ, చట్టాల్నీ ఒకటిచేసి చూడటం మానెస్తే చాలావాటికి సమాధానాలు దొరుకుతాయి.
Post a Comment
Please leave your comments here.
Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.